Janaki Kalaganaledu June 15th Episode: భార్య కోసం ఆఖరికి చీరలు ఉతికిన రామ.. మరోసారి మల్లిక గండం

జానకి కలగనలేదు సిరియల్ లో ఫ్యామిలీ డ్రామాతో పాటు క్యూట్ రొమాన్స్ కూడా జనాలను బాగానే ఆకట్టుకుంటోంది. రోజురోజుకు ఈ సిరియల్ కథ మరింత ఉత్కంఠగా మారుతోంది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో నటీనటులు యాక్టింగ్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతున్నారు. అత్త కోడళ్ల మధ్య కెమిస్ట్రీతో మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు. జానకి - రామచంద్ర క్యూట్, రొమాంటిక్ సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అందమైన ప్రేమ మధ్యలో రామచంద్ర అమాయకత్వ ప్రేమ, జానకి ఆశయం, అత్త జ్ఞానాంబ కట్టుబాట్లు ఆప్యాయత.. ఈ సిరియల్ లో ప్రధాన అంశాలు. ఇక ఈ రోజు ప్రసారం కాబోయే 62వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

 జానకి స్పర్శను ఆస్వాదిస్తూ

జానకి స్పర్శను ఆస్వాదిస్తూ

భర్త అండతో ప్రేమలో మునిగిన జానకి తనకు ధైర్యంగా ఉంటుందని భర్తను పక్కనే పడుకొమ్మని చెబుతుంది. అందుకు రామచంద్ర పరవాలేదని ధైర్యం చెబుతాడు. ఇక అంతలో బొద్దింక రావడంతో జానకి భయపడుతుంది. దాన్ని పడేసిన అనంతరం బెడ్ పైనే కొద్దీ సేపు కూర్చుద్దామని ఇద్దరు అనుకుంటారు. అలానే అనుకోకుండా భుజంపై వాలిపోయిన జానకి స్పర్శను ఆస్వాదిస్తూ రామచంద్ర కూడా నిద్రలోకి జారుకుంటాడు.

 మల్లికపై జ్ఞానాంబ సిరియాస్

మల్లికపై జ్ఞానాంబ సిరియాస్

ఇక మరోవైపు జ్ఞానాంబ ఎవరు ఊహించని నిర్ణయం తీసుకుంటుంది. మల్లిక విషయాన్ని కూడా సిరియస్ గా తీసుకుంటుంది. పూజ చెడగొట్టి నా పరువు తీశావు. ఇక నుంచి నాకు సంబంధించిన వస్తువులను ఏ మాత్రం ముట్టుకోవద్దని అంటూ బట్టలు కూడా ఉతకవద్దని చెబుతుంది. అలాగే వంట కూడా చేయవద్దని ఆ పనులు జానకి చేస్తుందని జ్ఞానాంబ అదేశిస్తుంది.

మల్లికకు మరింత ఆగ్రహం

మల్లికకు మరింత ఆగ్రహం

జానకిని పిలిచి బట్టలు ఉతకాలని చెప్పడంతో మల్లిక అన్ని రకలుగా సంతోషిస్తుంది. వంట చేసే పని కూడా తగ్గిందని సంబరపడుతుంది. అయితే మరోవైపు జ్ఞానాంబ పెద్ద కోడలు జానకిపై పాజిటివ్ కామెంట్స్ చేయడంతో మల్లిక మరింత ఆగ్రహానికి గురవుతుంది.

భార్య కోసం చీరలు ఉతికిన రామచంద్ర

భార్య కోసం చీరలు ఉతికిన రామచంద్ర

ఇక వెంటనే పెరట్లోకి వెళ్లి జానకి బట్టలు ఉతకాలని అనుకుంటుంది. కానీ ఏ పని తెలియని జనాకికి మరోసారి భర్త అండగా నిలిచి బట్టలు ఉతికే ప్రయత్నం చేస్తాడు. గారాబంగా పెరిగిన అమ్మాయి కాబట్టి మీకు ఏ పనులు రావని తెలుసు, అందుకే అన్ని తెలిసే వరకు మీకు సహాయంగా ఉంటానని రామచంద్ర భార్యకు భరోసా ఇస్తాడు.

Recommended Video

Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
మరోసారి మల్లిక గండం..

మరోసారి మల్లిక గండం..

ఇక వంట కూడా చేయాలని జ్ఞానాంబ ఆదేశాలు జారీ చేయడంతో జానకి వీడియోలు చూస్తూ ఎలాగోలా పూర్తి చేయాలని అనుకుంటుంది. అయితే వంట సక్సెస్ అయితే తనను ఎత్తి పొడవడం కాయకని మల్లిక ఆ వంటను చెడగొట్టాలని అనుకుంటుంది. కూరలో కారం, ఉప్పు ఎక్కువగా వేస్తుంది. మరి ఆ వంట రేపటి ఎపిసోడ్ లో ఎలాంటి మలుపులు తిప్పుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X