Janaki Kalaganaledu July 6 Episode: అగ్నిపర్వతం బద్దలైంది.. జానకి నిజాలకు షాకైన రామచంద్ర

జానకి కలగనలేదు సిరియల్ ఇన్నాళ్లకు అసలైన స్టోరీలోకి వచ్చేసింది. ఇన్ని రోజుల పాత్రలకు సంబంధించిన విబిన్నమైన ఘటనలతో ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు జానకి, రామ్ జీవితాలను మలుపు తిప్పే అసలు కథ మొదలు కానుంది. మొత్తానికి జానకి అయితే భర్తతో అసలు విషయాన్ని చెప్పేసింది. మరి అదే విషయాన్ని అత్త జ్ఞానాంబతో కూడా చెబుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. అందమైన ప్రేమ మధ్యలో భర్త అమాయకత్వ ప్రేమలో జానకి ఆశయం, అత్త జ్ఞానాంబ కట్టుబాట్లు.. ఈ సిరియల్ లో హైలెట్ గా నిలుస్తున్నాయి. నేడు ప్రసారం కాబోయే 77వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

వారసుడు రావాలని

వారసుడు రావాలని

జానకి, రామచంద్ర లకు తొందరగా పిల్లలు కలగాలని జ్ఞానాంబ కుటుంబ సభ్యులతో కలిసి గుడికి వెళ్లిన విషయం తెలిసిందే. జానకి, రామ ఏకాంతంగా గడపాలని అలాగే ఇంటికి వారసుడు రావాలని గుడిలో పూజలు కూడా చేయిస్తుంది. కానీ జానకి మాత్రం ఊహించని విధంగా తన ఐఏఎస్ కలను తలచుకుంటూ బాధపడుతుంటుంది.

 కంటతడి పెట్టిన జానకి

కంటతడి పెట్టిన జానకి

జానకితో శోభనం కోసం ఆనందంగా పాల గ్లాసుతో వచ్చిన రామచంద్రకు ఊహించని అనుభవం ఎదురవుతుంది. పాల గ్లాసును జరవిడిచిన జానకి ఏడ్చుకుంటు మరొక గదిలోకి వెళ్లిపోతుంది. తల్లిదండ్రులు ఫొటోను తీసుకొని కన్నీరుపెట్టుకుంటుంది. ఇంతటితో నేను ఐఏఎస్ కావాలనుకున్న కల చేజారిపోయినట్లే అని ఏడుస్తుంది.

మీరు బంగారం అంటూ

మీరు బంగారం అంటూ

ఇక జానకి ఏడుపును చూసిన రామ బాధపడతాడు. ఈ స్వీట్స్ అమ్ముకునే వాడిని బర్తగా ఒప్పుకోలేక పోతున్నారు కదా అంటూ మనోవేదనకు గురవుతాడు. దీంతో జానకి అలాంటిదేమి లేదని మీరు బంగారం అంటూ సమాధనం ఇస్తుంది. మరి ఎందుకు బాధపడుతున్నారు ఆ కష్టం ఏమిటో నాతో చెప్పండి నేను తీరుస్తాను అని రామ మరోసారి భరోసా ఇస్తాడు.

 అసలు నిజం చెప్పిన జానకి

అసలు నిజం చెప్పిన జానకి

ఇక జానకి కూడా ఆ అగ్ని పర్వతం లాంటి నిజాన్ని మోయలేను అంటూ అసలు విషయాన్ని చెబుతుంది. నేను చదివింది 5వ తరగతి కాదు. డిగ్రీ వరకు చదువుకున్నాను. మా అన్నయ్య అమెరికా వెళ్లడం కోసమని నా పెళ్లి చేయాలనే తొందరలో అబద్ధం చెప్పాడు. చాలాసార్లు ఆ విషయం చెప్పాలని అనుకున్నాను. కానీ ధైర్యం చేయలేకపోయాను.. అంటూ జానకి నిజం మొత్తం బయటపెట్టేస్తుంది.

జానకి మాటలకు రామ షాక్

జానకి మాటలకు రామ షాక్

జానకి మాటలకు రామ ఒక్కసారిగా అగ్నిపర్వతం బద్దలైనట్లుగా షాక్ అవుతాడు. ఏమి మాట్లాడకుండా అలా బయటకు వెళ్లిపోతాడు. ఇక ఉదయం కాగానే గుడికి వెళ్లిన కుటుంభ సభ్యులు ఇంట్లోకి వచ్చేస్తారు. జ్ఞానాంబ ఎంత పిలిచినా కూడా జానకి , రామ పలకరు. ఇక చాలా సేపటికి జానకి నిద్రలో నుంచి మేలుకొని అత్త దగ్గరకు చేరుకుంటుంది.

 అసలు ట్విస్ట్ మొదలైంది

అసలు ట్విస్ట్ మొదలైంది

రామ ఎక్కడా అని అడిగితే జానకి నోటి నుంచి మాట రాదు. మరి రామ బాధతో బయటకు ఎక్కడికైనా వెళ్లాడా అనేది తెలియాలి అంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. అలాగే జానకి అత్తతో కూడా అసలు నిజం చెప్పాలని అనుకుంటుంది. ఆ ట్విస్ట్ కూడా రేపటి ఎపిసోడ్ లో హైలెట్ కానుంది. చూస్తుంటే సీరియల్ లో అసలు ఘట్టం మొదలైనట్లు క్లారిటీ వచ్చేసింది.

Photo Courtesy: Star మా and Disney+Hotstar

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X