Janaki Kalaganaledu June 18th Episode: మల్లిక కుట్ర సక్సెస్.. జ్ఞానాంబ ముందు నిజం ఒప్పుకున్న జానకి

జానకి కలగనలేదు సిరియాల్ లో రామ - జానకిల మధ్య బంధం రోజురోజుకు మరింత దగ్గరవుతోంది. ఇక మరోవైపు మల్లిక కుట్రలు పెరుగుతుంటే జ్ఞానాంబ కోపానికి కూడా హద్దులు లేకుండా పోతున్నాయి. అత్త కోడళ్ల మధ్య కెమిస్ట్రీతో మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు. జానకి - రామచంద్ర క్యూట్, రొమాంటిక్ సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అందమైన ప్రేమ మధ్యలో రామచంద్ర అమాయకత్వ ప్రేమ, జానకి ఆశయం, అత్త జ్ఞానాంబ కట్టుబాట్లు ఆప్యాయత.. ఈ సిరియల్ లో ప్రధాన అంశాలు. ఇక ఈ రోజు ప్రసారం కాబోయే 65వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

ఆ విషయాన్ని పసిగట్టిన మల్లిక

ఆ విషయాన్ని పసిగట్టిన మల్లిక

మల్లిక తను చేసిన కుట్ర ఎలా ఫెయిల్ అయ్యిందా అని షాక్ అవుతూ బెడ్ రూమ్ లో ఏడుస్తూ ఉంటుంది. ఇక ఏమి తెలియని ఆమె భర్త ఎందుకు ఏడుస్తున్నావ్ అని అమ్మ గురించి నీకు తెలిసిందేగా అంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. ఇక ఇంతలో మల్లిక కోసం జానకి అన్నం ఫ్లేటుతో వచ్చి తినమని చెబుతుంది. ఆ కూర తిన్న మల్లిక ఎవరో మార్చేసినట్లు పసిగడుతుంది.

రామ కోసం మొదటిసారి

రామ కోసం మొదటిసారి

ఇక భర్త రామచంద్ర కోసం షాప్ కు క్యారెజ్ తీసుకువెళ్లిన జానకి కృతజ్ఞతలు చెబుతుంది. ఇక జానకి కొట్టుకు మొదటి రావడంతో అక్కడే ప్రత్యేకంగా పూజ చేయిస్తారు. అనంతరం రామకు భోజనం పెట్టిన జానకి కాస్త కంగారు పడుతున్నట్లు ఉంది. మరోసారి అత్తయ్య కాకరకాయ వేపుడు చేయమని చెప్పింది అనగానే నేను నేర్పిస్తానని రామ మళ్ళీ ధైర్యం చెబుతాడు.

మరోసారి భరోసా ఇచ్చిన భర్త

మరోసారి భరోసా ఇచ్చిన భర్త

ఇక భర్త మాటలకు జానకి సంతోషిస్తుంది. మొదటిసారి భర్త ప్రేమకు ఆమె మరింత దగ్గరవుతుంది. అన్ని విధాలుగా సహాయం ఉండడం తన అదృష్టమని అనుకుంటుంది. రామ కూడా తనకు కాకరకాయ వేపుడు వచ్చని అలాగే అన్ని వంటలు నేర్పిస్తానని జనాకికి భరోసా ఇస్తాడు.

ఇంగ్లీష్ చదివిన జానకి

ఇంగ్లీష్ చదివిన జానకి

ఇక ఇంటికి వచ్చిన అనంతరం జానకి కూరగాయల కోసమని బయటకు వెళుతుండగా అక్కడ ఒక మహిళ ఇంగ్లీష్ లెటర్ ను చదవమని చెబుతుంది. అది చూసిన మల్లిక షాక్ అవుతుంది. 5వ తరగతి వరకు చదువుకున్నానని చెప్పిన జానకి ఈ రేంజ్ లో ఇంగ్లీష్ చదవడం ఏమిటని ఆశ్చర్యపోతుంది.

Recommended Video

Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
నిజం ఒప్పుకున్న జానకి

నిజం ఒప్పుకున్న జానకి

జానకి ఇంగ్లీష్ చదివిన విషయాన్ని మల్లిక వెంటనే జ్ఞానాంబకు చేరవేస్తుంది. ఇక జ్ఞానాంబ కూడా ఆ విషయం గురించి అడగ్గానే వెంటనే జానకి నిజం ఒప్పుకుంటుంది. చదివాను అని చెప్పగానే మల్లిక మొహంలో సంతోషం వెలిగిపోతోంది. నిజం బయటపడిందని అనుకుంటుంది. మరి ఆ వంకతో జానకి గ్రాడ్యుయేట్ అనే సంగతి పసిగడుతుందో లేదో రేపటి ఎపిసోడ్ లో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X