India
  For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu June 17th: ఫైనల్స్ లో నొప్పితోనే గెలిచిన రామచంద్ర.. మల్లిక అప్సెట్!

  |

  జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు మరింత ఉత్కంఠభరితంగా మారుతోంది. రామచంద్ర ఇంటర్నేషనల్ చెఫ్ పోటీలో ప్రైజ్ మనీ గెలవాలని కూడా అనుకుంటాడు. కానీ కన్నబాబు అతనిపై రివెంజ్ తీర్చుకోవాలని ఆ పోటీలో రామాను గెలవకుండా చేయాలని అనుకుంటాడు. అలాగే రామచంద్ర అప్పు తీర్చే కంటే ముందే స్వీట్ షాప్ ను దక్కించుకునే విధంగా ప్రయత్నం చేస్తాడు. ఇక జానకి మాత్రం తన భర్తను ఆ పోటీలో గెలిపించేలా చేయాలని అనుకుంటుంది. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 6.70 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 324వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..

  చెఫ్ కాంపిటీషన్ పై ఆశలు

  చెఫ్ కాంపిటీషన్ పై ఆశలు

  నేషనల్ చెఫ్ కాంపిటీషన్లో గెలవాలి అని రామచంద్ర ఎంతగానో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే మొదట అతను అక్కడికి వెళ్ళడానికి వీలు లేదు అని అతని తల్లి జ్ఞానాంబ ఎంతగానో చెబుతుంది. చదువుకున్న వారి మధ్యలో నా కొడుకు అవమానం చెందుతాడు అనే కావాలనే నా కొడుకును బాధపెట్టాలని జానకి ఆలోచిస్తుందని అనుమానిస్తుంది. కానీ జానకి మాత్రం తన భర్త వంటల పోటీల్లో గెలిచి అందరిముందు గౌరవంగా నిలబడాలనే ఆలోచిస్తుంది. ఇక చివరికి వంటల పోటీలు వరకు తీసుకు వెళుతుంది.

  కొడుకు గెలవాలి అని..

  కొడుకు గెలవాలి అని..

  ఇక చివరికి కొడుకు గెలవాలి అనే తల్లి జ్ఞానాంబ కూడా ఎంతగానో ఆలోచిస్తుంది. రామచంద్ర కూడా వంటల పోటీల్లో గెలిచి అందులో వచ్చిన డబ్బుతో కన్నబాబు అప్పుడు కూడా తీర్చాలని అనుకుంటాడు. ఎందుకంటే కన్నబాబు రామచంద్ర స్వీట్ షాప్ ను సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మోసం చేసి సంతకాలు పెట్టించుకోనీ వారం రోజుల్లో ఒక లక్ష రూపాయలు ఇవ్వాలని ఒక కండిషన్ కూడా పెడతాడు. ఇక ఏమి తెలియని రామచంద్ర ఎలాగైనా ఈ పోటీలో 5 లక్షల రూపాయలను తెలుసుకొని అందులోనే కన్నబాబు అప్పు కూడా తీర్చాలని అనుకుంటాడు.

  మోసాన్ని బయటపెట్టిన జానకి

  మోసాన్ని బయటపెట్టిన జానకి


  ఇక ఫైనల్ గా రామచంద్ర సెమీఫైనల్లో ఒక ఊహించని చేదు అనుభవాన్ని కూడా ఎదుర్కొంటాడు. కన్నబాబు తల్లి సునంద దేవి రామచంద్రను ఓడించేలా చేసేందుకు పోటీలో ఉన్న ఒక అమ్మాయికి డబ్బు కూడా ఇస్తుంది. ఆ అమ్మాయి రామచంద్రను ఓడించేలా చేయాలి అని తన వంటలో రామచంద్ర వెనిగర్ కలిపాడు అని చెప్పడంతో మొదట రామచంద్ర అనుమానిస్తారు. కానీ జానకి తెలివితో ఆ అమ్మాయి మోసాన్ని అందరి ముందు బట్టబయలు చేస్తుంది. ఇక రామచంద్ర హ్యాపీగా ఫైనల్ వరకు వెళ్తాడు రామచంద్ర ఫైనల్ కి వెళ్లడం కన్నబాబు ఏమాత్రం తట్టుకోలేక పోతాడు.

