twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Janaki Kalaganaledu July 5th: సీరియస్ కండిషన్ లో జ్ఞానాంబ భర్త.. టైమ్ చూసి కొట్టిన మల్లిక!

    |

    జానకి కలగనలేదు మరో ఆసక్తికరమైన అంశంతో ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది. టాప్ సీరియల్స్ తో పోటీ పడుతూ జానకి కలగనలేదు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతోంది. జానకి భర్త సహకారంతో ఐపీఎస్ చదువును కొనసాగించాలని అనుకుంటుంది. కానీ అత్తగారికి మాత్రం చదువుకున్న కొడలంటే ఏ మాత్రం ఇష్టం ఉండదు.
    ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 6.70 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 336 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..

    భార్య చదువు కోసం అండగా రామ

    భార్య చదువు కోసం అండగా రామ

    జానకి తన ఐపిఎస్ చదువును పూర్తి చేసేందుకు ఎంతగానో కష్టపడుతోంది. ఇక ఆమెకు తోడుగా భర్త రామచంద్ర కూడా సహాయంగా ఉంటున్నాడు. ప్రతి విషయంలో కూడా జానకికి మద్దతు పలుకుతూ ఆమె ఐపిఎస్ చదువు కోసం కావాల్సిన ఏర్పాట్లను కూడా చేస్తున్నాడు. అవసరమైన సమయంలో డబ్బులు కూడా సమకూరుస్తున్నాడు. ఇక భర్త గౌరవం కూడా చెడిపోకుండా జానకి అతన్ని వంటలు పోటీల్లో గెలిపించి అందరి ముందు గౌరవంగా నిలబెట్టింది. ఆ విషయంలో అత్త జ్ఞానాంబ కూడా జానాకిని ఎంతగానో మెచ్చుకుంటుంది.

    ఏదో ఒక గొడవ సృష్టించాలని

    ఏదో ఒక గొడవ సృష్టించాలని


    అయితే అన్ని విషయాల్లో కూడా జానకి స్థాయి పెరుగుతూ ఉండడంతో ఆమె తోడికోడలు మల్లిక మాత్రం కొంచెం కూడా తట్టుకోలేక పోతుంది. ఎలాగైనా మళ్ళీ జ్ఞానాంబ జానకి మధ్యలో చిచ్చు పెట్టాలని అనుకుంటుంది. అంతేకాకుండా జానకిని ఇంట్లో నుంచి బయటకు కూడా పంపించాలని ప్రణాళికలు రచిస్తూ ఉంటుంది. సందు దొరికిన ప్రతిసారి మల్లిక ఏదో ఒక గొడవ కూడా సృష్టించాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమె జానకి గదిలో ఉన్న కొన్ని అసైన్మెంట్ పేపర్స్ ను పేపర్స్ అమ్మేవాడికి వేస్తుంది. ఆ విషయంలో జానకి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎంతో కష్టపడే రాత్రి పగలు కూర్చుని అసైన్మెంట్ పేపర్స్ రెడీ చేస్తే మల్లికా అలా అమ్మడంతో ఏ తట్టుకోలేక పోతుంది.

     మళ్ళీ సిద్ధం చేసిన జానకి

    మళ్ళీ సిద్ధం చేసిన జానకి

    ఇక ఆ విషయంలో మల్లికను ప్రశ్నిస్తే చదువుకుంటున్న విషయం అత్తగారికి తెలుస్తుంది అని ఐపీఎస్ చదువులో భాగంగా సిద్ధం చేసిన అసైన్మెంట్ పేపర్లు అని తెలియకూడదని అనుకుంటూ మౌనంగా ఉంటుంది. ఇక మల్లిక మాత్రం ఆ పేపర్స్ విషయంలో కొంత అనుమానం అయితే వ్యక్తం చేస్తుంది. ఇక మళ్ళీ ఆలస్యమైతే ఐపీఎస్ కోచింగ్ సెంటర్లో స్పెషల్ బ్యాచ్ లో తనను ఉంచారు అని జానకి కంగారు పడుతూ ఉంటుంది. అందుకే ఇంట్లో పనులు చేస్తూనే ఒకవైపు మళ్ళీ తన అసైన్మెంట్ పేపర్స్ సిద్ధం చేస్తుంది. అయితే ఆ పేపర్స్ ఇన్స్టిట్యూట్లో కూడా ఇవ్వాల్సిన క్రమంలో ఆమెకు మరొక షాక్ తగులుతుంది. ఆమె కోసం రవాల్సిన భర్త రాలేని పరిస్థితులలో ఉండడంతో ఒంటరిగా ఆటోలో వెళ్ళడానికి రెడీ అవుతోంది.

