Janaki Kalaganaledu June 1st Episode: జ్ఞానాంబ నుంచి తృటిలో తప్పించుకున్న జానకి.. 'టీ' తెచ్చిన తంటా!

జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు మరింత ఆసక్తిగా మారుతోంది. సీరియల్ స్టారి కూడా జనాలకు తొందరగానే ఎక్కేసింది. ప్రతి ఎపిసోడ్ కూడా అంచనాల డోస్ ను పెంచేస్తోంది. ఇక మంగళవారం జానకికి సంబంధించిన సీన్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. గత వారం కంటే ఈ వారం మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. శివగామి రేంజ్ లో రాశి పాత్ర హైలెట్ అవుతోంది. అందమైన ప్రేమ మధ్యలో భార్య జానకి ఆశయం, భర్త రామచంద్ర అమాయకత్వ ప్రేమ, అత్త జ్ఞానాంబ కట్టుబాట్లు ఆప్యాయత.. ఈ సిరియల్ లో ప్రధాన అంశాలు. ఇక ఈ రోజు ప్రసారం కాబోయే 51వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

అర్థం చేసుకున్న రామచంద్ర

అర్థం చేసుకున్న రామచంద్ర

సోమవారం ఎపిసోడ్ లో జానకి, రామచంద్రల శోభనం క్యాన్సిల్ అయిన విషయం తెలిసిందే. ఎంతో ఆతృతగా ఉన్న రామచంద్ర ఆశలపై జానకి నీళ్లు చల్లుతుంది. జానకి కార్యానికి సిద్ధంగా ఉండదు. ఆ విషయాన్ని చెప్పాలని మనసులో అనుకుంటూ ఉంటుంది. జానకి ఇబ్బంది పడుతున్న విషయాన్ని గమనించిన రామచంద్ర అర్థం చేసుకునే కింద పడుకుంటాడు.

మామగారు కాఫీ తేవాలని చెప్పడంతో

మామగారు కాఫీ తేవాలని చెప్పడంతో

ఇక మొత్తానికి బల్లి కారణంగా జానకి చివరికి రామచంద్ర పక్కనే పడుకుంటుంది. ఇక తెల్లవారుజామున లేచి తులసి కోట చుట్టూ తిరుగుతూ ఇంట్లో వారిని ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తుంది. అనంతరం మామగారు కాఫీ తేవాలని ఆర్డర్ వేయడంతో కాఫీ ఎలా చేయాలో తెలియని జానకి కంగారుపడుతూ రెడీ చేస్తుంది. మల్లిక చేయడానికి రెడీ అయినప్పటికీ జ్ఞానాంబ వద్దని ఆర్డర్ వేస్తుంది

జ్ఞానాంబ ఎలాగైనా జానకిని తిట్టాలని..

జ్ఞానాంబ ఎలాగైనా జానకిని తిట్టాలని..

ఇక కనీసం కాఫీలో ఏది ఎంత వేయాలో తెలియని జానకి ఒకేసారి టీ పొడి కుమ్మరించేస్తుంది. అనంతరం ఆ కాఫీని అందరికి ఇస్తుంది. ఇక ఒక్కొక్కరు తాగడం స్టార్ట్ చేస్తారు. మల్లికకు విషయం అర్థమైపోతుంది. జ్ఞానాంబ ఎలాగైనా జానకిని తిట్టాలని అనుకుంటుంది.

భార్యను కాపాడేందుకు..

భార్యను కాపాడేందుకు..

అందరి మోహల్లో హావభావాలు చూసిన జానకి కంగారుపడుతుంది. టీ చాలా దారుణంగా ఉన్నట్లు రామచంద్రకు అర్థమయ్యి జ్ఞానాంబ తాగకూడదని ప్లాన్ వేస్తాడు. జ్ఞానాంబ తాగే సమయంలో సడన్ గా రామచంద్ర కడుపు నొప్పి అని చెబుతాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. అయితే కాంగరు పడాల్సిన అవసరం లేదని చెప్పిన రామచంద్ర జానకిని కాపాడేందుకు జ్ఞానాంబను బయటి పని మీద పంపించేస్తాడు. మల్లిక ఆ టీ తాగాలని అత్తను ఆపేందుకు ప్రయత్నం చేసినప్పటికీ వర్కౌట్ కాదు.

పగతో సునందదేవి భారీ స్కెచ్

పగతో సునందదేవి భారీ స్కెచ్

ఇక మరోవైపు జానకి స్నేహితురాలిని తోటకు పిలిపించి కౌన్సిలర్ సునంద దేవి భారీ స్కెచ్ వేయడానికి సిద్ధమవుతుంది. కన్నబాబు చెంప పగలగొట్టిన పగను దృష్టిలో ఉంచుకొని స్నేహితురాలి ద్వారా జానకిని తోటలోకి తీసుకురావాలని బెదిరిస్తారు. మరి ఆమె జనాకిని తోటకు రప్పిస్తుందో లేదో రేపు చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X