India
  For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu July 7th: భర్తను మరోసారి తన అందంతో టెంప్ట్ చేసిన జానకి.. మల్లిక షాక్!

  |

  జానకి కలగనలేదు మరింత ఆసక్తికరంగా మారుతోంది. టాప్ సీరియల్స్ తో పోటీ పడుతూ జానకి కలగనలేదు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతోంది. జానకి భర్త సహకారంతో ఐపీఎస్ చదువును కొనసాగించాలని అనుకుంటుంది. కానీ అత్తగారికి మాత్రం చదువుకున్న కొడలంటే ఏ మాత్రం ఇష్టం ఉండదు. ఆమెకు వారసులు కావాలని అంటుంది. అయితే జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 6.70 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 339 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..

  అనారోగ్యంతో గోవిందరాజులు

  అనారోగ్యంతో గోవిందరాజులు


  జానకి మామ గారు గోవిందరాజులు ఒక్కసారిగా అనారోగ్యానికి గురి అవుతాడు. అతనికి గతంలోనే నడుము నొప్పి వస్తుంది అయినప్పటికీ కూడా కుటుంబ సభ్యులు బాధపడతారని ఆ నొప్పిని తనలో తానే భరిస్తూ ఎవరికీ చెప్పకుండా ఉంటాడు. ఇక హఠాత్తుగా మరోసారి తీవ్రమైన నొప్పి రావడంతో అదే తరహాలో ప్రవర్తించే ప్రయత్నం చేస్తాడు. ఎవరికి అనుమానం రాకుండా టాబ్లెట్స్ తెప్పించుకోవాలని కూడా అనుకుంటాడు. మరొకవైపు గోవిందరాజులు పరిస్థితిని చూసి అతని భార్య జ్ఞానాంబ కూడా కొంత ఆందోళన చెందుతుంది. మళ్ళీ నడుము నొప్పి వచ్చిందా అని అడిగినప్పటికీ కూడా గోవిందరాజులు ఆ విషయం చెప్పకుండా అలాంటిదేమీ లేదు అని అంటాడు.

  మరింత విషమంగా..

  మరింత విషమంగా..

  ఇక ఆ తర్వాత జానకి బయటికి వెళ్లడం చూసిన గోవిందరాజులు వెళ్లి కొన్ని టాబ్లెట్స్ తీసుకురావాలి అని అవి బిపి టాబ్లెట్స్ అని ఒక స్లిప్ అయితే ఇస్తాడు. అనంతరం జానకి తన ఇన్స్టిట్యూట్లో అసైన్మెంట్ కు సంబంధించిన పేపర్లు ఇచ్చేసి టాబ్లెట్స్ తీసుకురావాలని అనుకుంటుంది. కానీ అక్కడ గోవిందరాజులు చెప్పిన టాబ్లెట్స్ ఉండకపోవడంతో మరింత ఆలస్యం అవుతుంది. మరొక ప్రాంతానికి వెళ్లి వాటిని తీసుకురావాలి అని జానకి అనుకుంటుంది. ఇక ఇంతలోనే గోవిందరాజులు పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుంది. అతను తీవ్రమైన నొప్పితో బాధపడుతూ ఉంటాడు. ఇక జ్ఞానాంబ అసలు విషయం తెలుసుకుని డాక్టర్ కు ఫోన్ చేయమని తన చిన్న కొడుకుకు చెబుతుంది. ఇక ఇంతలోనే రామచంద్ర కూడా డాక్టర్ ని తీసుకువస్తాడు.

