For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu June 17th Episode: ఆపద్బాంధవుడిలా జానకిని కాపాడిన రామ.. మరో గుట్టు పసిగట్టిన మల్లిక

  |

  స్టార్ మాలో ప్రసారం అవుతున్న జానకి కలగనలేదు సిరియాల్ రోజురోజుకు సరికొత్త ట్విస్టులతో ప్రేక్షకులకు మరింత దగ్గరవుతోంది. క్యూట్ రొమాన్స్ కూడా నేటితరం జనాలను బాగానే ఆకట్టుకుంటోంది. పైగా రెగ్యులల్ ఫ్యామిలీ డ్రామా కాకుండా కాస్త విబిన్నమైన సీన్స్ తో ఎట్రాక్ట్ చేస్తున్నారు. అత్త కోడళ్ల మధ్య కెమిస్ట్రీతో మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు.

  జానకి - రామచంద్ర క్యూట్, రొమాంటిక్ సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అందమైన ప్రేమ మధ్యలో రామచంద్ర అమాయకత్వ ప్రేమ, జానకి ఆశయం, అత్త జ్ఞానాంబ కట్టుబాట్లు ఆప్యాయత.. ఈ సిరియల్ లో ప్రధాన అంశాలు. ఇక ఈ రోజు ప్రసారం కాబోయే 64వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

  వీడియోలు చూస్తూ

  వీడియోలు చూస్తూ

  వంట కూడా జానకి చేయాలని జ్ఞానాంబ ఆదేశాలు జారీ చేయడంతో సరికొత్త ఎపిసోడ్ మొదలవుతుంది. వంటలు ఎలా చేయాలో తెలియని జానకి కంగారు పడుతుంది. మొత్తానికి వీడియోలు చూస్తూ ఎలాగోలా వంట పూర్తి చేస్తుంది. అయితే వంట సక్సెస్ అయితే తనను ఎత్తి పొడవడం కాయకని మల్లిక ఆ వంటను చెడగొట్టాలని అనుకుంటుంది.

  ఈ కూర అమ్మ తింటే ప్రళయమే

  ఈ కూర అమ్మ తింటే ప్రళయమే

  వంట పూర్తి చేసిన అనంతరం మల్లిక కూరలో కారం, ఉప్పు ఎక్కువగా వేస్తుంది. ఇక అదే వంటను పని మనిషి చికిత్త రామచంద్రకు పంపిస్తుంది. జానకి చేసిందన్న ఆనందంలో రామచంద్ర వాటిని తినడానికి సిద్ధమవుతాడు. మొదటి ముద్దకే కూరలో కారం ఉప్పు ఎక్కువయినట్లు అనిపించడంతో ఈ కూర అమ్మ తింటే ప్రళయమే అని భార్యను కాపాడాలని అనుకుంటాడు.

  చెత్తలో పడేసిన రామ

  చెత్తలో పడేసిన రామ

  అప్పటికే జానకి చేతి వంట రుచి చూసేందుకు ఎంతో ఆకలితో జ్ఞానాంబ భర్తతో కలిసి ఇంటికి వస్తుంది. మరోవైపు మల్లిక గొడవ అవ్వడం కాయమని భర్తను కూడా ఇంటికి పిలిపిస్తుంది. ఈ క్రమంలో జ్ఞానాంబ కాళ్ళు చేతులు కడుక్కునేందుకు వెళ్లగా సడన్ గా రామచంద్ర వచ్చి జానకి డైనింగ్ టేబుల్ మీద పెట్టిన కూరలన్ని తీసుకొచ్చి చెత్తలో పడేస్తాడు.

  మల్లికకు కౌంటర్లు

  మల్లికకు కౌంటర్లు

  బయట నుంచి తెచ్చిన కర్రీస్ ను మరో గిన్నెల్లో వేసి జనాకికి ఇచ్చి పంపిస్తాడు. కానీ జనాకికి తన భర్త ఎందుకు అలా చేస్తున్నాడనేది అర్థం కాదు. భోజనం తిన్న జ్ఞానాంబ జానకిని పొగడ్తలతో ముంచెత్తుతుంది. అప్పుడు మల్లిక షాక్ అవుతుంది. రివర్స్ గా మళ్ళీ మల్లికకు ఎప్పటిలానే కౌంటర్లు పడతాయి. చూసి నేర్చుకుంటే మంచిది అంటూ జ్ఞానాంబ మల్లికను ఎత్తి పొడుస్తుంది.

  ఊపిరి పీల్చుకున్న జానకి

  ఊపిరి పీల్చుకున్న జానకి

  ఇక జానకి అత్త మాటలకు సంతోషిస్తుంది. అయితే రామ అలా ఎందుకు చేశాడు అనే సందేహం కలిసి కారణం లేకుండా ఆయన అలా చేయరని అనుకుంటుంది. తను చేసిన కూర రుచి చూస్తుంది. అందులో కారం ఉప్పు ఎక్కువగా అనిపించడంతో పెద్ద గండం నుంచి తప్పించుకున్నట్లు ఊపిరి పీల్చుకుంటుంది. భర్త చేసిన సహాయాన్ని గుర్తు చేసుకున్న జానకి ఇపుడు ఆయన భోజనం కూడా చేసి ఉండరని అనుకుంటుంది.

  Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
  మరో విషయాన్ని పసిగట్టిన మల్లిక

  మరో విషయాన్ని పసిగట్టిన మల్లిక

  ఇక జానకి బయటకు వెళుతుండగా ఒక మహిళ ఇంగ్లీష్ లెటర్ ను చదివి వినిపించాలని కోరుతుంది. అది చూసిన మల్లిక షాక్ అవుతుంది. 5వ తరగతి వరకు చదువుకున్నానని చెప్పిన జానకి ఈ రేంజ్ లో ఇంగ్లీష్ చదవడం ఏమిటని ఆశ్చర్యపోతుంది. మరి ఆ వంకతో మల్లిక జానకి గ్రాడ్యుయేట్ అనే సంగతి పసిగడుతుందో లేదో రేపటి ఎపిసోడ్ లో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 64
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X