Janaki Kalaganaledu July 8th: మల్లిక దారుణమైన ప్లాన్.. జానకి ప్రాణాలు కాపాడిన రామ

జానకి కలగనలేదు మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో సరికొత్త ట్రాక్ లోకి వచ్చేసింది. మొన్నటి వరకు కాస్త నీరసంగా కొనసాగింది అనే టాక్ నుంచి ఇప్పుడు రసవత్తరంగా కొనసాగుతున్న స్టేజ్ కు వచ్చేసింది. టాప్ సీరియల్స్ తో పోటీ పడుతూ జానకి కలగనలేదు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతోంది. జానకి తన భర్త సహకారంతో ఐపీఎస్ చదువును కొనసాగించాలని అనుకుంటుంది. ఇక అత్తగారికి మాత్రం చదువుకున్న కొడలంటే ఏ మాత్రం ఇష్టం ఉండదు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 6.70 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 340 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..

జ్ఞానాంబ ఆఫర్

జ్ఞానాంబ ఆఫర్

జ్ఞానాంబ తన ఇంటికి వారసుడు కావాలి అని చెప్పడంతో ఒక్కసారిగా మల్లిక తో పాటు జానకి కూడా షాక్ అవుతుంది. అయితే ఎవరైతే తనకు ముందుగా వారసుడిని అందిస్తారో వాళ్లకి భూమి కూడా రాసి ఇచ్చేస్తాను అని చెబుతుంది. అయితే జానకి ఆ విషయం గురించి పెద్దగా ఆలోచించదు కానీ అత్తగారికి వారసుడుని ఇవ్వాలి అనే ఆలోచనతోనే కొనసాగుతుంది. మరొకవైపు చిన్న కోడలు మల్లిక మాత్రమే ఎలాగైనా వారి కంటే ముందుగానే వారసుడిని కని అత్తగారు చెప్పిన ఆఫర్ ను తీసుకోవాలని అనుకుంటుంది. అంతేకాకుండా మరొకవైపు మల్లికా తోడికోడలు జానకిని భర్తతో కలవనివ్వకుండా చేయాలని అనుకుంటుంది.

ముందు చదువు ముఖ్యం

ముందు చదువు ముఖ్యం


జ్ఞానాంబ పెద్ద కోడలు జానకిని వారసుడిని ఇవ్వాలి అని ఎంతగానో ప్రాధేయపడుతుంది. ఆ ఆలోచనలతోనే కొనసాగుతున్న జానకి అనవసరంగా తన కారణంగా ఈ ఇంట్లో ఆనందాలు లేకుండా పోతున్నాయి అని అంతేకాకుండా తన భర్తకు కూడా ఒక భార్యగా తాను ఆనందాన్ని ఇవ్వలేకపోతున్నాను అని బాధపడుతుంది. తన చదువు కారణంగా భర్త దూరంగా ఉండటంతో జానకి ఎలాగైనా రామచంద్ర మనసును మార్చాలని అనుకుంటుంది. ఒకవైపు చదువును కోనసాగిస్తూనే భార్యగా తన బాధ్యతను కూడా నిర్వర్తించాలని ఆలోచిస్తుంది. కానీ రామచంద్ర మాత్రం ఆ విషయంలో జానకిని దూరం పెడుతూనే ఉంటాడు ముందు చదువుకోవాలని సలహా ఇస్తూ ఉంటాడు మీరు ఐపీఎస్ అయిన తర్వాత ఈ విషయం గురించి ఆలోచిద్దామని కూడా చెబుతాడు.

దూరం పెంచుతున్న మల్లిక

దూరం పెంచుతున్న మల్లిక

అయితే ఇంట్లో ఎవరికీ తెలియకుండా జానకి తన ఐపిఎస్ చదువును కొనసాగిస్తూ ఉంటుంది. ఇక ఈ తరుణంలో భర్తను దగ్గరకు తీసుకోవాలని అనుకుంటా ఉండగా అప్పుడే మల్లికా వచ్చి వారి మధ్యలో దూరం పెట్టాలని అనుకుంటుంది. ఇద్దరు ఏకాంతంగా గడుపుతున్న సమయంలో హఠాత్తుగా బయట నుంచి మల్లిక వాళ్ళని డిస్టర్బెన్స్ చేసే విధంగా చేస్తుంది. దీంతో రామచంద్ర మళ్ళి జానకి మత్తులో నుంచి బయటకు వచ్చి అక్కడ నుంచి మెల్లగా జారుకుంటాడు. దీంతో జానకి కాస్త ఆలోచనలో పడుతుంది.

