Janaki Kalaganaledu June 1st: మల్లిక ప్లాన్ సక్సెస్.. మంచాన పడిన జ్ఞానాంబ.. భయంలో రామచంద్ర!

జానకి కలగనలేదు మరో కీలక మలుపు తిరగబోతోంది. ఎలాగైనా రామచంద్రను చెఫ్ కాంపిటీషన్ లో పాల్గొనేలా చేయాలని అందరూ తన భర్తను గౌరవించే స్థాయికి తీసుకు రావాలని అనుకుంటుంది. మరోవైపు రామచంద్ర కూడా జానకి ఐపీఎస్ చదువును పూర్తి చేసేందుకు సహకారం అందిస్తాడు. ఇక జానకి చదువు కోసమే రామచంద్ర కన్నబాబు దగ్గర లక్ష రూపాయలు అప్పు చేస్తాడు. ఇక అతను తన తెలివితో స్వీట్ షాప్ ను దక్కించుకునే విధంగా రామచంద్ర దగ్గర సంతకాలు కూడా పెట్టించుకుంటాడు. అనంతరం చిన్న కోడలు మల్లిక కారణంగా కూడా జానకికి సమస్యలు ఎదురవుతాయి.

ఇలా ఎన్నో ఆసక్తికరమైన అంశాలతో ఈ సీరియల్ ప్రేక్షకులలో ఆదరణను పెంచుకుంటోంది. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 6.70 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 313వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..

 దోషులుగా నిలబెట్టాలని..

దోషులుగా నిలబెట్టాలని..

జానకి, రామచంద్ర ఇద్దరు కూడా హైదరాబాద్ వంటల పోటీల్లో పాల్గొనేందుకు రెడీ అవుతుండగా మల్లిక వారిద్దరినీ అడ్డుకోవాలని ప్లాన్ చేస్తుంది. నేను నా భర్త వైజాగ్ వెళ్లడానికి ఇష్టపడితే జానకి రామ చంద్ర కారణంగా ఆ ప్లాన్ ఫెయిల్ అయింది.. అందుకే ఆ ఇద్దరినీ కూడా అత్తగారి ముందు దోషులుగా నిలబెట్టాలని అనుకుంటుంది.

వైజాగ్ పెళ్లి కి వెళుతున్నారు అని చెప్పి హైదరాబాద్ వంటలు పోటీలకు వెళుతున్నారు అని తన అత్తగారికి చెప్పినప్పటికీ కూడా ఆమె నమ్మదు కానీ ఆ తర్వాత టికెట్లు చూపించాలి అని చెప్పడంతో జానకి రామచంద్ర ఒక్కసారిగా షాక్ అవుతారు.

రివెంజ్ తీర్చుకోవాలని..

రివెంజ్ తీర్చుకోవాలని..

కానీ గోవిందరాజులు ముందుగానే మల్లిక మీద అనుమానంతో హైదరాబాద్ టికెట్ లతోపాటు వైజాగ్ టికెట్లను కూడా ముందే తీసుకొని వస్తాడు. జ్ఞానాంబకు వైజాగ్ టికెట్లు చూపించడంతో ఆమె కూల్ అవుతుంది. కానీ మల్లిక మాత్రం వారి పై మరింత రివెంజ్ పెంచుకుంటుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ జానకి రామచంద్ర ఇద్దరు కూడా హైదరాబాద్ వెళ్లడానికి వీలు లేదు అని వారిని ఎలాగైనా ఆపాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అందుకోసం ఒక సీరియల్ చూసిన ఆమె అందులోనే ఒక సన్నివేశం ఆధారంగా తన అత్తపై ఒక ప్రయోగం చేయాలని అనుకుంటుంది.

మల్లిక టాబ్లెట్ ప్లాన్

మల్లిక టాబ్లెట్ ప్లాన్

జ్ఞానాంబ రోజూ వేసుకునే బలం మాత్రలు కాకుండా గదిలో బిపి టాబ్లెట్స్ పెట్టిన మల్లిక ఆమెను అనారోగ్యానికి గురి చేయాలని అనుకుంటుంది. ఆ టాబ్లెట్ వేసుకుంటే అత్తగారు లేవకుండా మంచాన పడతారు అని అప్పుడు జానకి రామచంద్ర ఇద్దరూ కూడా హైదరాబాద్ వెళ్లకుండా ఆగిపోతారు అని మల్లిక ప్లాన్ చేస్తుంది. ఇక అనుకున్నట్టుగానే జ్ఞానాంబ టాబ్లెట్స్ వేసుకుంటుంది. ఇక అదే సమయంలో జానకి రామ చంద్ర ఇద్దరు కూడా హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధమవుతారు.

