Janaki Kalaganaledu June 16th: ఫైనల్స్ లో తల్లి సహాయం కోసం రామ ఎదురుచూపులు.. కన్నబాబు మరో ప్లాన్!

జానకి కలగనలేదు సీరియల్ ఆసక్తికరమైన కథాంశంతో ముందుకు సాగుతోంది. ఇక రామచంద్ర ఇంటర్నేషనల్ చెఫ్ పోటీలో ప్రైజ్ మనీ గెలవాలని కూడా అనుకుంటాడు. కానీ కన్నబాబు అతనిపై రివెంజ్ తీర్చుకోవాలని ఆ పోటీలో గెలవకుండా చేయాలని అనుకుంటాడు. అలాగే రామచంద్ర అప్పు తీర్చే కంటే ముందే స్వీట్ షాప్ ను దక్కించుకునే విధంగా ప్రయత్నం చేస్తాడు. ఇక జానకి మాత్రం తన భర్తను ఆ పోటీలో గెలిపించేలా చేయాలని అనుకుంటుంది. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 6.70 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 324వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..

జానకి అండతో..

జానకి అండతో..

జాతీయ స్థాయిలో జరుగుతున్న వంటల పోటీల్లో రామచంద్ర ఎంతగానో కష్టపడి ఫైనల్స్ వరకు చేరుకుంటాడు. సెమీఫైనల్లో అతని ఓడించడానికి కన్నబాబు అలాగే అతని తల్లి సునంద దేవి ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తారు. రామచంద్ర ప్రత్యర్ధి మహిళకు వారు డబ్బు ఆశ చూపించి అతని వంట చెడగొట్టాలని కూడా ప్రణాళికలు వేస్తారు. కానీ అవి కూడా సక్సెస్ కావు. జానకి అండతో రామచంద్ర సెమీ ఫైనల్లో మోసపోకుండా జాగ్రత్త పడతాడు.

కన్నబాబు రివెంజ్

కన్నబాబు రివెంజ్

ఇక రామచంద్ర ఫైనల్స్ కి వెళ్లడం తో అందరు కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. రామచంద్ర తల్లి జ్ఞానాంబ కూడా తన కొడుకు తప్పకుండా మళ్లీ ఫైనల్లో గెలుస్తాడు అని ఆశపడుతుంది. తండ్రి గోవిందరాజులు కూడా ఎంతో ఆనందంలో మునిగిపోతారు. అయితే అందరూ హ్యాపీగా ఉన్న సమయంలో కన్నబాబు మరో దుర్మార్గమైన ప్రణాళిక వేస్తాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ రామచంద్ర ఫైనల్ పోటీలో పాల్గొనకూడదు అని అందుకు ఏదో ఒకటి చేయాలి ఆలోచిస్తాడు. అందుకు అతని తల్లి సునంద దేవి కూడా మద్దతు ఇస్తుంది.

రామ భుజానికి గాయం

రామ భుజానికి గాయం

ఇక రామచంద్ర జానకి ఇద్దరు కూడా గార్డెన్ ఏరియాలో నడుచుకుంటూ వెళుతూ ఉండగా రామచంద్ర కొంత టెన్షన్లో ఉంటాడు. కన్నబాబు దగ్గర తీసుకున్న అప్పు విషయంలో ఎలాంటి అడ్వాంటేజ్ తీసుకుంటాడో అని రామచంద్ర టెన్షన్ పడుతూ ఉంటాడు. అయితే ఆ విషయంలో భర్తను ప్రశాంతంగా ఉంచేందుకు జానకి ధ్యానం చేయాలని చెబుతుంది. ఇక ఇద్దరూ ఒకచోట కూర్చుని ధ్యానం చేయడానికి కూడా సిద్ధం అవుతారు. ఇక అదే సమయంలో కన్నబాబు రామచంద్ర మీద ఒక పూల కుండి వేస్తాడు. దీంతో అతని భుజానికి తీవ్రంగా గాయపడుతుంది.

