twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Janaki Kalaganaledu June 11th Episode: జానకికి అండగా నిలిచిన రామ.. మరో ట్విస్ట్ ఇచ్చిన జ్ఞానాంబ

    |

    జానకి కలగనలేదు సీరియల్ మరింత ఉత్కంఠగా మారుతోంది. ఈజిగానే టాప్ రేటింగ్స్ అందుకునే సీరియల్ గా నిలవడం కాయంగా కనిపిస్తోంది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో నటీనటులు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతున్నారు. అత్త కోడళ్ల మధ్య కెమిస్ట్రీని విబిన్నంగా ప్రజెంట్ చేస్తూ ప్రతిరోజు మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు. జానకి - రామచంద్ర క్యూట్, రొమాంటిక్ సీన్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.

    అందమైన ప్రేమ మధ్యలో భార్య జానకి ఆశయం, అలాగే భర్త రామచంద్ర అమాయకత్వ ప్రేమ, అత్త జ్ఞానాంబ కట్టుబాట్లు ఆప్యాయత.. ఈ సిరియల్ లో ప్రధాన అంశాలు. ఇక ఈ రోజు ప్రసారం కాబోయే 60వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

    రామ కూడా తల్లి మాటకు కట్టుబడి

    రామ కూడా తల్లి మాటకు కట్టుబడి

    మల్లిక చేసిన తప్పు వలన జ్ఞానాంబ జానకిని ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఆమె వెళ్లిపోతుంటే.. జ్ఞానంబ భర్త ఒక్కడే ఆపే ప్రయత్నం చేసినప్పటికి ఎవరు పట్టించుకోరు. అదే విధంగా రామ కూడా తల్లి చెప్పిన మాటకు విలువ ఇస్తూ ఆమె వెనకాల నిలబడడం జానకిని బాధకు గురి చేస్తుంది.

    జానకి కోసం రామ..

    జానకి కోసం రామ..

    ఇక జానకి ఒంటరి పక్షిలా నడుచుకుంటూ వెళ్లి ఒక చోట కూర్చొని తనకు ఎవరు లేరేమో అని బాధపడుతుంది. ఇక ఇంతలో జానకిని వెతుక్కుంటూ వచ్చిన రామచంద్ర జానకిని ఇంటికి తీసుకువెళ్లేందుకు సిద్ధమవుతాడు. కానీ మొదట జానకి ఒప్పుకోదు. నా వల్ల మీ ఇంట్లో గొడవ జరగడం ఇష్టం లేదని చెప్పినప్పటికీ రామ తన మాట మీద గౌరవించి ఇంటికి రావాలని చెబుతాడు.

    నీ అనుమతి కోసం జానకిని ఇంటికి తీసుకు వచ్చాను

    నీ అనుమతి కోసం జానకిని ఇంటికి తీసుకు వచ్చాను

    మొత్తానికి ఇంటికి తీసికువచ్చిన రామచంద్ర తల్లి జ్ఞానాంబ ఒకప్పుడు చెప్పిన మాటలను గుర్తు చేస్తాడు. ఎలాంటి కష్టంలో అయినా భార్యకు అండగా ఉండాలని నువ్వు చెప్పినట్లుగానే చేస్తున్నాను కధమ్మా అంటూ ఇప్పుడు నీ అనుమతి కోసం జానకిని ఇంటికి తీసుకు వచ్చాను అని వివరణ ఇస్తుంది.

    షాక్ అయిన మల్లిక

    షాక్ అయిన మల్లిక

    ఇక జ్ఞానాంబ అస్సలు ఒప్పుకోదు అని మల్లిక సంబరపడుతుంది. కానీ జ్ఞానాంబ అందుకు భిన్నంగా జానకిని లోపలికి తీసుకు వెళ్ళాలి అని చెప్పడంలో అందరూ సంతోషిస్తారు. ఇక మల్లిక మాత్రం షాక్ అవుతుంది. పెద్ద కొడలు బయటకు వెళ్లిపోతే ఇక పెత్తనమంతా నాదే అనుకుంటే ఇలా అయ్యిందేంటి అని ఆశ్చర్యపోతుంది.

    అండగా నిలిచిన రామ

    అండగా నిలిచిన రామ

    ఇక మరోవైపు జానకి - రామచంద్ర ఇంట్లోకి వెళ్లి బెడ్ రూమ్ లోకి వెళ్లి ఒకరినొకరు చూసుకుంటూ బాధపడుతూ ఉంటారు. ఇక రామ తన మాటలతో ధైర్యాన్ని ఇచ్చి జనాకికి మరింత దగ్గరవుతాడు. ఏం జరిగినా కూడా మీ పక్కనే ఉంటాను అని భరోసా ఇవ్వడంతో నేను అనాధను అని అనుకున్నాను. కానీ ఇప్పుడు మీ మాటలు విన్నాక నాకు మీరున్నారు అని అనుకుంటున్నాను అని జానకి రామను కౌగిలిచుకుంటుంది.

    జానకితో పనులు చేయించాలని

    జానకితో పనులు చేయించాలని

    ఇక జ్ఞానాంబ జనాకికి ఇంట్లో వ్యవహారాలు పూర్తిగా తెలియాలని అనుకుంటుంది. జానకి బట్టలు ఉతకాలని అంటుంది. ఏ పని తెలియని జనాకికి మరోసారి భర్త అండగా నిలిచి బట్టలు ఉతికే ప్రయత్నం చేస్తాడు. ఇక అప్పుడే జ్ఞానాంబ ఇంటికి వస్తుంది. ఆ తరువాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి.

    English summary
    Janaki Kalaganaledu Today Episode 60
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X