Janaki Kalaganaledu July 4th: మల్లిక చేసిన పనికి టెన్షన్ లో జానకి.. మరోసారి వెనక్కి తగ్గకుండా హార్డ్ వర్క్!

జానకి కలగనలేదు రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఇటీవల కాలంలో వచ్చిన టాప్ సీరియల్స్ తో పోటీ పడుతూ జానకి కలగనలేదు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతోంది. జానకి ప్రాణాలకు తెగించి జ్ఞానాంబ కుటుంబ సభ్యులను కాపాడడంతో ఆమె కుటుంబానికి మరింత దగ్గరవుతుంది. మరోవైపు ఆమె ఐపీఎస్ చదువును కొనసాగించాలని అనుకుంటుంది. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 6.70 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 335 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..

 భర్త సపోర్ట్

భర్త సపోర్ట్


భర్త సహకారంతో జానకి తన ఐపిఎస్ చదువును పూర్తి చేయాలని అనుకుంటుంది. అయితే చదువుకున్న కోడలు అంటే జ్ఞానాంబకు ఏమాత్రం ఇష్టం ఉండదు. అయినప్పటికీ కూడా రామచంద్ర తన తల్లికి తెలియకుండా జానకి చదువును కొనసాగించాలని అనుకుంటాడు. ఇక భర్త సపోర్ట్ చేస్తూ ఉండడంతో జానకి కూడా ఎంతో ఏకాగ్రతగా తన చదవును పూర్తి చేసుకుంటూ ఉంటుంది. మధ్యలో పలు సమస్యలు ఎదురైనప్పటికీ కూడా జానకి వెనుకడుగు వేయకుండా భర్త సలహా మేరకు ముందడుగు వేస్తుంది. అయితే ఈ సమయంలో ఆమెకు ఊహించని విధంగా చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. తోడికోడలు మల్లికా ఎప్పటికప్పుడు జానకి పై పగ తీర్చుకోవాలని అనుకుంటుంది.

మరొక షాక్

మరొక షాక్


ఇక ఇటీవల సమయం కుదరకపోయినప్పటికీ కూడా జానకి తన ఐపీఎస్ కోచింగ్ కు సంబంధించిన ఒక అసైన్మెంట్ పూర్తి చేయాలని అనుకుంటుంది. రాత్రి పగలు కూర్చునే ఒక రోజులోనే అసైన్మెంట్ మొత్తాన్ని కూడా పూర్తి చేస్తుంది. ఇక వాటిని ఇన్స్టిట్యూట్లో సబ్మిట్ చేయడానికి రెడీ అవుతున్న సమయంలో ఆమెకు మరొక షాక్ తగులుతుంది. అప్పుడే మల్లిక ఇంట్లో ఉన్న పేపర్లు అన్నిటిని కూడా అమ్మేయడానికి సిద్ధమవుతోంది. అయితే పేపర్స్ కొనేవాడు ఒక రూపాయి తక్కువ ఇచ్చాడు అని మరికొన్ని పేపర్లు తీసుకురావడానికి ఆమె ఇంట్లోకి వెళుతుంది.

జ్ఞానాంబ అనుమానం

జ్ఞానాంబ అనుమానం

ఈ క్రమంలో ఎక్కడ కూడా కొన్ని పేపర్లు దొరకకపోవడంతో జానకి గదిలో వెతుకుతుంది. అయితే అక్కడ జానకికి సంబంధించిన అసైన్మెంట్ పేపర్స్ ఉండడంతో వాటిని వేస్ట్ పేపర్స్ అనుకొని మల్లిక అమ్మకానికి పెడుతుంది. అయితే ఈ క్రమంలో అవేవో అవసరం వచ్చే పేపర్లలా ఉన్నాయని జ్ఞానాంబ చూస్తారు అయితే. ఆమెకు చదువు రాకపోవడంతో అవి ఏం పేపర్లో అని అఖిల్ ని అడుగుతారు. ఇక అఖిల్ వాటిని చూస్తూ ఉండగానే అతని ప్రేయసి దీపిక ఫోన్ చేస్తుంది. ఆ కంగారులో వాటిని పట్టించుకోకుండా వేస్ట్ పేపర్స్ అంటూ ఇచ్చేస్తాడు.