ఆందోళనలో జానకి, జ్ఞానాంబ

ఆందోళనలో జానకి, జ్ఞానాంబ

అక్కడి నుంచి వెంటనే జానకి రామచంద్రను గదికి తీసుకువెళ్లి డాక్టర్ ను కూడా పిలిపిస్తుంది. ఇక డాక్టర్ చెక్ చేసిన తర్వాత రామచంద్ర భుజానికి తీవ్రంగా గాయమైంది అని అతను కొన్ని రోజుల పాటు చేయి కదపకుండా ఉంటేనే మంచిది అని కూడా సలహా ఇస్తాడు. అయితే ఉదయమే వంటల పోటీలకు సిద్ధం కావాల్సి ఉండగా ఈ సమయంలో ఇలా గాయం కావడం నిజంగా దారుణం అని జానకి అలాగే రామచంద్ర తల్లి కూడా ఆందోళనలో ఉంటారు. కానీ రామచంద్ర మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఫైనల్ పోటీల్లో మిస్ అవ్వకూడదని గెలిచి తీరాలి అని అంటాడు. అయితే ఆ పోటీలో పాల్గొనడానికి వీల్లేదు అని అతని తల్లి కూడా చెబుతోంది. ఇక్కడి వరకు వచ్చింది చాలు అనే నీ పోటీల కంటే ఆరోగ్యమే నాకు ముఖ్యం అని జ్ఞానాంబ అనడంతో జానకి కొంత అప్సెట్ అవుతుంది.

తల్లిని ఒప్పించిన రామ

తల్లిని ఒప్పించిన రామ

ఇక ఇంతలో రామచంద్ర తన తల్లిని దగ్గరికి తీసుకుని నా జీవితంలో నిన్ను ఎప్పుడూ ఏమీ అడగలేదు అమ్మా.. కానీ నువ్వు మాత్రం ఏదో ఒకటి అడగాలి అని అంటూ ఉంటావు. అందుకే ఇప్పుడు నేను అడుగుతున్నాను. ఈ ఫైనల్ పోటీలో పాల్గొనే ఛాన్స్ ఇవ్వాలి అని.. తప్పకుండా ఈ పోటీలో గెలిచిన తో నూనె రామచంద్ర చెప్పడంతో అందుకు జ్ఞానాంబ ఒప్పుకుంటుంది. అయితే ఈ ఫైనల్ పోటీలకు మాత్రం తాను రాలేనని మీరే వెళ్లండి అని చెబుతోంది. ఇక హ్యాపీగా ఫైనల్ పోటీలకు వెళ్ళిన రామచంద్ర జానకి గోవిందరాజులు ఎంతో సంతోషంగా ఉంటారు.

Recommended Video

Megastar Chiranjeevi Acting School Admissions open *Entertainment | Telugu Filmibeat
కనెక్షన్ కట్ చేసిన కన్నబాబు

కనెక్షన్ కట్ చేసిన కన్నబాబు

అయితే అక్కడ ఫైనల్ పోటీలో మీకు ఇష్టమైన వంటకాలు చేయాలి అని చెబుతారు. అంతేకాకుండా అది చాలా ప్రత్యేకతతో ఉండాలి అని కూడా జడ్జీలు చెప్పడంతో రామచంద్ర కూడా ఎంతగానో హ్యాపీగా ఫీల్ అవుతాడు. ప్రత్యేకంగా మంచి వంటకం అంటే పూతరేకులు అయితే బాగుంటాయి అని.. అవి చేయాలని అనుకుంటాడు. అయితే పూతరేకులు చేయాలి అంటే రెండు చేతులు కూడా చాలా వేగంగా కదలాలి. కానీ రామచంద్రం చేతికి గాయం కావడం వలన అది సాధ్యమయ్యే పని కాదు. అందుకే మరొకరి సహాయం తీసుకోవడానికి వారు సిద్ధమవుతారు. అందుకు న్యాయనిర్ణేతలు కూడా ఒప్పుకున్నారు. ఇక వెంటనే జ్ఞానాంబను సహాయంగా తీసుకురావాలి అని జానకి అనుకుంటుంది. అప్పుడే ఆమె ఉన్న రూమ్ కు ఫోన్ కూడా చేస్తారు. కానీ ఇంతలో కన్నబాబు జ్ఞానాంబకు ఫోన్ రాకుండా రూమ్ దగ్గర ఉన్న వైర్లు కట్ చేస్తారు. మరి జ్ఞానాంబ కొడుకు కోసం సరైన సమయానికి వస్తుందో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X