Janaki Kalaganaledu june 21 Episode: జానకి గుట్టు బయటపెట్టిన మల్లిక.. చివాట్లు పెట్టిన జ్ఞానాంబ

బుల్లితెరపైన ఇటీవలే ప్రారంభమైన జానకి కలగనలేదు సీరియల్‌ అప్పుడే ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకొనేందుకు ప్రయత్నిస్తున్నది. అత్త జ్ఞానాంబ సీరియస్ నెస్.. కోడళ్లు మల్లిక చలాకీతనం జానకి అమాయకత్వంతో కూడిన సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. తాజా ఎపిసోడ్‌లో జానకి ఉన్నత విద్యావంతురాలు అనే విషయాన్ని ప్రూవ్ చేయడానికి మల్లిక తెగ అగచాట్లు పడింది. అయితే తాజా ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

మల్లిక మరోసారి కుట్రతో

మల్లిక మరోసారి కుట్రతో

వీధి చివర వెంకయమ్మకు వచ్చిన ఇంగ్లీష్ లెటర్‌ను చాలా ప్రొఫెషనల్‌గా చదవడం చూసిన మల్లిక ఎలాగైనా తన అత్తకు సమాచారం చేరవేయాలనే ఉత్సాహంతో పరుగులు పెడుతూ ఆయాసంతో ప్రయత్నించింది. జానకి ఐదో తరగతి చదవలేదని.. చాలా ఉన్నతమైన చదువు చదివిందనే విషయాన్ని రుజువు చేయడానికి ప్రయత్నించిన మల్లిక.. ఆ విషయాన్ని జ్ఞానాంబ చెవిలో వేసింది.

జ్ఞానాంబకు చాడీలు చెప్పడానికి

జ్ఞానాంబకు చాడీలు చెప్పడానికి

అత్తమ మీరు అనుకొంటున్నట్టు జానకి ఐదో తరగతి చదవలేదు. అంతకంటే ఎక్కువగానే చదివిందంటూ చాడీలు చెప్పడానికి ప్రయత్నించింది. నీకు ఎలా తెలుసు అంటూ జ్ఞానాంబ అడగడంతో వీధి చివరి వెంకయమ్మకు వచ్చిన లెటర్‌ను జానకి చదివిన విషయాన్ని చెప్పేసింది. దాంతో తన చిన్న కుమారుడిని పిలిచి వెంకయమ్మను పిలుచుకురమ్మని జ్ఞానాంబ పంపించింది. అంతలోనే జానకి బయటి నుంచి ఇంట్లోకి వచ్చింది.

జానకిని నిలదీసిన జ్ఞానాంబ

జానకిని నిలదీసిన జ్ఞానాంబ

ఇంట్లోకి వెళ్తున్న జానకి ఆగు అంటూ జ్ఞానాంబ గద్దించింది. దాంతో మల్లిక ఇక జానకి ఇంటి నుంచి వెళ్లిపోవడం ఖాయం అనుకొంటూ సంతోషంలో మునిగిపోయింది. వీధి చివర వెంకయమ్మకు వచ్చిన లెటర్ చదివావా అని జ్ఞానాంబ గద్దించడంతో అవును అంటూ సమాధానం చెప్పింది.

అంతలోనే వెంకయమ్మ రావడం.. జానకి లెటర్‌ను చదివింది అంటూ సాక్ష్యం చెప్పింది. అంతేకాకుండా జానకి ఇంగ్లీష్‌ చదివిన తీరు గురించి చెబుతూ అలా మన ఊరిలో ఎవరూ కూడా చదువలేదు అంటూ చెప్పింది.

ఇంగ్లీష్ అంత బాగా ఎలా చదివావు

ఇంగ్లీష్ అంత బాగా ఎలా చదివావు

దాంతో జానకిని నిలదీస్తూ.. నీవు చదివింది ఐదో తరగతియేనా? లేదా ఉన్నత చదువులు చదివావా? అంటూ జ్ఞానాంబ అడిగితే.. నిజంగా నేను చదివింది ఐదో తరగతి మాత్రమే అని జానకి సమాధానం చెప్పింది. అయితే ఇంగ్లీష్ అంత బాగా ఎలా చదివావు అని జ్ఞానాంబ అడిగితే నేను ఇంగ్లీష్ మీడియంలో చదువుకొన్నానని సమాధానం చెప్పడంతో ఆమె శాంతించింది.

Recommended Video

Jagame Thandhiram Review, Dhanush's Kabali, హైప్ ఎక్కువ.. బిజినెస్ తక్కువ || Filmibeat Telugu
మల్లిక గుండెల్లో రాయి

మల్లిక గుండెల్లో రాయి

ఇక జానకి సమాధానంతో జ్ఞానాంబ సంతృప్తి చెందడంతో తన పాచికలు పారకపోవడంతో మల్లిక గుండెల్లో రాయిపడినట్టు అయిపోయింది. ఇక అత్తకు ఏం సమాధానం చెప్పాలో తెలియక తికమక పడిపోయింది. అయినా మల్లిక తన ప్రయత్నాలు మానకపోవడం కనిపించింది. జానకి విషయాన్ని ఎలాగోలా బయటపెట్టి ఇంటి నుంచి పంపించాలనే ప్రయత్నంలో ఉండిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X