స్పృహ కోల్పోయిన జ్ఞానాంబ

స్పృహ కోల్పోయిన జ్ఞానాంబ

రామ లగేజ్ తీసుకుని వెళ్లడానికి సిద్ధమవుతున్న సమయంలో జ్ఞానాంబ ఒక్కసారిగా స్పృహ కోల్పోతుంది. వెంటనే ఆమెను గదిలోకి తీసుకు వెళ్లి పడుకోబెడతారు. రామ విష్ణు అమ్మకు ఏమైందో అని కంగారు పడుతుంటారు. అసలు ఎలా జరిగింది అని జానకి పరిశోధించే ప్రయత్నం చేస్తోంది. రోజులాగే బలం టాబ్లెట్లు వేసుకున్నాను అని జ్ఞానాంబ చెబుతుంది. ఇక జానకి టాబ్లెట్స్ ని చూడగా.. అవి బలం టాబ్లెట్స్ కాదు అని బిపి టాబ్లెట్స్ అని గమనిస్తుంది.

జానకి చేసిన పనిపై ప్రశంసలు

జానకి చేసిన పనిపై ప్రశంసలు

ఇక వెంటనే తన తెలివితో జానకి ప్రథమ చికిత్స చేయడానికి సిద్ధమవుతుంది. డాక్టర్ కి ఫోన్ చేసి అంతకంటే ముందే ఉప్పు నీళ్ళు తెచ్చి తన అత్తగారికి తాగమని చెబుతుంది. ఇక అదే సమయంలో వంటల పోటీలకు రేపు ఉదయం 9 గంటల లోపు ఉండాలి అని మీరు ముందుగానే హైదరాబాద్ చేరుకుంటే బాగుంటుంది అని లూసి ఫోన్ చేసి చెబుతూ ఉంటుంది.

అయితే జానకి తన అత్తగారి పరిస్థితి గురించి చెప్పి తప్పకుండా మేము వీలైనంత తొందరగా రావడానికి ప్రయత్నం చేస్తామని అంటుంది. ఇక జ్ఞానాంబ ఉప్పు నీళ్లు తాగగానే కొంత స్పృహలోకి వచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇక ఆ తర్వాత లేడీ డాక్టర్ వచ్చి ఏం జరిగింది అని అనగానే జానకి జరిగిన విషయం గురించి చెబుతుంది. ముందుగా ప్రథమ చికిత్స చేసి చాలా మంచి పని చేశారు అని డాక్టర్ జానకి పై ప్రశంసలు కురిపిస్తుంది.

రామ నిజం చెబుతాడా?

రామ నిజం చెబుతాడా?

అయితే ఈ క్రమంలో మల్లిక కూడా అందరి ముందు మార్కులు కొట్టేయడానికి అత్త గారు మీరు లేవాలి అని దొంగ ఏడుపు ఏడుస్తుంది. కాళ్ల దగ్గర సేవలు చేస్తూ నన్ను చూడండి అని అంటుంది. ఇక డాక్టర్ వెంటనే అందరూ సైలెంట్ గా ఉండాలి అని బయటకు వెళ్లిపోవాలని కూడా ఆదేశిస్తుంది.

ఇక ఆ తర్వాత జానకి రామ చంద్ర ఇద్దరు కూడా ఆందోళనలో ఉంటారు. ఇక ఆ తర్వాత రామచంద్ర తన తల్లి పరిస్థితి చూసి తీవ్ర మనోవేదనకు గురి అవుతాడు. అంతేకాకుండా తల్లి ముందు అబద్ధాలు చెబుతున్నాను అని ఎంతగానో బాధపడతాడు.

ఇక జరిగిన విషయం గురించి కూడా తల్లితో చెప్పాలి అని అనుకుంటాడు. ఇక మరొకవైపు జానకి మాత్రం తన భర్తను వంటల పోటీలలో పాల్గొనేలా చేయాలని అనుకుంటోంది. మరి రామచంద్ర నిజంగానే తన తల్లికి నిజం చెబుతాడా? అసలు రామ వంటల పోటీలలో పాల్గొంటాడా అనే విషయం తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X