Janaki Kalaganaledu July 9 Episode: అందుకే శోభనం జరగలేదు.. మరో ట్విస్ట్ ఇచ్చిన రామచంద్ర

జానకి కలగనలేదు సిరియల్ రోజురోజుకు మరింత ఇంట్రెస్టింగ్ మారుతోంది. దాదాపు సీరియల్ లో అసలు కథ స్టార్ట్ అయ్యింది. జానకి అయితే భర్తతో అసలు విషయాన్ని చెప్పేసింది. ఇక ఆ విషయాన్ని అత్త జ్ఞానాంబతో కూడా చెప్పాలని అనుకుంటుంది కానీ రామచంద్ర చివరి క్షణంలో మరో ట్విస్ట్ ఇస్తాడు. ఇక రామ భవిష్యత్తు నిర్ణయాలు కూడా ఆసక్తిని రేపబోతున్నాయి.భర్త అమాయకత్వ ప్రేమలో జానకి ఆశయం, అత్త జ్ఞానాంబ కట్టుబాట్లు.. ఈ సిరియల్ లో హైలెట్ గా నిలుస్తున్నాయి. నేడు ప్రసారం కాబోయే 80వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

అత్త కష్టాన్ని తెలుసుకున్న జానకి

అత్త కష్టాన్ని తెలుసుకున్న జానకి

మోసం చేయడం తప్పని నిజం చెప్పాలని అనుకున్న జానకిని మామ పిలిచి గుడిలో జరిగిన విషయాన్ని వివరిస్తాడు. జ్ఞానాంబ వారసుడి కోసం చేసిన పూజలు, మొక్కు తీర్చుకోవడం వంటి కష్టాన్ని కూడా చెబుతాడు. దీంతో ఎమోషనల్ అయిన జానకి మంచి మనసులను మోసం చేయడం నా వల్ల కాదు అనుకోని నిజం చెప్పాలని జ్ఞానాంబ దగ్గరకు వెళుతుంది.

శోభనం జరగలేదని చెప్పడంతో

శోభనం జరగలేదని చెప్పడంతో

ఇక అప్పుడే ఇంట్లోకి వచ్చిన రామ అసలు విషయాన్ని నేను చెబుతాను అంటూ ముందుకు వస్తాడు. శోభనం జరగలేదని చెప్పడంతో జ్ఞానాంబ కూడా బాధపడుతుంది. మీకు నా బాధ అర్థం కావడం లేదా? వారసుడు కావాలని అనుకుంటూ ఉంటే పిచ్చిదాన్ని అనుకుంటున్నారా అని బాధపడుతుంది.

మరొక బలమైన కారణం

మరొక బలమైన కారణం

అయితే జానకి బాధ వెనుక మరొక బలమైన కారణం ఉందని అందుకే శోభనం జరగలేదని రామ వివరిస్తాడు. జానకి తల్లిదండ్రుల ఫొటోను తీసుకువచ్చి.. ఈ మధ్యే వాళ్ళు చనిపోయారు అంటూ ఇంకా తను ఆ బాధ నుంచి కొలుకోలేదని అంటాడు. దీంతో జ్ఞానాంబ జానకిని అర్థం చేసుకొని నేను కూడా నీ అమ్మ లాంటిదేన్నే అంటూ ఆప్యాయంగా చెబుతుంది.

మోసం చేయడం నా వల్ల కాదు

మోసం చేయడం నా వల్ల కాదు

ఇక జానకి అసలు విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేసినప్పటికీ రామ అడ్డు పడుతూ లోపలికి తీసుకువెళతాడు. అత్తయ్యను మోసం చేయడం నా వల్ల కాదు అంటూ జానకి రామచంద్రతో చెబుతుంది. అందుకు రామ అడ్డుపడతాడు. మీరు చదువుకున్న విషయం మీ అన్నయ్య చెప్పకపోతే మీ తప్పు ఎలా అవుతుంది అంటూ జనాకికి అర్థమయ్యేలా చెబుతాడు.

Recommended Video

Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
నిజం చెబితే నా మీద ఒట్టు

నిజం చెబితే నా మీద ఒట్టు

అమ్మకు నిజం చెబితే నువ్వు వెళ్లిపోతావు. అప్పుడు నేను బాధపడతాను. నా కోసం ఆలోచించండి. నిజం చెబితే నా మీద ఒట్టు అని రామ భార్యకు అడ్డుపడతాడు. ఇక మరోవైపు జ్ఞానాంబ జానకి తల్లిదండ్రుల ఫొటోను ఇంట్లో దండ వేయించి గోడకు తగిలుస్తుంది. అది చూసి జానకి మరింత ఎమోషనల్ అవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X