Janaki Kalaganaledu July 5th Episode: శోభనం గదిలో అసలు విషయాన్ని చెప్పిన జానకి.. మరో ఘట్టం మొదలైంది!

జానకి కలగనలేదు సిరియల్ లో అసలైన ఘట్టం మొదలు కాబోతోంది. 75 ఎపిసోడ్స్ లలో జానకి, రామ్ పాత్రల యొక్క ప్రేమానురాగాలను అలాగే జ్ఞానాంబ కోరికను, మల్లిక విలనిజాన్ని చూపించారు. ఇక ఇప్పుడు కథలోని అసలు ట్విస్ట్ మొదలు కాబోతోంది. ఇక సీనియర్ నటి రాశి హెచ్చు తగ్గులు లేకుండా జ్ఞానాంబ పాత్రను అద్భుతంగా పోషిస్తోంది.

ఒకవైపు కట్టుబాట్లు మరోవైపు ఆగ్రహాన్ని సరిసమానంగా చూపిస్తూ జనాలను ఎట్రాక్ట్ చేస్తోంది. అందమైన ప్రేమ మధ్యలో భర్త అమాయకత్వ ప్రేమలో జానకి ఆశయం, అత్త జ్ఞానాంబ కట్టుబాట్లు.. ఈ సిరియల్ లో హైలెట్ గా నిలుస్తున్నాయి. నేడు ప్రసారం కాబోయే 76వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

తొందరగా పిల్లలు కలగాలని

తొందరగా పిల్లలు కలగాలని

జానకి, రామచంద్ర లకు తొందరగా పిల్లలు కలగాలని జ్ఞానాంబ బలంగా కోరుకుంటుంది. ఇక వారిద్దరికి ఏకాంతం అవసరమని కుటుంబ సభ్యులతో కలిసి గుడికి వెళ్లిన విషయం తెలిసిందే. గుడిలో పూజ చేయడమే కాకుండా జానకి, రామలకు పిల్లలు తొందరగా కలగాలని జ్ఞానాంబ మొక్కుని కూడా తీర్చుకుంటుంది. గుడి మెట్లకు బొట్లు పెట్టి సుబ్రహ్మణ్య స్వామికి 108 బిందెలనీళ్లతో అభిషేకం చేస్తుంది.

ఐఏఎస్ చదివిన తరువాత

ఐఏఎస్ చదివిన తరువాత

ఒకవైపు జ్ఞానాంబ పూజలు చేస్తుంటే మరోవైపు జానకి పిల్లలను వద్దనుకొని, కొన్ని సంవత్సరాలు వాయిదా వేయాలని అనుకుంటుంది. ఐఏఎస్ చదివిన తరువాత అత్తయ్య కోరికను నెరవేర్చాలని అనుకుంటుంది. ఇక ఆ విషయాన్ని చెప్పే ధైర్యం రావడం లేదని తనలో తానే కుమిలిపోతుంటుంది.

అమ్మ కోరిక నెరవేరాలి అంటూ

అమ్మ కోరిక నెరవేరాలి అంటూ

ఇక మరోవైపు భర్త రామచంద్ర జనాకికి మరోసారి తన ఆలోచనని వివరిస్తాడు. వైజయంతి ఇంట్లో బారసాలు జరిగినప్పుడు అమ్మ ఏమని చెప్పిందో గుర్తింది కదా. సంవత్సరం తిరిగేసరికి తన ఇంట్లో కూడా బారసాలు ఘనంగా చేయకపోతే పేరు మార్చుకుంటానని చెప్పింది అంటూ జానకికి చెబుతాడు. ఫైనల్ గా అమ్మ కోరిక నెరవేరాలి అంటూ రామ బలంగా చెప్పడంతో జానకి ఆలోచనలో పడుతుంది.

మరొకసారి వివరించిన రామ

మరొకసారి వివరించిన రామ

జానకి తన తండ్రి మాటలను గుర్తు చేసుకుంటూ బాధపడుతుంటుంది. ఇక ఇంతలో జ్ఞానాంబ కొడుకుకి ఫోన్ చేసి తను చెప్పిన గదిలో పడుకోవాలని అంటుంది. ఈ రోజు తాము గుడిలోనే నిద్ర చేస్తామని కూడా అంటుంది. ఇక అదే విషయాన్ని రామ జానకితో చెబుతూ అమ్మ ఆరాటాన్ని అర్థం చేసుకోవాలని మరొకసారి వివరిస్తాడు.

పాల గ్లాసుతో వచ్చిన రామచంద్ర

పాల గ్లాసుతో వచ్చిన రామచంద్ర

ఇద్దరు మొదటి రాత్రి కలయిక కోసం సిద్ధమవ్వగా జ్ఞానాంబ ముందే ఆ గదిని పూలతో అలంకరించి సిద్ధం చేసి ఉంచుతుంది. అది చూసి జానకి ఆశ్చర్యపోతుంది. అత్తయ్య, భర్త నిర్ణయాల్లో న్యాయం ఉందని అనుకుంటుంది. ఇక విబిన్నంగా రామచంద్ర పాల గ్లాసును తీసుకువచ్చి జానకికి అందిస్తాడు. మీరు తేవాల్సింది నేను తెచ్చాను అంటూ జనాకికి పాల గ్లాసు ఇవ్వగా ఆమె ఆలోచనలో పడి గ్లాసును జారవిడుస్తుంది.

Recommended Video

Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
అసలు విషయాన్ని చెప్పిన జానకి

అసలు విషయాన్ని చెప్పిన జానకి

ఇక మొత్తానికి జానకి తన గతాన్ని వివరిస్తుంది. నేను 5వ తరగతి వరకు చదువుకున్న విషయం అబద్ధం. డిగ్రీ చదువుకున్నాను. మా అన్నయ్య అబద్ధం చెప్పాడు. అందుకు నన్ను క్షమించండి అని జానకి అసలు విషయాన్ని చెప్పేస్తుంది. మరి రామ జానకి చెప్పిన నిజాన్ని ఎలా అర్థం చేసుకుంటాడో రేపటి ఎపిసోడ్ లో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X