 మల్లికపై కౌంటర్స్

మల్లికపై కౌంటర్స్


అనంతరం మల్లిక తన తెలివితేటలను ఉపయోగించి ఈ పేపర్స్ అమ్ముతున్నాను అంటూ గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ గోవిందరాజులు మాత్రం ఆమెపై మరోసారి సెటైర్లు వేస్తాడు. ఈ తెలివిని కాస్త మంచి పనుల కోసం ఉపయోగిస్తే బాగుంటుంది అని కూడా కౌంటర్లు ఇస్తాడు. దీంతో మల్లిక ఏమీ అనకుండా ఆ పేపర్లను అమ్మడానికి వెళుతుంది. ఇక ఇంతలో తన గదిలోకి వచ్చిన జానకి ఇన్స్టిట్యూట్ కు వెళ్లి పేపర్లను ఇవ్వాలి అని సిద్ధమవుతూ ఉంటుంది. ఇక ఆ పేపర్లను చూసే క్రమంలో ఎక్కడ కూడా కనిపించవు దీంతో జానకి తీవ్రంగా కంగారుపడుతుంది.

జానకిలో కంగారు

జానకిలో కంగారు

ఎంతో కష్టపడి రాసిన అసైన్మెంట్ కనిపించకపోవడంతో ఒక్కసారిగా డీలా పడిపోతుంది. అయితే వెంటనే ఇంట్లో పనిమనిషిని కూడా అడుగుతుంది. నువ్వు ఏమైనా నా గదిలో పేపర్లు తీసావా అని అనడంతో ఆమె నేను ఏమి తీయలేదు అని చెబుతుంది. ఇక ఎవరు తీసారు అని ఆలోచిస్తు సాయంత్రం లోపు ఇన్స్టిట్యూట్లో అసైన్మెంట్ ఇవ్వకపోతే స్పెషల్ కోచింగ్ బ్యాచ్లో తనను ఉంచరు అని జానకి ఆలోచిస్తుంది.

 మల్లికపై సీరియస్

మల్లికపై సీరియస్


ఇక అప్పుడే మల్లిక తీసినట్లు పనిమనిషి చెప్పడంతో జానకి షాక్ అవుతుంది. అనంతరం అక్కడికి వచ్చిన మల్లిక జానకి కంగారు పడటం చూస్తుంది. ఎందుకు జానకి అంతలా కంగారుపడుతుంది అని అనుకుంటుంది. ఇక వెంటనే మల్లిక ఆమెను తన గదిలో ఉన్న పేపర్లను ఎందుకు తీసావు అని అడుగుతుంది. అవేవో ముఖ్యమైన పేపర్స్ అయినట్లు అంతలా కోప్పడతావు ఎందుకు అని మల్లిక అడుగుతుంది. అప్పుడే అత్తగారు మామగారు రావడంతో జానకి ఆ విషయం వారికి తెలియకూడదు అని పొట్లాలు కట్టేందుకు పంపించిన పేపర్లని చెబుతుంది.

 నడుమునొప్పితో గోవిందరాజులు

నడుమునొప్పితో గోవిందరాజులు


ఇక జ్ఞానాంబ మాత్రం ఆ గొడవను పెద్దగా పట్టించుకోవద్దు అని మల్లికాను వంట సిద్ధం చేయాలి అని అంటుంది. కానీ ఆమె ఆరోగ్యం బాగోలేదు అని చెప్పడంతో జానకి వంట సిద్ధం చేస్తుంది. వంట చేస్తూనే జానకి మరోసారి అసైన్మెంట్ పూర్తి చేస్తుంది. ఈ క్రమంలోనే వారి మామగారు గోవిందరాజులు నడుపునొప్పి బారిన పడతారు. కానీ ఆ విషయం చెబితే ఇంట్లో వాళ్ళు కంగారు పడతాడు అని దాస్తాడు. ఇక జానకి అసైన్మెంట్ కు సంబంధించిన పేపర్లను సిద్ధం చేసే పనిలో బిజీగా ఉంటుంది. మరి జానకి అనుకున్న సమయానికి ఇనిస్టిట్యూట్ కి వెళ్లి ఆ పేపర్లను ఇస్తుందో లేదో తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X