Janaki Kalaganaledu July 2nd Episode: భర్తకు రక్తం వచ్చేలా బాధ పెట్టిన జానకి.. శోభనానికి వెనుకడుగు!

జానకి కలగనలేదు సిరియల్ మరో కీలక మలుపు తిరగబోతున్నట్లు తెలుస్తోంది. సీనియర్ నటి రాశి హెచ్చు తగ్గులు లేకుండా జ్ఞానాంబ పాత్రను అద్భుతంగా పోషిస్తోంది. ఒకవైపు కట్టుబాట్లు మరోవైపు ఆగ్రహాన్ని సరిసమానంగా చూపిస్తూ జనాలను ఎట్రాక్ట్ చేస్తోంది. రామ, జానకి మధ్యలో కొనసాగే రొమాన్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మల్లిక కుట్రలు సరికొత్త విలనిజాన్ని చూపిస్తున్నాయి. అందమైన ప్రేమ మధ్యలో భర్త అమాయకత్వ ప్రేమలో జానకి ఆశయం, అత్త జ్ఞానాంబ కట్టుబాట్లు.. ఈ సిరియల్ లో హైలెట్ గా నిలుస్తున్నాయి. నేడు ప్రసారం కాబోయే 75వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

ఎవరి కొరికి నెరవేరుతుందో..?

ఎవరి కొరికి నెరవేరుతుందో..?

జానకి, రామచంద్ర లకు తొందరగా పిల్లలు కలగాలని జ్ఞానాంబ కుటుంబ సభ్యులతో కలిసి గుడికి వెళ్లిన విషయం తెలిసిందే. గుడిలో పూజ చేయడమే కాకుండా జానకి, రామ ఇద్దరు ఇంట్లో సరదాగా గడపాలని వారి కోసం మొక్కు కూడా తీర్చుకునే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు జానకి పిల్లలు వద్దనే ఆలోచనతో ఉంటుంది. దీంతో ఎవరి కోరిక నెరవేరుతుందనే పాయింట్ ఈ వారం హైలెట్ గా మారింది.

 108 బిందెల నీళ్లతో అభిషేకం

108 బిందెల నీళ్లతో అభిషేకం

రామ, జానకిల కడుపు పండాలని గుడిలో పూజలు చేయించిన జ్ఞానాంబ ఇంతకుముందు పూజలో మల్లిక కారణంగా జరిగిన తప్పుకు దోషం పోవాలని మరొక మొక్కును ఆచరణలో పెడుతుంది. సుబ్రహ్మణ్య స్వామివారికి 108 బిందెల నీళ్లతో అభిషేకం చేస్తే దోషం పోతుందని పూజారి చెప్పడంతో జ్ఞానాంబ అందుకు కూడా సిద్ధమవుతుంది. ఎవరు చెప్పినా కూడా వినకుండా మెట్లు ఎక్కుతూ నీళ్లతో అభిషేకం చేస్తుంది.

మల్లిక కండీషన్

మల్లిక కండీషన్

ఇక రెండవ కొడుకు విష్ణు తల్లి బాధ చూడలేక తన భార్య మల్లిక దగ్గరకు వెళ్లి మనం పిల్లలను కనాలని చెబుతాడు. అందుకు సరే అని చెప్పిన మల్లిక ఒక కండిషన్ కూడా పెడుతుంది. ముందు సపరేట్ గా కాపురం పెట్టండి అప్పుడు నేను పిల్లలను కనడానికి రెడీ అంటూ భర్తకు వివరణ ఇస్తుంది. దీంతో విష్ణు సైలెంట్ అయిపోతాడు.

జ్ఞానాంబ కానుక

జ్ఞానాంబ కానుక

ఇక మరోవైపు జానకి, రామకు ఒక ప్రత్యేకమైన కానుక పంపిన జ్ఞానాంబ అందులో పిల్లల్ని కనాలని అర్థం వచ్చేలా బాల కృష్ణుడి ఫొటోను పెడుతుంది. అలాగే జానకి కడుపు పండాలని మల్లెపూలు, గంధం, కుంకుమ పువ్వు వంటి వాటిని కూడా ఉంచుతుంది. ఆ విషయం అర్థం చేసుకున్న రామ, జనాకికి అర్థమయ్యేలా చెప్పేసాడు.

పిల్లల్ని కనడం వాయిదా వేద్దామని

పిల్లల్ని కనడం వాయిదా వేద్దామని

ఆ విషయం విన్న జానకి షాక్ అవుతుంది. ఇక రామ భార్యకు గాజులు తొడుగుతున్న క్రమంలో మరికొన్నాళ్లు పిల్లల్ని కనడం వాయిదా వేద్దామని జానకి చెబుతుంది. దీంతో రామచంద్ర ఆశ్చర్యానికి గురవుతాడు. బాధతో చేతిలో ఉన్న గాజులను నలిపెయ్యగానే అతని చేతికి గాయం ఆవుతుంది. ఇక అప్పుడే జ్ఞానాంబ గుడి మెట్ల దగ్గర బిందెని జారవిడుస్తుంది.

రామచంద్ర చేతికి గాయం

రామచంద్ర చేతికి గాయం

రామ సైలెంట్ గా ఇంటి బయట ఆలోచిస్తూ ఉంటాడు. జ్ఞానాంబకు మనవడిని చూసే భాగ్యం ఉందా లేదా అని అందరూ అనుకుంటున్న విషయాన్ని గుర్తు చేసుకుంటాడు. బాధపడుతూ కూర్చొని ఉండగా చేతికి రక్తం కారుతూ ఉంటుంది. అది చూసిన జానకి పట్టుకునే ప్రయత్నం చేసినా రామ ఆమెను పట్టించుకోకుండా ముందుకి వెళతాడు. పిల్లలు ఎందుకు వద్దని అనుకుంటున్నారనే కారణం చెప్పండని అడుగుతాడు.

శోభనానికి ఒప్పుకుంటుందా?

శోభనానికి ఒప్పుకుంటుందా?

ఐఎఎస్ అవ్వాలనుకున్న కలతో ఉన్న జానకి పిల్లల్ని కనడం ఇష్టం లేదన్న విషయాన్ని చెప్పాలని అనుకుంటుంది కానీ మళ్ళీ వెనుకడుగు వేస్తుంది. ఏది చెప్పినా అర్థం చేసుకుంటానని అమ్మ బాధను కూడా అర్థం చేసుకోవాలని రామ కూల్ గా చెబుతాడు కానీ జానకి చెప్పే ధైర్యం చేయదు. ఇక సడన్ ఇంట్లోకి వెళ్లేసరికి శోభనం గది పులతో సిద్ధమై ఉంటుంది. మరి జానకి శోభనానికి ఒప్పుకుంటుందా లేదా అనేది రెపటి ఎపిసోడ్ లో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X