Janaki Kalaganaledu June 14th: రామచంద్రను ఓడించేందుకు సునంద ప్లాన్.. మరో ట్విస్ట్ ఇచ్చిన జానకి

జానకి కలగనలేదు మరో ఆసక్తికరమైన అంశంతో ముందుకి సాగుతోంది. జానకి ఐపీఎస్ చదువు కోసం కన్నబాబు దగ్గర రామచంద్ర లక్ష రూపాయలు అప్పు చేస్తాడు. రామచంద్ర ఎలాగైనా ఆ అప్పుని తీర్చాలని అనుకుంటాడు. ఇక ఆ అప్పును తీర్చేందుకు ఇంటర్నేషనల్ చెఫ్ పోటీలో ప్రైజ్ మనీ గెలవాలని కూడా అనుకుంటాడు. కానీ కన్నబాబు, రామచంద్ర అప్పు తీర్చే కంటే ముందే స్వీట్ షాప్ ను దక్కించుకునే విధంగా ప్రయత్నం చేసాడు.

ఇక జానకి తన భర్తను వంటల పోటీల్లో గెలిపించేందుకు ప్రయత్నం చేస్తోంది. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 6.70 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 322వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..

వంటల పోటీల్లో రామ విజయాలు

వంటల పోటీల్లో రామ విజయాలు

రామచంద్రను వంటల పోటీల్లో ఎలాగైనా గెలిపించాలని జానకి ఎంతగానో ఆశపడుతుంది. కానీ అతనికి ప్రతి సారి కూడా ఊహించని విధంగా పలు రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఇక రెండవ రోజు అతను చాలా ముఖ్యమైన పోటీని ఎదుర్కొంటాడు. ఫస్ట్ రౌండ్లో అంతకుముందే రామచంద్ర ఒక వెస్ట్రన్ ఫుడ్ తయారు చేసి చాలా తక్కువ మార్కులు అందుకుంటాడు. ఇక ఆ తరువాత రోజు జరగబోయే సెకండ్ రౌండ్ లో తప్పకుండా రామచంద్ర ఎక్కువ మార్కులు సంపాదించాల్సిన అవసరం ఉంటుంది. ఇక రామ ఒక మంచి స్వీట్ చేసి ఎక్కువ మార్కులు అందుకుంటాడు.

తల్లి సపోర్ట్

తల్లి సపోర్ట్

అయితే మొదట రామచంద్ర టెన్షన్ పడుతుండడంతో అతని కోసం తల్లి జ్ఞానాంబ తండ్రి రామచంద్ర వెంటనే హైదరాబాద్ కు తిరిగి వస్తారు. అసలు రామచంద్రను వంటల పోటీలకు పంపకూడదని అనుకున్న జ్ఞానాంబ మొత్తానికి కొడుకు గెలవాలని అనుకుంటుంది. ఆ విషయంలో రామచంద్ర ఎంతగానో హ్యాపీగా ఫీల్ అవుతాడు. జానకి కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఇక రామచంద్ర తన తల్లి ఇచ్చిన స్పూర్తితో గేమ్ లో మరింత ఆనందంగా పాల్గొంటారు.

నాన్ వెజ్ రాదన్న రామచంద్ర

నాన్ వెజ్ రాదన్న రామచంద్ర

సెమీ ఫైనల్ లో నాన్ వెజ్ వంటకాన్ని తయారు చేయాలి అని చెప్పడంతో రామచంద్ర కంగారు పడతాడు. కానీ రామచంద్ర చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ఏ మాత్రం ముట్టుకొడు. వారి కుటుంబంలో మాంసం కూడా ఎవరు తినరు. అయితే ఈ పోటీకి వచ్చినప్పుడు అన్ని చేయాలి అని అన్నిటికీ సిద్ధంగా ఉండాలని కూడా న్యాయనిర్ణేతలు చెబుతారు. ఇక నాన్ వెజ్ వంటకం రాదని చెప్పడంతో టీవీలో ప్రోగ్రాం చూస్తున్నా మల్లిక చాలా ఆనందపడుతుంది. ఎలాగైనా ఈ పోటీలో బావగారు ఓడిపోవాలని జానకి మళ్ళీ ఇంట్లో నుంచి వెళ్లి పోవడం ఖాయమని కూడా ఆమె సంబరపడుతోంది. పోటీలో ఉన్న రామచంద్ర శత్రువు కన్నబాబు తల్లి సునంద దేవి కూడా హ్యాపీ గానే ఫీల్ అవుతుంది.