 పొలం దగ్గర పనులు

పొలం దగ్గర పనులు


ఇక ఏరువాక పౌర్ణమి సందర్భంగా మన పొలం దగ్గరికి వెళ్లి కొన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉంది అని పంటలు ఈ ఏడాది కూడా బాగా పండే విధంగా పూజా కార్యక్రమాలు కూడా చేయాలి అని అనుకుంటారు. అంతే కాకుండా ఆ పూజా కార్యక్రమాలు పెద్ద కోడలు జానకి చేతుల మీదుగా జరగాలని కూడా అత్త జ్ఞానాంబ చెబుతుంది. అయితే అందరూ ఆనందంగా ఉన్న సమయంలో చిన్న కోడలు మల్లికా మాత్రం ఏదో ఒక గొడవ సృష్టించాలని అనుకుంటుంది ఇక అందరూ కలిసి పొలం దగ్గరికి వెళ్లిన తర్వాత అక్కడ అందరూ కలిసి పని చేయాలని అనుకుంటారు. ఒకవైపు రామచంద్ర విష్ణు ఇద్దరు కలిసి సాగు చేస్తూ ఉండగా మరొకవైపు మల్లికా జానకి ఇద్దరు కలిసి పొలంలో విత్తనాలు చల్లుతూ ఉంటారు.

మల్లిక దారుణమైన ప్లాన్

మల్లిక దారుణమైన ప్లాన్


అయితే ఈ తరుణంలో ఎలాంటి ప్రమాదాలు జరగకూడదు అని ముందుగానే జ్ఞానాంబ కూడా వారికి చెబుతుంది. ఎందుకంటే ఏదైనా అపాయం ఎదురైతే మాత్రం పంట చేతికి వచ్చేసరికి కూడా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి అని అంటుంది ఎలాంటి పొరపాటు జరగకుండా చూసుకోవాలని చెప్పడంతో వెంటనే మల్లికా ఒక దారుణమైన ప్లాన్ చేస్తుంది. ఎలాగైనా జానకిని పనిచేసే క్రమంలో కింద పడేయాలి అని తన చేతిలో ఉన్న ధాన్యాలను కూడా కింద పడేయాలని ఆ తర్వాత అత్తగారు ఆమెను తిడతారు అని అనుకుంటుంది.

Recommended Video

హ్యాపీ బర్త్ డే చెప్పి మత్తు వదిలించావ్ గా *Reviews | Telugu OneIndia
జానకిని కాపాడిన రామ

జానకిని కాపాడిన రామ


ఇక అందరూ పనిచేస్తున్న సమయంలో మల్లిక మధ్యలో ఒక కాలు పెడుతుంది. దీంతో జానకి వెళ్లి గడ్డపారపై పడే క్రమంలో వెంటనే ఆమెను రామచంద్ర పట్టుకుంటాడు. ఆ తర్వాత అందరు ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. జానకిని రామ పెనుప్రమాదం నుంచి కాపాడతాడు. ఆ తర్వాత జానకి కూడా భర్తను కాపాడిన విధానానికి ఎంతగానో సంతోషపడుతుంది. అయితే జానకి కూడా ఎంతో జాగ్రత్తగా గింజలను కింద పడిపోకుండా పట్టుకుంటుంది. అప్పటివరకు మల్లిక జానకి విషయంలో ఎంతో సంతోషంగా ఉండగా హఠాత్తుగా గింజలు పడిపోకుండా పట్టుకోవడంతో మళ్ళీ ఆశ్చర్య పోతుంది. మరి మల్లిగా చేసిన తప్పిదానికి ఆ కుటుంబ సభ్యులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X