Janaki Kalaganaledu July 8th Episode: జ్ఞానాంబకు నిజం చెప్పడానికి సిద్దమైన జానకి.. రామచంద్ర న్యూ ట్విస్ట్!
జానకి కలగనలేదు సిరియల్ రోజురోజుకు మరింత ఆసక్తిగా మారుతోంది. సీరియల్ కథ అసలు మలుపు తిరిగే సమయం ఆసన్నమైంది. ఫైనల్ గా జానకి అయితే భర్తతో అసలు విషయాన్ని చెప్పేసింది. అదే విషయాన్ని అత్త జ్ఞానాంబతో కూడా చెప్పాలని అనుకుంటుంది. ఇంతలో రామ జరిగింది నేను చెబుతాను అంటూ ముందుకు వస్తాడు.. మరి అతను అసలు నిజాన్ని చెబుతాడా లేదా అనేది మంచి హైప్ క్రియేట్ చేసింది. అందమైన ప్రేమ మధ్యలో భర్త అమాయకత్వ ప్రేమలో జానకి ఆశయం, అత్త జ్ఞానాంబ కట్టుబాట్లు.. ఈ సిరియల్ లో హైలెట్ గా నిలుస్తున్నాయి. నేడు ప్రసారం కాబోయే 79వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..
Photos Courtesy: Star MAA and Disney+Hotstar

మోసం చేయడం నా వల్ల కాదు
నిజం చెప్పాలని అనుకున్న జానకి అత్త కోసం వెతుకుతుండగా ఇంతలో మామ పిలిచి గుడిలో జరిగిన విషయాన్ని వివరిస్తాడు. జ్ఞానాంబ వారసుడి కోసం చేసిన పూజలు, మొక్కు తీర్చుకోవడం వంటి కష్టాన్ని కూడా చెబుతాడు. దీంతో ఎమోషనల్ అయిన జానకి మంచి మనసులను మోసం చేయడం నా వల్ల కాదు అనుకోని నిజం చెప్పాలని లోపలికి వెళుతుంది.

కన్ఫ్యూజన్ లో రామచంద్ర
ఇక మరోవైపు జానకి డిగ్రీ చదివిన విషయం చెప్పగానే భర్త రామ ఆలోచనలో పడతాడు. అమ్మకు అబద్ధం చెప్పి మోసం చేయడం కరెక్ట్ కాదు. ఒకవేళ నిజం చెబితే అమ్మ జానకిని ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవాల్సి ఉంటుంది. జనాకికి నేను తోడుగా అండగా ఉంటానని మాట ఇచ్చాను.. అనుకుంటూ రామచంద్ర సందిగ్ధంలో పడతాడు.

ఆ విషయాన్ని పసిగట్టిన మల్లిక
ఇక మల్లిక ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని పసిగడుతుంది. ఇల్లంతా శుభ్రం చేసి క్రమంలో జానకి-రామచంద్ర శోభనం గదిని పరిశీలిస్తుంది. పూలు నలగలేదు, పక్క చెదరలేదు అంటే శోభనం జరగలేదని చికిత్తకు వివరిస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే ఆ విషయాన్ని జ్ఞానాంబకు చెప్పాలని పరిగెత్తుకుంటూ వెళుతుంది.
Recommended Video

ట్విస్ట్ ఇవ్వబోతున్న రామచంద్ర
ఇక తాను చదివింది డిగ్రీ అనే విషయాన్ని చెప్పాలని జానకి అత్త దగ్గరకు వెళుతుంది. మీ దగ్గర ఒక విషయాన్ని దాచను. ఆ నిజాన్ని చెప్పకపోతే ఇంకా పెద్ద తప్పు చేసినట్లే.. అంటూ అసలు నిజాన్ని చెప్పబోతుండగా రామచంద్ర అప్పుడే అడ్డు వస్తాడు. అసలు విషయాన్ని నేను చెబుతానని అంటాడు. మరి ఆ నిజాన్ని చెబుతాడా లేదా అనేది తెలియాలి అంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