    టాబ్లెట్స్ కోసం..

    టాబ్లెట్స్ కోసం..

    ఇక ఇంట్లోనే మరొకవైపు రామచంద్ర తండ్రి గోవిందరాజులు నడుము నొప్పితో తీవ్రంగా బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో జానకి బ్యాగ్ వేసుకొని బయటకు వెళ్లాలని అనుకుంటుంది. ఇక అప్పుడు గోవిందరాజులు బిపి టాబ్లెట్స్ అంటూ జానకికి ఒక స్లిప్ ఇచ్చి వాటిని తీసుకురమ్మని అంటాడు. ఇక మల్లిక మధ్యలో వచ్చి టాబ్లెట్స్ కోసం వెళ్లేటప్పుడు బ్యాగ్ ఎందుకు అని ప్రశ్నిస్తుంది. కానీ గోవిందరాజులు ఒక ఆడపిల్ల బ్యాగ్ లేకుండా బయటకు ఎందుకు వెళ్తుంది అర్థం చేసుకోవాలి అని మల్లికకు కౌంటర్ ఇస్తాడు. ఇక ఆ తర్వాత జానకి కోచింగ్ సెంటర్ కు వెళ్లి అక్కడ ఆలస్యంగానే పేపర్స్ సబ్మిట్ చేస్తుంది. మొదట వాళ్ళు ఒప్పుకోక పోయినప్పటికీ బ్రతిమాలి ఒప్పిస్తుంది.

    అనుమానం వచ్చేలా మల్లిక మాటలు

    అనుమానం వచ్చేలా మల్లిక మాటలు


    అనంతరం మరొకవైపు గోవిందరాజులు నడుము నొప్పి మరింత తీవ్రంగా మారుతుంది. అతను లేవలేని పరిస్థితుల్లో ఉంటాడు. ఇక జ్ఞానాంబ కూడా ఆ విషయంలో ఎంతగానో ఆందోళన చెందుతుంది. టాబ్లెట్స్ తీసుకురావడానికి వెళ్లిన జానకి ఇంకా రాలేదు ఎందుకని అనుకుంటుంది. మరొకవైపు రామచంద్రకు ఫోన్ చేసి తొందరగా రావాలి అని నాన్నను హాస్పిటల్ కు తీసుకువెళదామని అంటుంది. ఇక ఇదే మంచి సమయం అనుకొని మల్లిక మరొకసారి జానకి పై అనుమానం వచ్చేలా మాట్లాడుతుంది. టాబ్లెట్స్ కోసం జానకి ఎందుకు చేసిందో అని అంటూ ఆమెపై అనుమానం వచ్చేలా మాట్లాడుతుంది.

    గోవిందరాజులు పరిస్థితి సీరియస్

    గోవిందరాజులు పరిస్థితి సీరియస్

    ఇక ఇన్స్టిట్యూట్ లో అసైన్మెంట్ ఇచ్చిన తర్వాత వెంటనే జానకి మెడికల్ షాప్ దగ్గర టాబ్లెట్స్ తీసుకురావడానికి వెళుతుంది. అయితే అక్కడ గోవిందరాజులు చెప్పిన టాబ్లెట్స్ దొరకవు. మరొకచోట ఉంటాయని చెప్పడంతో ఆమె మరింత దూరం వెళుతుంది. కానీ ఇంట్లో ఉన్న గోవిందరాజులకు నడుమునొప్పి మరింత ఎక్కువవుతుంది. తట్టుకోలేకపోతున్నాను అంటూ బాధపడుతూ ఉంటాడు. ఇక జానకి ఇంకా రాలేదు ఏంటి అని జ్ఞానాంబ కూడా ఆలోచిస్తుంది. అంతలోనే రామచంద్ర డాక్టర్ ని ఇంటికి తీసుకువస్తాడు. వెంటనే గోవిందరాజులను పరీక్షించిన తర్వాత డాక్టర్ పరిస్థితి కాస్త సీరియస్ గానే ఉంది అని అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. మరి ఈ క్రమంలో జానకి పై అత్తగారు ఏ విధంగా కోప్పడతారో చూడాలి.

    English summary
    Janaki Kalaganaledu Serial July 5th Episode
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X