  జానకిని మెచ్చుకున్న డాక్టర్

  జానకిని మెచ్చుకున్న డాక్టర్

  అయితే జానకి ఆలస్యంగా ఇంటికి రావడం పై జ్ఞానాంబ కాస్త సీరియస్ గానే ఉంటుంది. దానికి తోడు చిన్న కోడలు మల్లిక ఆమెపై మరిన్ని నిందలు వేయాలని అనుకుంటుంది. ఇక్కడ ప్రాణులు పోతూ ఉంటే చాలా ఆలస్యంగా రావడం ఏమిటి అని అత్తగారికి ముందే అడిగే ప్రయత్నం చేస్తుంది. కానీ జానకి మాత్రం మామగారికి కావాల్సింది బిపి టాబ్లెట్స్ కాదు అని వేరే ఇంజక్షన్స్ అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతారు. ఇక డాక్టర్ కూడా జానకి తెచ్చిన మందులతో వెంటనే గోవిందరాజులకు ట్రీట్మెంట్ చేస్తారు. తెలివిగా మరికొన్ని ఇంజక్షన్స్ కూడా తేవడంతో ఆమె ఆలోచనను కూడా అక్కడే డాక్టర్ కూడా మెచ్చుకుంటాడు. సమయానికి మీరు ఈ ఇంజక్షన్ తేవడం వల్లనే మీ మామయ్య గారు ప్రాణాలతో బయటపడ్డారు అని చెప్పడంతో జ్ఞానాంబ కూడా మరోసారి జానకి విషయంలో మరింత ఆనందపడుతుంది.

   అత్త కోరిక కోసం

  అత్త కోరిక కోసం

  అయితే జానకి మనస్సులో మరొకవైపు కోడలిగా ఇంటి బాధ్యతను చూసుకుంటూనే మరొకవైపున ఐపిఎస్ చదవును కూడా కొనసాగించాలని అనుకుంటుంది. అయితే ఆమె భర్త రామచంద్ర మాత్రం కేవలం జానకి చదువు గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడే పిల్లలు విషయంలో తొందరపడవద్దు అని కూడా ఆమెకు ముందు జాగ్రత్తగా చెబుతూనే ఉంటాడు. కానీ జానకి మాత్రం అత్తగారు వరాసుడిని కోరుకుంటున్నారు అని ఆమె కోరికను కూడా తీర్చాలి కాబట్టి రామచంద్రకు దగ్గర అవ్వాలని అనుకుంటుంది.

  విభేదించిన రామ

  విభేదించిన రామ

  ఇక పిల్లలను కనే విషయంలో రామచంద్రనతో జానకి ఎంతగానో మాట్లాడుతుంది. కానీ రామచంద్ర మాత్రం ఆ విషయంలో మరోసారి విభేదిస్తాడు. మరొక రెండేళ్లు మీరు అనుకున్న పని పూర్తి చేసిన తర్వాత ఈ విషయం గురించి ఆలోచిద్దామని అనవసరంగా మన లక్ష్యం కోసం ఇప్పుడు ఈ పని పెట్టుకోవద్దు అని కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. ఇక వీరి విషయాలను పక్కనే నిలబడి జ్ఞానాంబ వింటుంది మీరు ఎందుకు ఒకటిగా లేరు అని కూడా అనుకుంటుంది.

  భర్తను టెంప్ట్ చేస్తున్న జానకి

  భర్తను టెంప్ట్ చేస్తున్న జానకి

  ఆ తర్వాత జానకి మాత్రం అత్తగారి ప్రేమను చూసి మరోసారి పిల్లలను కనె విషయం గురించి ఆలోచిస్తుంది. ఇక రామచంద్రను ఆమె తన అందంతో అతనే టెంప్ట్ చేసే విధంగా ప్రయత్నం చేస్తుంది. కానీ రామచంద్ర మాత్రం టెంప్ట్ అవ్వకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు. అయినప్పటికీ కూడా రామచంద్రను దగ్గరికి తీసుకోవాలని అనుకుంటుంది. ఇక ఈ తరుణంలో మల్లికా వారి ప్రవర్తనను చూసి ఆశ్చర్య పోతుంది వారసుడుని ముందుగా ఇస్తే భూమి కూడా వారి పేరుపై రాస్తాను అని జ్ఞానాంబ మాట ఇవ్వడంతో మళ్ళీ ఆ ఆలోచనలు పడుతుంది మరి. ఈ పరిస్థితుల్లో జానకి నిజంగానే జ్ఞానాంబకు ముందుగా వారసుడిని ఇస్తుందా లేదా చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Serial July 7th Episode
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X