Janaki Kalaganaledu June 10th: కొడుకు గెలుపుకోసం రంగంలోకి జ్ఞానాంబ.. చివరలో మరో ట్విస్ట్!

జానకి కలగనలేదు రోజురోజుకు మరింత ఆసక్తిగా జనాలను ఆకట్టుకుంటోంది. జానకి చదువు కోసమే కన్నబాబు దగ్గర రామచంద్ర లక్ష రూపాయలు అప్పు చేసిన రామచంద్ర ఎలాగైనా ఆ అప్పుని తీర్చాలని అనుకుంటాడు. ఇక ఆ అప్పును తీర్చేందుకు ఇంటర్నేషనల్ చెఫ్ పోటీలో ప్రైజ్ మనీ గెలవాలని కూడా అనుకుంటాడు. మరోవైపు కన్నబాబు, రామచంద్ర స్వీట్ షాప్ ను దక్కించుకునే విధంగా ప్రయత్నం చేసాడు. ఇక జానకి తన భర్తను వంటల పోటీల్లో గెలిపించేందుకు ప్రయత్నం చేస్తోంది. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 6.70 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 319వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..

రామచంద్ర టెన్షన్

రామచంద్ర టెన్షన్

రామచంద్ర వంటల పోటీల్లో ఎలాగైనా గెలవాలి అని చాలా తాపత్రయ పడుతూ ఉంటాడు. కానీ అతనికి ప్రతి సారి కూడా ఊహించని విధంగా పలు రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఇక రెండవ రోజు అతను చాలా ముఖ్యమైన పోటీని ఎదుర్కొంటాడు. మొదటి రౌండ్లో అంతకుముందే రామచంద్ర ఒక వెస్ట్రన్ ఫుడ్ తయారు చేసి చాలా తక్కువ మార్కులు అందుకుంటాడు. తర్వాత రోజు జరగబోయే సెకండ్ రౌండ్ లో తప్పకుండా రామచంద్ర ఎక్కువ మార్కులు సంపాదించాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే తను తప్పకుండా ఎలిమినేట్ అవుతారు అని కూడా న్యాయ నిర్ణేతలు వివరణ ఇస్తారు. అందుకే రామచంద్ర తదుపరి రౌండ్ కోసం చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు.

కొడుకు కోసం వెళ్లిన జ్ఞానాంబ

కొడుకు కోసం వెళ్లిన జ్ఞానాంబ

ఇక ముందుగానే రామచంద్ర టెన్షన్ పడుతున్న విధానాన్ని టీవీలో చూసిన తల్లి జ్ఞానాంబ వెంటనే అతని కోసం హైదరాబాద్ కు తిరిగి వస్తుంది. కొడుకు తప్పకుండా గెలవాలని ఆమె కూడా ఆశపడుతోంది. మొదట రామచంద్రను వంటల పోటీలకు పంపకూడదు అని అనుకున్న రామచంద్ర జానకి బ్రతిమాలడం తో తప్పకుండా గెలుస్తాడు అని గోవింద రాజులు కూడా చెప్పడంతో ఆమె ఒప్పుకుంటుంది. ఇక ఇప్పుడు గెలవకపోతే రామచంద్ర తీవ్ర మనోవేదనకు గురి అవుతాడని ఎలాగైనా కొడుకును గెలిపించాలని వంటల పోటీలు జరుగుతున్న చోటు కి వెళుతుంది. ఇక తల్లిదండ్రులను అలా చూడగానే రామచంద్రకు ఒక్కసారిగా ధైర్యం వస్తుంది.

తల్లి సలహాతో..

తల్లి సలహాతో..

మీకు ఇష్టమైన వంటకాలు చేయాలో చెప్పారని అయితే ఏది చేయాలో అర్థం కావడంలేదని తన తల్లిని రామచంద్ర అడుగుతాడు. ఇక వెంటనే జ్ఞానాంబ పాతకాలపు ఆరోగ్యకరమైన ఒక పాయసం చేయాలని చెబుతుంది. చిరుధాన్యాల తో పాయసం చేస్తే అది ఆరోగ్యానికి కూడా మంచిది అని చిరుధాన్యాలను కొందరు అనవసరంగా పక్కన పడేస్తున్నారు అని వాడితో చేయగలిగితే వాటి విలువ అందరికీ తెలుస్తుంది అని సలహా ఇస్తుంది. దీంతో వెంటనే రామచంద్ర తప్పకుండా చిరుధాన్యాలతో మంచి వంటకాన్ని తయారు చేస్తాను అని ధైర్యంగా చెబుతాడు ఇక వెంటనే పోటీకి కూడా సిద్ధం అవుతాడు.