ట్విస్ట్ ఇచ్చిన జానకి

ట్విస్ట్ ఇచ్చిన జానకి

ఇక పరిస్థితులు అన్నీ కూడా రామచంద్రకు విరుద్ధంగా ఉండటంతో అతను కంగారు పడుతూ ఉంటాడు. అయితే అదే సమయంలో జానకి తన తెలివితో అక్కడ మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ వారి వ్యక్తిగత మనోభావాలను దెబ్బతీయకుండా ఉండాలని మా కుటుంబ ఆచారం ప్రకారం మేము ఎప్పుడూ కూడా మాంసం ముట్టుకోమని ఒక వ్యక్తి మనోభావాలకు కూడా విలువ ఇవ్వాలి అని పోటీకి వచ్చే ముందు తెలియజేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఇక జానకి చెప్పిన విషయంపై ఆలోచించి న్యాయనిర్ణేతలు అందుకు సరేనని రామచంద్ర నాన్ వెజ్ వంటకం వాండాల్సిన అవసరం లేదు కానీ అతనికి మేము ఇచ్చే ఒక టాస్క్ తో మాత్రం సిద్ధంగా ఉండాలి అని చెబుతారు.

రామచంద్రకు కొత్త టాస్క్

రామచంద్రకు కొత్త టాస్క్

ఇక రామచంద్ర కూడా అందుకు సిద్ధంగా ఉంటాడు. మీరు కళ్ళకు గంతలు కట్టుకుని మీకు ఇష్టమైన వంటకం రెడీ చేయాలి అని చెప్పడంతో రామచంద్ర ఒప్పుకుంటాడు. కానీ తల్లి జ్ఞానాంబ ఎంతగానో కంగారు పడుతుంది. కళ్ళకు గంతలు కట్టుకొని వంట చేయడం చాలా కష్టం అనుకుంటుంది. ఇక టీవీలో వీరి ప్రోగ్రాం చూసిన మల్లిక ఎంతగానో సంతోషిస్తుంది. అయితే బావగారు పోటీల్లో గెలిస్తే నేను మోకాళ్ళమీద ప్రదక్షిణలు చేస్తాను అని ఏదో బయటకు వినిపించేలా భర్త ముందే చెబుతుంది. అయితే మల్లిక తిక్క కుదురుతుంది అని ఆమె చెప్పిన మాట ప్రకారమే గుడి దగ్గర ప్రదక్షిణలు చేయిస్తాడు. కానీ ఆమె మాత్రం తన మనసులో రామచంద్ర ఓడిపోవాలని కోరుకుంటూనే ఉంటుంది.

ఒడిపోయేలా చేయాలి అని..

ఒడిపోయేలా చేయాలి అని..

ఇక మరోవైపు సునంద దేవి వంటల పోటీల్లో పాల్గొన్న ఒక అమ్మాయి కి డబ్బులు ఇచ్చి రామచంద్ర ఓడిపోయేలా చేయాలి అని చెబుతుంది. అయితే రామచంద్ర వంటల నువ్వు చెడగొట్టే విధంగా ఏదైనా కలపాలని కూడా ఆమె సలహా ఇస్తుంది. అందుకు ఆమె రామచంద్ర వంటల ఒక వాటర్ వేయకుండా తన వంటలు మరో రకమైన వాటర్ పోస్తుంది.

దాంతో సువాసన మారిపోతుంది. ఇక రామచంద్ర మీద నిందలు వేయడంతో అతను నేను చేయలేదు అని అంటాడు. కానీ జడ్జీలు మాత్రం ఆధారాలు నువ్వు చేసినట్లు ఉన్నాయి అని చెప్పడంతో వెంటనే జానకి సీసీ కెమెరాలను చూడవలసిందిగా కోరుతుంది. మరి జానకి ఇచ్చిన సలహాతో జడ్జీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X