Janaki Kalaganaledu June 14th Episode: పక్కనే పడుకొమ్మని జానకి గ్రీన్ సిగ్నల్.. ఆనందంలో రామ.. జ్ఞానాంబ సీరియస్

జానకి కలగనలేదు సీరియల్ గత వారం టాప్ 5 రేటింగ్స్ అందుకుంటూన్న సిరియల్స్ లో చోటు సంపాదించుకుంది. రోజురోజుకు సిరియల్ డ్రామా మరింత ఉత్కంఠగా మారుతోంది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో నటీనటులు యాక్టింగ్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతున్నారు. అత్త కోడళ్ల మధ్య కెమిస్ట్రీతో మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!

జానకి - రామచంద్ర క్యూట్, రొమాంటిక్ సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అందమైన ప్రేమ మధ్యలో జానకి ఆశయం, అలాగే రామచంద్ర అమాయకత్వ ప్రేమ, అత్త జ్ఞానాంబ కట్టుబాట్లు ఆప్యాయత.. ఈ సిరియల్ లో ప్రధాన అంశాలు. ఇక ఈ రోజు ప్రసారం కాబోయే 60వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

సరికొత్త ట్రాజెడి

సరికొత్త ట్రాజెడి

మల్లిక చేసిన తప్పు వలన జ్ఞానాంబ జానకిని ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవాలని ఆదేశించిన ఎపిసోడ్ గత వారం ట్రాజెడి క్రియేట్ చేసింది. అయితే ఆ విషయంలో రామచంద్ర తల్లి మాటను కాదని ఇంటికి తీసుకురావడంతో స్టోరీ సరికొత్త మలుపులు తిరుగుతుంది. ఫైనల్ గా రామచంద్ర ప్రేమ ఏమిటో జానకికి పూర్తిగా అర్థమవుతుంది.

కౌగిలింతలో రామ, జానకి

కౌగిలింతలో రామ, జానకి

జానకి - రామచంద్ర రూమ్ లోకి వెళ్లి ఒకరినొకరు చూసుకుంటూ బాధపడుతూ ఉంటారు. రామ కూడా తన మాటలతో జనాకికి మరింత ధైర్యాన్ని ఇస్తాడు. ఏం జరిగినా కూడా మీ పక్కనే ఉంటాను అని భరోసా ఇవ్వడంతో జానకి ఎమోషనల్ అవుతుంది. ఇక ఒకరినొకరు కౌగిలించుకున్న తరుణంలో సడన్ గా ఆ మైకం నుంచి బయటకు వచ్చి సిగ్గుపడుతూ ఉంటారు.

బాధలో జ్ఞానాంబ

బాధలో జ్ఞానాంబ

మరోవైపు జ్ఞానాంబ కొడుకు చేసిన పనిని తలచుకుంటూ ఎంతగానో బాధపడుతుంది. ఆ క్రమంలో రామ వచ్చి కాళ్ళు పట్టే ప్రయత్నం చేసినప్పటికీ వినిపించుకోదు. కాలం కన్న బిడ్డలను కూడా మార్చేస్తుందని బాధపడుతుంది. అందుకు రామ కూడా బాధపడుతూ నీ గౌరవం కోసమే అలా చేశాను అని వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు.

తల్లిని కూల్ చేసిన రామచంద్ర

తల్లిని కూల్ చేసిన రామచంద్ర

జ్ఞానాంబ పెళ్లి సమయంలో చెప్పిన మాటలను గుర్తు చేస్తాడు. ఎలాంటి కష్టంలో అయినా భార్యకు అండగా ఉండాలని నువ్వు చెప్పినట్లుగానే చేస్తున్నాను కధమ్మా అందుకే ఇప్పుడు నీ అనుమతి కోసం జానకిని ఇంటికి తీసుకు వచ్చాను అని వివరణ ఇస్తాడు. దాంతో జ్ఞానాంబ చల్లబడుతుంది అనవసరంగా వేరే విషయాల్లో నీ భార్యను తలదూర్చవద్దని రామచంద్రకు సలహా ఇస్తుంది.

పక్కనే పడుకొమ్మని జానకి గ్రీన్ సిగ్నల్

పక్కనే పడుకొమ్మని జానకి గ్రీన్ సిగ్నల్

ఇక ప్రతిరోజూ జానకి బెడ్ పై పడుకుంటూ ఉంటే రామచంద్ర కూడా కింద పడుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో జానకి మనసు భర్తకు దగ్గరవ్వడంతో దుప్పటి కప్పుతుండగా చేయి పట్టుకొని పక్కనే పడుకొమ్మని అడుగుతుంది. అలాగే తనకు ధైర్యంగా ఉంటుందని కూడా అంటుంది. అందుకు రామచంద్ర పరవాలేదని ధైర్యం చెబుతాడు. ఇక అంతలో బొద్దింక రావడంతో జానకి భయపడుతుంది. దాన్ని పడేసిన అనంతరం బెడ్ పైనే కొద్దీ సేపు కూర్చుద్దామని ఇద్దరు అనుకుంటారు.

సిరియస్ గా తీసుకున్న జ్ఞానాంబ

సిరియస్ గా తీసుకున్న జ్ఞానాంబ

ఇక మరోవైపు జ్ఞానాంబ జనాకికి ఇంట్లో వ్యవహారాలు పూర్తిగా అర్థమవ్వాలి అనుకుంటుంది. మల్లిక విషయాన్ని కూడా సిరియస్ గా తీసుకుంటుంది. ఇక జానకి బట్టలు ఉతకాలని అంటుంది. ఏ పని తెలియని జనాకికి మరోసారి భర్త అండగా నిలిచి బట్టలు ఉతికే ప్రయత్నం చేస్తాడు. ఇక అప్పుడే జ్ఞానాంబ ఇంటికి వస్తుంది. ఆ తరువాత ఏం జరుగుతుందో మరుసటి ఎపిసోడ్ లో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X