Janaki Kalaganaledu June 20th: కన్నబాబుకు గెలిచి చూపించిన రామచంద్ర.. జ్ఞానాంబ ఫుల్ హ్యాపీ!

జానకి కలగనలేదు సీరియల్ మరో ఆసక్తికరమైన అంశంతో ప్రేక్షకులకు మరింత దగ్గరవుతోంది. ఇంటర్నేషనల్ చెఫ్ పోటీలో ప్రైజ్ మనీ గెలవాలని రామచంద్ర ఎంతగానో హార్డ్ వర్క్ చేస్తాడు. అయితే అతని శత్రువు కన్నబాబు మాత్రం రివెంజ్ తీర్చుకోవాలని ఆ పోటీలో రామాను గెలవకుండా చేయాలని అనుకుంటాడు. ఇక రామచంద్ర అప్పు తీర్చే కంటే ముందే స్వీట్ షాప్ ను దక్కించుకునే విధంగా ప్రయత్నం చేస్తాడు. ఇక జానకి మాత్రం తన భర్తను ఆ పోటీలో ఎలాగైనా గెలిపించేలా చేయాలని అనుకుంటుంది. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 6.70 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 325వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..

తల్లిని ఒప్పించి..

తల్లిని ఒప్పించి..

చెఫ్ కాంపిటీషన్లో ఎలాగైనా గెలవాలని రామచంద్రం ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మొదట అతని కాంపిటీషన్ కు వెళ్ళ నివ్వకూడదు అని ఆర్డర్ వేసిన జ్ఞానాంబ కూడా కొడుకు తాపత్రయం చూసి వెళ్లడానికి ఒప్పుకుంటుంది. ఎలాగైనా తన భర్తను గెలిపిస్తాను అని అత్త కూడా జానకి మాట ఇస్తుంది. రామచంద్ర గెలవక పోతే నేను ఇంటి నుంచి వెళ్ళిపోతాను అని కూడా జానకి చాలెంజ్ చేస్తుంది. అంతేకాకుండా రామచంద్ర కూడా తన తల్లిని ఎంతగానో ప్రాధేయపడి ఒప్పిస్తాడు.

 ఫైనల్ లో రామ

ఫైనల్ లో రామ

ఇక మొత్తానికి అనుకున్నట్లే రామచంద్ర ఫైనల్ పోటీలో వరకు వెళతాడు. మొదట అతని అడ్డుకునేందుకు కన్నబాబు కొన్ని కుట్రలు పన్నుతాడు. అలాగే అతని తల్లి సునంద దేవి కూడా పోటీలో పాల్గొన్న మరో అమ్మాయికి డబ్బులు ఇచ్చి రామాను ఓడించాలని అనుకుంటుంది. అయితే ఆమె మోసం జానకి అప్పుడే పసిగడుతుంది. జానకి తెలివి కారణంగా రామచంద్ర సునాయాసంగా ఫైనల్ పోటీలకు వెళ్ళిపోతాడు. అయితే అప్పుడు కూడా అతను అడ్డుకోవడానికి కన్నబాబు దారుణమైన ఐడియా ఫాలో అవుతాడు.

గెలవకుండా చేయాలని..

గెలవకుండా చేయాలని..


కన్నబాబు చేయి పనిచేయకుండా చేయాలి అని కన్నబాబు అతను ఒకచోట కూర్చున్నప్పుడు ఒక పూల కుండి అతనిపై పడేలా చేస్తాడు. ఇక దెబ్బతో రామచంద్ర చెయ్యి పని చేయలేని పరిస్థితుల్లో ఉంటుంది. డాక్టర్లు రెండు రోజుల వరకు చేయి కధపకూడదు అని కూడా చెబుతారు. అయినప్పటికీ రామచంద్ర ఫైనల్ పోటీల్లో పాల్గొని తీరాలని ఎలాగైనా గెలిచి అమ్మ ముందు నిలబడాలని అనుకుంటాడు. రామచంద్ర అనుకున్నట్లుగానే ఫైనల్ పోటీలకు సిద్ధమవుతాడు. ఇక అప్పుడు కూడా అతను గెలవకుండా ఉండాలి అనేక ప్రయత్నాలు చేస్తాడు.

