Janaki Kalaganaledu June 10th Episode: బయటకు వెళ్లిపోయిన జానకి.. జ్ఞానాంబకు షాక్ ఇచ్చిన రామ!

జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు మరింత ఆసక్తిగా మారుతోంది. తెలుగులో టాప్ రేటింగ్స్ అందుకునే సీరియల్ గా నిలవడం కాయంగా కనిపిస్తోంది. ప్రతి ఎపిసోడ్ కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతోంది. అత్త కోడళ్ల మధ్య కెమిస్ట్రీని విబిన్నంగా ప్రజెంట్ చేస్తూ ప్రతిరోజు మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు. జానకి - రామచంద్ర క్యూట్, రొమాంటిక్ సీన్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.

అందమైన ప్రేమ మధ్యలో భార్య జానకి ఆశయం, అలాగే భర్త రామచంద్ర అమాయకత్వ ప్రేమ, అత్త జ్ఞానాంబ కట్టుబాట్లు ఆప్యాయత.. ఈ సిరియల్ లో ప్రధాన అంశాలు. ఇక ఈ రోజు ప్రసారం కాబోయే 59వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

చికెన్ పిజ్జా తెచ్చుకొని

చికెన్ పిజ్జా తెచ్చుకొని

జ్ఞానాంబ సంతానలక్ష్మి పూజ చేయడం కోసం ఏర్పాట్లు సిద్ధం చేయగా ముందు నుంచి మల్లిక ఎదో ఒక పొరపాటు చేయాలని కుట్ర పన్నుతుంది. పూజ పూర్తయ్యాక సాయంత్రం వరకు కూడా అందరూ ఉపవాసం ఉండమని చెప్పినా కూడా మల్లిక మాట వినకుండా చికెన్ పిజ్జా తెచ్చుకొని తింటుంది. ఆ విషయం అందరిని షాక్ కు గురి చేస్తుంది.

బయటకు వెళ్లాల్సింది జానకి

బయటకు వెళ్లాల్సింది జానకి

చికెన్ పిజ్జా తెచ్చిన డెలివరీ బాయ్ ఇంటి బయట ఉండి రామచంద్రను పలకరించడంతో అసలు విషయం బయటపడుతుంది. దీంతో మళ్ళీ బయటకు పంపించాలి అనే చర్చ మొదలవుతుంది. మల్లిక బ్రతిమాలుకుంటూ ఉండగా ఈసారి బయటకు వెళ్లాల్సింది మల్లిక కాదు జానకి అంటూ జ్ఞానాంబ చెప్పడంతో అందరూ షాక్ అవుతారు.

తల్లిని సమర్దించిన రామచంద్ర

తల్లిని సమర్దించిన రామచంద్ర

జానకికి ఈ ఇంట్లో ఎవరిని సమర్దించాలి.. ఎవరిని సమర్దించకూడదు అనే విషయం తెలియాలి అని జ్ఞానాంబ అదేశిస్తుంది. జ్ఞానంబ భర్త ఒక్కడే ఆపే ప్రయత్నం చేసినప్పటికి ఎవరు పట్టించుకోరు. అదే విధంగా రామ కూడా తల్లి చెప్పిన మాటకు విలువ ఇస్తూ ఆమె వెనకాల నిలబడడం జానకిని బాధకు గురి చేస్తుంది.

బాధ లేకుండా మల్లికా ఆనందం

బాధ లేకుండా మల్లికా ఆనందం

జానకి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోగానే మల్లిక ఏ మాత్రం బాధ లేకుండా ఫోన్ లో గేమ్స్ ఆడుకుంటూ ఉంటుంది. అది చూసిన భర్త కొంచెం కూడా బాధ లేదా అని అడుగుతుంటే.. నాకేంటి బాధ అన్నట్లు సమాధానం చెబుతుంది. నేను ఏది చేసినా కూడా తప్పే.. జానకి ఏది చేసినా ఒప్పే అంటే నాకు కడుపు మండిపోదా అంటూ తన విలనిజాన్ని చూపిస్తుంది.

 జానకిని తీసుకువచ్చిన రామచంద్ర

జానకిని తీసుకువచ్చిన రామచంద్ర

ఇక జ్ఞానాంబ కోడలి విషయంలో బాధ పడుతూనే ఉంటుంది. అసలు జ్ఞానాంబకు మనవడ్ని ఆడించే అదృష్టం లేదని అందరూ అనే మాటలు తనకు ఎంత బాధను కలిగిస్తాయో ఎవరికి అర్థం కాదు అంటూ భర్తకు వివరణ ఇస్తుంది. ఇక మరోవైపు జానకిని వెతుక్కుంటూ వెళ్లిన రామ మొత్తానికి ఆమెకు నచ్చజెప్పి మళ్ళీ ఇంటికి తీసుకువస్తాడు. మరి ఆ విషయంలో జ్ఞానాంబ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X