Janaki Kalaganaledu July 30th Episode: జానకి చదువు కోసం రామ న్యూ సెటప్.. మరో స్వీట్ కిస్!

జానకి కలగనలేదు కథ మొత్తానికి అసలు ట్రాక్ లోకి వచ్చేసింది. సిరియల్ మొదట్లో కాస్త బోర్ కొట్టించినా కూడా ఆ తరువాత ఇంట్రెస్టింగ్ సీన్స్ తో అలాగే ట్విస్టులతో మరింత ఆసక్తిగా మారుతోంది. నెవ్వర్ బిఫోర్ అనేలా ట్విస్టులు కూడా క్రియేట్ అవుతున్నాయి. జానకి ఐపీఎస్ చదువు కోసం రామ కూడా గట్టిగానే కష్టపడుతున్నాడు. ఇక జానకి , రామ లవ్ సీన్స్ బ్యూటీఫుల్ గా కొనసాగుతున్నాయి.

రామ భార్య కోసం తీసుకునే భవిష్యత్తు నిర్ణయాలు కూడా ఆసక్తిని కలిగిస్తున్నాయి. భర్త అమాయకత్వ ప్రేమలో జానకి ఆశయం మొదలైంది. కానీ అత్త జ్ఞానాంబ కట్టుబాట్లు ఊహించని అనుభవాలను నేర్పుతోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 95వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

జానకి చఫువుకునేందుకు ఏర్పాట్లు

జానకి చఫువుకునేందుకు ఏర్పాట్లు

జనాకికి ఐపీఎస్ చదివించాలని రామ బలమైన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ పరీక్షల్లో టాప్ సెకండ్ ర్యాంక్ రావడంతో జానకి కోసం రామ పుస్తకాలు తెప్పిస్తాడు. ఇంట్లో ఎవరికీ తెలియకుండా జానకి చఫువుకునేందుకు ఏర్పాట్లు చేస్తాడు. దీంతో జానకి ఎమోషనల్ అవుతూ రామ కాళ్లకు నమస్కారం చేస్తుంది.

జానకి స్వీట్ కిస్

జానకి స్వీట్ కిస్

ఎలాగైనా కష్టపడి చదువుతాను అంటూ జానకి చదవడం మొదలు పెడుతుంది. ఇక అర్ధరాత్రి రెండు గంటల వరకు అలానే చదువుకున్న జానకికి రామ జాగ్రత్తలు చెబుతాడు. మీకు చదువు ఎంత ముఖ్యమో మీ ఆరోగ్యం కూడా నాకు అంతే ముఖ్యం అంటూ ప్రేమగా చెబుతాడు. ఇక అందుకు జానకి సరే అంటూ అతని చేతిపై స్వీట్ గా ముద్దు పెడుతుంది. దానికి రామ సిగ్గుపడిపోతాడు.

స్నేహితురాలు రావడంతో

స్నేహితురాలు రావడంతో

ఈ క్రమంలో ఉదయాన్నే లేచిన మల్లిక ఇంటి ముందు ముగ్గులు వేయడానికి రెడీ అవుతోంది. అప్పుడే ఆమె స్నేహితురాలు రావడంతో తన ద్వారా జానకి పేపర్ లో వచ్చిన విషయం గురించి తెలుసుకోవాలిని అనుకుంటుంది. ఫ్రెండ్ ను ఇంటికి వెనకాల వైపు ఉంచి పేపర్ ను తెస్తుంది.

మళ్ళీ ఎదురుదెబ్బ

మళ్ళీ ఎదురుదెబ్బ

ఎలాగైనా జానకి, జ్ఞానాంబల మధ్య చిచ్చు పెట్టి తన పగను తీర్చుకోవాలని అనుకుంటుంది. అయితే స్నేహితురాలికి ఇంగ్లీష్ చదవడం వచ్చని అనుకున్న మల్లికకు మళ్ళీ ఎదురుదెబ్బ తగులుతుంది. ఆమెకు కూడా ఇంగ్లీష్ రాదని తెలియడంతో మల్లిక అప్సెట్ అవుతుంది. ఫ్రెండ్ ను ఇంటి నుంచి తరిమి కొడుతుంది.

అస్సలు వదిలి పెట్టకూడదని

అస్సలు వదిలి పెట్టకూడదని

ఇక ఇంటి ముందు ముగ్గు వేయకుండా మల్లిక ఎక్కడికి వెళ్లిందని జ్ఞానాంబ ఆగ్రహానికి లోనవుతుంది. సూర్యోదయానికి ముందు ఇంటి ముందు ముగ్గు వేయమని ఎన్ని సార్లు చెప్పినా కూడా ప్రతిసారి ఇలానే చేస్తుందని ఈసారి అస్సలు వదిలి పెట్టకూడదని అనుకుంటుంది. ఇక ఇంతలో తల్లి ముగ్గు వేస్తుండగా అక్కడికి మల్లిక భర్త విష్ణు వస్తాడు.

ఎలాంటి శిక్ష వేయాలి?

ఎలాంటి శిక్ష వేయాలి?

ఇక అప్పుడే మల్లిక కూడా వస్తుంది. నీళ్ల కోసం వెళ్ళాను అంటూ అబద్ధం చెబుతుండగా ఆ బిందె అప్పుడే కింద పడుతుంది. అయితే అందులో నీళ్లు ఉండవు. ఇక ఆమెకు బుద్ధి చెప్పాలని జ్ఞానాంబ నిర్ణయం తీసుకుంటుంది. ఎలాంటి శిక్ష వేయాలని అప్పుడే విష్ణును అడుగుతుంది. ఇక అతను రథం ముగ్గులో తాడు గీత గీయమని అంటాడు.

Recommended Video

Surekha Sikri Life Story, నేషనల్ అవార్డ్ నటి.. Naseeruddin Shah కి బంధువు!! || Filmibeat Telugu
మరోసారి అడ్డు పడిన జానకి

మరోసారి అడ్డు పడిన జానకి

తాడు గీత గీయమని చెప్పగానే జ్ఞానాంబ అందుకు ఒప్పుకోదు. మన షాప్ వరకు గీత గీయాలని శిక్ష వేస్తుంది. దీంతో మల్లిక షాక్ అవుతుంది. ఇక అప్పుడే సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన జానకి అత్త మాటలకు వినయంగానే అడ్డు చెబుతుంది. అది చాలా కష్టమైన పని మరోసారి క్షమించాలని అంటుంది. ఇదివరకే రెండుసార్లు క్షమించిన జ్ఞానాంబ ఈసారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X