ప్రైజ్ మనీ గెలిచిన రామ

ప్రైజ్ మనీ గెలిచిన రామ

ఇక ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా రామచంద్రరావు వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా నొప్పి తోనే ఫైనల్ పోటీలో పాల్గొంటాడు. ఎవరైనా సహాయం కూడా తీసుకోవచ్చు అని అక్కడ న్యాయనిర్ణేతలు చెప్పినప్పటికీ ఎవరి సహాయం లేకుండానే రామచంద్ర ఫైనల్ పోటీల్లో గెలుస్తాడు. రామచంద్ర గెలవడంతో అతనికి ఐదు లక్షల రూపాయల ప్రైజ్ మనీ కూడా దక్కుతుంది. అంతేకాకుండా ఒక ప్రత్యేకమైన కప్ కూడా ఇవ్వడం తో అందరూ ఎంతగానో సంతోషిస్తారు. అయితే ఆ బహుమతిని మా అమ్మ చేతుల మీదుగా అందుకోవాలని ఉంది అని రామచంద్ర కోరడంతో నిర్వాహకులు కూడా అందుకు ఒప్పుకుంటారు.

 మల్లిక కోపం

మల్లిక కోపం

ఇక కొడుకు గెలుపును చూసి జ్ఞానాంబ కూడా ఎంతగానో సంతోషిస్తుంది. తన చేతుల మీదుగా కొడుకు ఆ బహుమతిని అందజేస్తుంది. అయితే మరొకవైపు రామచంద్ర గెలిచాడు అని అతని తమ్ముడు అలాగే ఊరి ప్రజలు కూడా ఘనంగా స్వాగతం పలుకుతారు. ఇంటి వరకు కూడా ప్రత్యేకంగా డాన్స్ చేసుకుంటూ వస్తారు. అయితే అందరూ ఆనందంగా ఉన్న సమయంలో మల్లిక మాత్రం చాలా కోపం గానే ఉంటుంది. బావగారు గెలిస్తే మళ్ళీ జానకి అత్తగారి మధ్యలో సాన్నిహిత్యం మరింత పెరుగుతుంది అని ఆమె అసూయ చెందుతూ ఉంటుంది. మరోవైపు గోవింద రాజులు కూడా రామచంద్ర గెలవడానికి ముఖ్య కారణం మన కోడలు జానకి అని తన భార్య జ్ఞానాంబ ముందు చెబుతాడు. తను అనుకున్నట్లుగానే భర్తను గెలిపించుకుంది అని. ఈ ఆనందం కూడా మనకు రావడానికి ముఖ్య కారణం తనే అని కూడా సంతోషంగా చెబుతాడు.

కన్నబాబుకు డబ్బు ఇచ్చిన రామచంద్ర

కన్నబాబుకు డబ్బు ఇచ్చిన రామచంద్ర


ఇక జానకి ని చూస్తు జ్ఞానాంబ కూడా చాలా రోజుల తర్వాత ఎంతగానో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక గెలిచిన డబ్బును రామచంద్ర తన తల్లికి ఇస్తూ ఉండగా ఇంట్లో వాళ్ళు అందరూ కూడా ఆ డబ్బు తమకు కొంత ఇవ్వాలి అని అంటారు. కానీ జ్ఞానాంబ మాత్రం ఎవరికీ ఇవ్వకుండా ఇది రామచంద్ర గెలిచిన డబ్బు అని అతని సంతోషం కోసం వాడుకోవాలి అనే చెబుతుంది. ఇక అనుకున్నట్లే కన్నబాబు కు ఇవ్వాల్సిన డబ్బులు కూడా రామచంద్రరావు ఇచ్చేస్తాడు. ఇక డబ్బు ఇచ్చే క్రమంలో జానకి కూడా వెళ్తుంది. మీరు ఎన్ని కుట్రలు చేసినా కూడా చివరికి నా భర్త గెలిచాడు. మోసం చేసి స్వీట్ షాప్ దక్కించుకోవాలని అనుకున్నారు మీ డబ్బు తీసుకొని అందుకు సంబంధించిన కాగితాలు ఇవ్వాలి అని జానకి హెచ్చరిక చేస్తుంది. మరి కన్నబాబు సునంద దేవి భవిష్యత్తులో రామచంద్ర పై ఇంకా ఎలాంటి ప్లాన్ వేస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X