For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu July 29th: మౌనంతోనే భయపెడుతున్న జ్ఞానాంబ.. టెన్షన్ లో రామ, జానకి!

  |

  జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు మంచి రేటింగ్స్ తో జనాలకు మరింత దగ్గరవుతోంది. ఇక భర్త రామచంద్ర సహకారంతో జానకి తన ఐపీఎస్ చదువును పూర్తి చేయాలని అనుకుంటుంది. కానీ జానకి చదువుకోవడం అత్తగారికి ఏ మాత్రం ఇష్టం ఉండదు. దీంతో తెలియకుండా భర్త అండతో జానకి చదువును కొనసాగిస్తోంది. ఈ క్రమంలో జనకికి కొన్ని ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 6.70 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 355 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..

  జానకి డ్రీమ్

  జానకి డ్రీమ్

  జానకి చిన్నప్పటినుంచి తాను ఐపీఎస్ కావాలి అని ఎన్నో కలలు కంటుంది. అలాగే వారి తల్లిదండ్రులు కూడా అదే విధంగా కోరుకుంటారు. కానీ జానకి అన్నయ్య ఆమెను బరువుగా భావించి రామచంద్రకు ఇచ్చి పెళ్లి చేస్తాడు. కానీ మరోవైపు జ్ఞానాంబ జానకి చదువుకోలేదు అని అబద్ధపు మాటల వలన పెళ్లి చేయడానికి ఒప్పిస్తుంది. కానీ పెళ్లి తర్వాత మాత్రం జానకి చదువు గురించి తెలవడంతో జ్ఞానాంబ ముందుగానే ఆమె దగ్గర నుంచి మాట తీసుకుంటుంది. మళ్ళీ నీ జీవితంలో చదువు గురించి ఎలాంటి ప్రస్తావన తీసుకురావద్దని తన దగ్గర ఉన్న సర్టిఫికెట్స్ కూడా తీసుకుంటుంది.

  అత్తకు తెలిసేలా..

  అత్తకు తెలిసేలా..


  కానీ రామచంద్ర మాత్రం తన కారణంగా భార్య చదువు ఆగిపోకూడదు అని తన తల్లిదండ్రుల కోరిక కూడా నెరవేర్చుకుంటే జానకి తట్టుకోలేదు అని ఆలోచిస్తాడు. ఇంట్లో తన తల్లికి తెలియకుండా జానకిని చదివిస్తూ ఉంటాడు. కానీ జానకి చదువు విషయం మొత్తానికి జ్ఞానాంబకు తెలిసేలా మల్లిక ప్లాన్ చేస్తుంది. తోడికోడలు అయిన మల్లిక నిత్యం జానకి పై ఏదో ఒక విధంగా పగ తీర్చుకోవాలని అనుకుంటుంది. ఎందుకంటే జ్ఞానాంబ ఎక్కువగా జానకి విషయంలోనే చాలా ఆప్యాయంగా ఉంటుంది అని ఆమె అసూయ చెందుతూ ఉంటుంది.

   నిజాన్ని చూపించిన మల్లిక

  నిజాన్ని చూపించిన మల్లిక

  ఈ క్రమంలోనే జానకిని ఇంట్లో నుంచి బయటకు పంపించాలని కూడా ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. ఇక మొత్తానికి జానకి చదువుతుతున్న విధానం అలాగే జానకి రామచంద్ర ఇద్దరు కూడా కోచింగ్ సెంటర్ కు వెళ్లడం మల్లిక గమనిస్తుంది. ఇక ఇంట్లో ఉన్న జ్ఞానాంబను కూడా డైరెక్ట్ గా ఇన్స్టిట్యూట్ దగ్గరికి తీసుకు వెళ్లిన మల్లిక అసలు నిజాన్ని చూపిస్తుంది. ఇన్ని రోజులు మీకు తెలియకుండా వీళ్ళిద్దరూ కూడా ఈ విధంగా చదువు పేరుతో మోసం చేస్తున్నారు అని చెప్పడంతో జ్ఞానాంబ ఒక్కసారిగా షాక్ అవుతుంది.