మల్లిక రివెంజ్

మల్లిక రివెంజ్

ఇక పోటీ జరుగుతుండగా మరొకవైపు మల్లిక టీవీలో చూస్తూ ఎలాగైనా జానకి రామచంద్రలపై రివేంజ్ తీర్చుకోవాలని అనుకుంటుంది. అయితే ఆమె టీవీ చూస్తూ ఉండగానే అప్పుడే కరెంట్ కూడా పోతుంది. ఈ తరుణంలో అక్కడికి నీలావతి వస్తుంది. ఇక నిలవతిని చూసిన మల్లికకు ఎన్నో ఈ విషయాలపై ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే ఆమెకు కావలసిన డబ్బులు కూడా ఇస్తుంది. ఆమెను వాడుకొని మరొకసారి రామచంద్ర జానకి పరువు తీసే విధంగా చేయాలి అనే జ్ఞానాంబ మనసులో కూడా కోపం కలిగించేలా చేయాలి అనే మల్లిక ఆలోచిస్తూ ఉంటుంది. అందుకే ఆమె అడిగిన డబ్బును ఇస్తుంది.

రామచంద్రకు షాక్

రామచంద్రకు షాక్


ఇక వంటల పోటీలలో రామచంద్ర చాలా కష్టపడుతూ తనకు ఇష్టమైన వంటకం చేస్తూ ఉంటాడు. ఇక వంటకాలు పూర్తి అయిన తర్వాత వాటిని బయట ఉన్న స్టాల్స్ లో పెట్టె ఇక్కడికి వచ్చిన టూరిస్టులకు అమ్మాలి అని న్యాయనిర్ణేతలు చెబుతారు. ఎవరైతే ఎక్కువగా ఎక్కువ డబ్బు సంపాదిస్తారో వారికే ఎక్కువ మార్కులు వస్తాయని కూడా జడ్జీలు చెప్పడంతో రామచంద్ర కూడా చాలా ఉత్సాహంగా వెళ్లి అక్కడ పాల్గొంటాడు. అయితే అతను చేసిన పాయసం కొనడానికి ఎవరూ కూడా మొదట ముందుకు రారు. అంతే కాకుండా దాని వాసన చూసి ఏదో అనుకుని అక్కడి నుంచి వెళ్లి పోతారు. మరోవైపు తల్లి జ్ఞానాంబ కొడుకు పరిస్థితిని చూసి కంగారు పడుతూ ఉంటుంది. ఎవరు కూడా కొనడం లేదు ఏమిటి అనే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటుంది.

Recommended Video

Ante Sundaraniki Movie Genuine Review *Reviews | Telugu Filmibeat
 చిబరికి రామ హ్యాపీ

చిబరికి రామ హ్యాపీ


అయితే అందరూ కంగారు పడుతున్న సమయంలో ఒక చిన్న బాబు వచ్చి పాయసం ఇవ్వమని అడుగుతాడు. ఇక ఆ పిల్లవాడు అలా తాగగానే చాలా బాగుంది అని ఫీల్ అవుతాడు. అయితే వారి తల్లిదండ్రులు వచ్చి అతని చేతిలో ఉన్న మట్టి గ్లాసు కింద పడేసి ఏది పడితే అది తాగ కూడదు అని తిడతారు. అయితే ఇది ఆరోగ్యానికి మంచిది అని రామచంద్ర అక్కడ అందరికీ అర్థమయ్యేలా చెబుతాడు. ఒకసారి తాగి చూడండి మీకు నచ్చితేనే డబ్బులు ఇవ్వాలి అని కూడా చెబుతాడు. దీంతో ఆ తల్లి ఒకసారి తాగి చాలా బాగుంది అని చెబుతోంది. అలాగే అతని తండ్రి కూడా బాగుంది అని అంటాడు. వెంటనే రామాకు ఐదు వందల రూపాయలు ఇస్తారు. కేవలం వంద రూపాయలు మాత్రమే అని రామచంద్ర చెప్పినప్పటికీ అతను నువ్వు చేసిన పాయసం కి ఎంత అయినా ఇవ్వచ్చు అని చెప్పడంతో రామచంద్ర సంతోషంలో మునిగిపోతాడు. మరి రామచంద్ర ఈ రౌండ్ లో ఎన్ని డబ్బులు సంపాదిస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X