Janaki Kalaganaledu July 29th Episode: దొంగచాటుగా మందు బాటిల్స్ తెచ్చిన జానకి.. తేలివిగా తప్పించిన రామ!

స్టార్ మా డైలీ సీరియల్ జానకి కలగనలేదు రోజురోజుకు మరింత ఉత్కంఠభరితంగా మారుతోంది. నెవ్వర్ బిఫోర్ అనేలా ట్విస్టులు కూడా క్రియేట్ అవుతున్నాయి. జానకి ఐపీఎస్ చదువు అసలు ట్రాక్ లోకి వచ్చేసింది. జానకి , రామ లవ్ సీన్స్ కూడా అందంగా కొనసాగుతున్నాయి. రామ భార్య కోసం తీసుకునే భవిష్యత్తు నిర్ణయాలు కూడా ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఇక భర్త అమాయకత్వ ప్రేమలో జానకి ఆశయం మొదలైంది. కానీ అత్త జ్ఞానాంబ కట్టుబాట్లు ఊహించని అనుభవాలను నేర్పుతోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 94వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

రామ సంతోషం

రామ సంతోషం

జనాకికి ఐపీఎస్ చదివించాలని రామ తీసుకున్న నిర్ణయం జ్ఞానాంబకు తెలుస్తుందా లేదా అనే విషయం ఎంతో ఉత్కంఠకు దారి తీస్తోంది. సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ పరీక్షల్లో టాప్ సెకండ్ ర్యాంక్ రావడంతో రామ ఎంతగానో సంతోషిస్తాడు. ఇక ఆమె పరీక్షల కోసం కావాల్సిన బుక్స్ ను కూడా తెప్పిస్తాడు. అయితే అదే సమయంలో కన్నబాబు, మల్లిక అనుమానాలు వ్యక్తం చేస్తారు.

మామ కోసం దొంగచాటుగా మందు బాటిల్స్

మామ కోసం దొంగచాటుగా మందు బాటిల్స్

ప్రతిరోజు గోవిందరాజు బయటకు వెళ్లి తాగి వస్తున్నాడు అని జానకి ప్రత్యేకంగా మందు బాటిల్స్ ను తెప్పిస్తోంది. చికిత్త ద్వారా తెప్పించిన ఆ బాటిల్స్ ను సంచిలో పెట్టికొని వెంటనే జ్ఞానాంబ పక్కన ఉన్న గోవిందరాజుకు ఫోన్ చేస్తుంది. స్టార్ రూమ్ వద్దకు రావాలని అంటుంది. దీంతో గోవింద రాజు కూడా కోడలి మాటలకు సంతోషంతో బయటకు వెళతాడు.

ఆ సంచులలో ఎమున్నాయి?

ఆ సంచులలో ఎమున్నాయి?

ఇక మరోవైపు రామచంద్ర బుక్స్ ను సంచిలో పెట్టుకొని ఇంట్లోకి వస్తాడు. చీకట్లో ఎవరు చూడలేదు కదా అని అనుకుంటాడు. కానీ అప్పుడే జానకి కూడా అనుకోకుండా డ్యాష్ ఇస్తుంది. ఈ క్రమంలో మల్లిక అనుమానంతో ఆ సంచులలో ఎమున్నాయి అని ఆరా తీస్తుంది. అదే క్రమంలో జ్ఞానాంబ కూడా అక్కడికి వస్తుంది.

అలా తప్పించుకున్న రామ, జానకి

అలా తప్పించుకున్న రామ, జానకి

ఇద్దరి చేతులలో సంచులు ఉన్నాయని మల్లిక అనుమానం వ్యక్తం చేయగా జానకి ఫినాయిల్ బాటిల్ అంటుంది. ఇక రామ షాప్ లో పొట్లం కట్టడం కోసం పుస్తకాలు తెచ్చినట్లు అబద్ధం చెబుతాడు. ఇద్దరు అలా తప్పించుకుంటారు. కానీ మల్లిక మాత్రం ఎదో ఉందని అనుమానం వ్యక్తం చేయగా రామ ఆమెను వెళ్లిపొమ్మని చెబుతాడు.

అమ్మ బిడ్డకు చెబుతున్నట్లు

అమ్మ బిడ్డకు చెబుతున్నట్లు

ఇక మరోవైపు స్టార్ రూమ్ దగ్గరకు వచ్చిన గోవిందరాజుకు జానకి మందు బాటిల్స్ ఇచ్చి సంతోష పెడుతుంది. అనంతరం బయటకు వెళ్లి తాగడం అత్తయ్యకు బాధ కలిగిస్తోంది. ఇంట్లోనే కొద్దిగా తాగేసి పడుకోండి అంటూ జానకి వివరణ ఇస్తుంది. ఇక గోవిందరాజు కూడా ఒక కూతురిలా కాకుండా అమ్మ బిడ్డకు చెప్పినట్లు జాగ్రత్తలు చెబుతున్నావు అంటూ ఎమోషనల్ అవుతాడు.

మరో తప్పు చేసినా మల్లిక

మరో తప్పు చేసినా మల్లిక

ఇక రామచంద్ర జానకి కోసం తెచ్చిన ఐపీఎస్ పుస్తకాలని ఆమె ముందు ఉంచుతాడు. అన్ని సరిగ్గా ఉన్నాయా లేదా అనేవి చూసుకోండి అని చెబుతున్న సమయంలో జానకి మరింత ఎమోషనల్ అవుతూ దండం పెడుతుంది. దీంతో రామ అలా బాధపడవద్దు అంటూ మీ కోరికలని ఇష్టాలను తీర్చడం నా బాధ్యత అంటూ భరోసా ఇస్తాడు.. ఇక మరో తప్పు చేసినా మల్లిక అత్త చేతిలో శిక్షకు రెడీ అవ్వగా మళ్ళీ జానకి అడ్డు పడుతుంది. ఇక ఈసారి జ్ఞానాంబ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X