  కన్నబాబు కన్నింగ్ ప్లాన్

  కన్నబాబు కన్నింగ్ ప్లాన్


  రామచంద్ర ఫైనల్లో గెలవకూడదు అనే కన్నబాబు అతన్ని గాయపరచాలని అనుకుంటాడు. రామచంద్ర జానకి ఒక దగ్గర కూర్చుని ఉండగా రామచంద్ర పై పూల కుండి వేస్తాడు. అయితే రామచంద్ర భుజానికి అప్పుడే తీవ్రంగా గాయం అవుతుంది. ఏ మాత్రం చేయి కధప లేని పరిస్థితుల్లో ఉంటాడు. అయితే ఫైనల్ లో కూడా అతని చేయి బాగా లేకపోవడం వలన పోటీ నుంచి తప్పుకోవాలని సలహా ఇస్తారు కానీ రామచంద్ర మాత్రం నేను తప్పకుండా ఫైనల్లో గెలిచి తీరాలి అని నొప్పి ఉన్న సరే అలాగే ఉంటాడు.

  నొప్పితోనే..

  నొప్పితోనే..

  అయితే ఎవరైనా సహాయం తీసుకోవడానికి కూడా న్యాయనిర్ణేతలు అనుమతులు ఇస్తారు. కానీ జ్ఞానాంబ రాకుండా ఆమెను గదిలో బంధించి కన్నబాబు తాళం వేసేలా చేస్తాడు. కానీ అప్పటికే రామచంద్ర వంటల పోటీలలో మొదలు పెడతాడు. తన చేయి నొప్పి ఉన్నా సరే ఏమాత్రం వెనకడుగు వేయకుండా అది నొప్పితో ఆత్రేయపురం లోనే ప్రాచుర్యం పొందిన పూతరేకుల ను తయారు చేస్తాడు. ఎవరి సహాయం లేకుండా కష్టపడి పూతరేకులు తయారు చేస్తాడు. అయితే రామచంద్ర గెలుస్తాడా గెలవడా అని అందరిలో ఒక ఉత్కంఠ నెలకొంది.

  మల్లిక అప్సెట్

  మల్లిక అప్సెట్

  మరొక వైపు రామచంద్ర ఏమాత్రం గెలవకూడదను అని అతని గెలిస్తే జానకి అత్తగారి ముందు మరింత మంచిది అవుతుందని వారి మధ్య సాన్నిహిత్యం కూడా పెరుగుతుంది అని మల్లిక ఆలోచిస్తుంది. అయితే చివరగా ఫైనల్లో మిగిలిన ముగ్గురి లో మొదట ఒక వ్యక్తిని ఎలిమినేట్ చేస్తారు ఇక ఫైనల్ విన్నర్ మరికొద్ది సేపట్లో తెలియజేస్తామని చెబుతారు. అందుకోసం అలనాటి ప్రముఖ నటి ప్రభ రమేష్ కూడా ప్రత్యేక అతిథిగా వస్తారు.

  గెలిచిన రామచంద్ర

  గెలిచిన రామచంద్ర


  ఆమె ఫైనల్ గా రామచంద్ర ఈ పోటీలో గెలిచారు అని.. అతనే విజేత అంటూ ఐదు లక్షల బహుమతి గెలుచుకున్నట్లుగా ప్రకటిస్తారు. దీంతో ఒక్కసారిగా గోవిందరాజులు ఆనందంలో మునిగి తేలుతారు. అయితే చివరగా రామచంద్ర ఈ బహుమతిని తన తల్లి చేతుల మీదుగా అందుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పడంతో జ్ఞానాంబ కూడా ఎంతో సంతోషిస్తుంది. టీవీలో వంటల పోటీని చూస్తున్న మల్లిక మాత్రం అస్సలు హ్యాపీగా ఉండదు. ఇక కన్నబాబు కూడా మరింత కోపాన్ని పెంచుకుంటాడు. ఇక రామ విషయంలో వారి తదుపరి నిర్ణయం ఎలా ఉంటుందో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Serial June 17th Episode
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X