  కోపంలో జ్ఞానాంబ

  కోపంలో జ్ఞానాంబ


  ఎంతో నమ్మిన కోడలు కొడుకు మోసం చేయడంతో ఆమె ఊహించని విధంగా ఏకాంతంలోకి వెళ్ళిపోతుంది. ఇక తల్లి బాధను చూసి రామచంద్ర కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో ఉంటాడు. మొదట తల్లిని ఎంతగానో బ్రతిమాలడానికి కూడా ప్రయత్నం చేస్తాడు. కానీ నన్ను అమ్మ అని పిలవద్దు అంటూ జ్ఞానాంబ చెబుతుంది. అలాగే జానకి తో కూడా మాట్లాడడానికి ఆమె ఏమాత్రం ఆసక్తి చూపించదు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత జ్ఞానాంబ కొంత సేపు తన గదిలోనే ఉండే తలుపులు పెట్టుకుంటుంది. దీంతో ఆమె ఎంతసేపటికి గదిలో నుంచి బయటకు రాపోకపోవడంతో ఏం జరుగుతుందో అని అందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు.

   ట్విస్ట్ ఇచ్చిన జ్ఞానాంబ

  ట్విస్ట్ ఇచ్చిన జ్ఞానాంబ

  ఈ క్రమంలో కొద్దిసేపటికి గది నుంచి బయటకు వచ్చిన తర్వాత జ్ఞానాంబ అందరూ అంత భయంగా ఎందుకు ఉన్నారు నేను ఆత్మహత్య చేసుకునేంత పిరికి దాన్ని కాదు అని అంటుంది తర్వాత మల్లిక, జ్ఞానాంబ కోపం చూసిన తర్వాత తప్పకుండా జానకిని ఇంట్లో నుంచి బయటికి పంపిస్తుంది అని అనుకుంటుంది. కానీ ఆమె మాత్రం ఊహించని విధంగా రేపు ఇంట్లో వరలక్ష్మీ వ్రతం ఉంది అని అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలి అని ఆదేశిస్తుంది. ఇక జ్ఞానాంబ ఆ విధంగా మాట్లాడడంతో అందరూ షాక్ అవుతారు. ముఖ్యంగా మల్లికా ఇదేంటి ఇలాంటి ట్విస్ట్ ఇచ్చింది అని ఆలోచిస్తుంది.

  జ్ఞానాంబ మౌనం

  జ్ఞానాంబ మౌనం


  ఇక జానకి రామచంద్ర కూడా తల్లి మౌనాన్ని చాలా భయంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆమెతో మాట్లాడితే ఏదో ఒకటి తెలుస్తుంది అని కాకపోతే ఇంత మౌనంగా ఉండడం అంతు చిక్కడం లేదు అని అనుకుంటారు. గోవిందరాజులు వాళ్లకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తాడు. రేపు జరగబోయే పూజతోనే మన ఇంట్లో అన్ని పరిస్థితులు కూడా చక్కబడాలని కోరుకుందాం అని అంటాడు.

  వాళ్ళని పట్టించుకోకుండా..

  వాళ్ళని పట్టించుకోకుండా..

  కానీ జ్ఞానంబు మాత్రం కొడుకు కోడలిపై కోపంతోనే ఉంటుంది. మరుసటి రోజు జానకి రామచంద్ర పనులు చేస్తూ ఉండగా వాళ్ళని పట్టించుకోకుండా మిగతా వారిని పిలుస్తూ ఉంటుంది. ఈ ఇంట్లో చిన్న కోడలు మల్లిక అన్ని పనులు చూసుకోవాలి అని అలాగే విష్ణు, అఖిల్ ఇద్దరు కూడా తోరణాలు కట్టాలి అని చెబుతుంది. కానీ పక్కన ఉన్న జానకి రామచంద్ర తో మాత్రం జ్ఞానాంబ మాట్లాడదు. మరి ఆమె ఇంకా ఎన్నిరోజులు ఇలా మౌనంగా ఉంటుందో అలాగే జానకి చదువు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Serial July 29th Episode 355
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X