For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu June 21st: కన్నబాబుకి వార్నింగ్ ఇచ్చిన జానకి.. రామచంద్రకు రొమాంటిక్ కిస్

  |

  జానకి కలగనలేదు సీరియల్ మంచి కథాంశంతో ప్రేక్షకులకు మరింత దగ్గరవుతోంది. ఇటీవల కాలంలో వచ్చిన టాప్ సీరియల్స్ తో పోటీ పడుతూ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతోంది. ఇక చెఫ్ పోటీలో ప్రైజ్ మనీ గెలవాలని రామచంద్ర ఎంతగానో కష్టపడతాడు. అయితే అతని శత్రువు కన్నబాబు మాత్రం రివెంజ్ తీర్చుకోవాలని ఆ పోటీలో రామాను గెలవకుండా చేయాలని అనుకుంటాడు. ఇక రామచంద్ర అప్పు తీర్చే కంటే ముందే స్వీట్ షాప్ ను కూడా దక్కించుకునే విధంగా ప్రయత్నం చేస్తాడు. ఇక జానకి మాత్రం తన భర్తను ఆ పోటీలో ఎలాగైనా గెలిపించేలా చేయాలని స్వీట్ షాప్ ను కాపాడాలని అనుకుంటుంది. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 6.70 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 325వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..

  రామచంద్రకు ఘనస్వాగతం

  రామచంద్రకు ఘనస్వాగతం


  మొత్తానికి రామచంద్ర అనుకున్నట్లుగానే కష్టపడే నేషనల్ చెఫ్ కాంపిటీషన్లో విజేతగా నిలిచాడు. రామ గెలవడంతో తల్లి జ్ఞానాంబతో పాటు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎంతగానో సంతోషిస్తారు. అంతేకాకుండా రామచంద్ర ఘన స్వాగతం పలుకుతారు. కొంతమంది గ్రామస్తులు జ్ఞానం కొడుకు రామచంద్ర గెలిచాడని గర్వంగా చెప్పుకుంటారు. రామచంద్ర ఊర్లోకి లోకి రాగానే వాయిద్య మేళాలతో డాన్స్ చేస్తూ అతని కి వెల్కమ్ చెబుతారు. అయితే రామచంద్ర ఫ్యామిలీ గెలిచిన ఆనందంలో ఉండగా తోడికోడలు మల్లిక మాత్రం జానకి పై తీవ్ర ఆగ్రహంతోనే ఉంటుంది.

  మల్లికకు చేదు అనుభవం

  మల్లికకు చేదు అనుభవం

  జ్ఞానాంబ, జానకి మధ్య లో చిచ్చు పెట్టాలని వారి మధ్య దూరం కూడా పెంచాలని ఎంత ఆలోచించినా మల్లికకు ఊహించని చేదు అనుభవం ఏర్పడుతుంది. రామచంద్ర గెలిచిన సంతోషం ఆమెకు ఏమాత్రం ఉండదు. అయితే జానకి మాత్రం భర్త గెలిచిన కారణంగా ఎంతగానో ఆనంద పడుతుంది. జ్ఞానాంబ కూడా మొదటిసారి జానకి పై చాలా సంతోషం వ్యక్తం చేస్తుంది. గోవిందరాజులు కూడా ఈ గెలుపు మొత్తం జానకి వల్లే అంటూ తన భర్తను పోటీపడి గెలిపించుకుందని తన భార్య జ్ఞానాంబకు తెలియజేస్తాడు.

  ఐదు లక్షల ప్రైజ్ మనీ

  ఐదు లక్షల ప్రైజ్ మనీ


  ఇక రామచంద్ర గెలిచిన ఐదు లక్షల ప్రైజ్ మనీని మొదట తన తల్లికి అందజేస్తాడు. ఇంట్లో వాళ్ళు కూడా ఆ ప్రైజ్ మనీ లో కొంత భాగాన్ని అడుగుతారు. అయితే జ్ఞానాంబ మాత్రం ఇది రామచంద్ర గెలిచిన డబ్బు అని దీనిమీద ఎవరికీ అధికారం లేదు అని అతనికి మాత్రమే ఖర్చు పెట్టే హక్కు ఉందని పాజిటివ్ గా స్పందిస్తుంది. ఇక రామచంద్ర కన్నబాబు కు ఇవ్వాల్సిన లక్ష రూపాయల డబ్బును అతనికి వడ్డీతో సహా ఇవ్వడానికి ఇంటికి వెళతాడు.

  కన్నబాబుకు వార్నింగ్

  కన్నబాబుకు వార్నింగ్

  ఇంతకుముందు కన్నబాబు మోసం చేసి సంతకాలు పెట్టించుకొని.. లక్ష రూపాయలకు రామచంద్ర ఇవ్వకపోతే అతని స్వీట్ షాప్ ను కూడా దక్కించుకోవాలని అనుకుంటాడు. ఇక అతను మోసం చేయకు ముందే రామచంద్ర డబ్బును జానకితో కలిసి ఇవ్వడానికి వెళ్తాడు. అయితే ఈ క్రమంలో రామచంద్రను గెలవకుండా చేయాలని వారు చేసిన కుట్రలపై కూడా జానకి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది మరొకసారి తన భర్త జోలికి వస్తే మామూలుగా ఉండదు అని వార్నింగ్ ఇస్తుంది. నా భర్త చదువుకోలేదని మోసం చేసి స్వీట్స్ దక్కించుకోవాలని అనుకున్నారు. కానీ నా భర్తకు నేను ఉన్నాను మోసం చేయాలని అపాయం తలపెట్టాలని అనుకున్నా ముందు నన్ను దాటి రావాలి. అది నీ వల్ల కాదు ఇక నుంచి అయినా జాగ్రత్తగా ఉండండి అంటూ జానకి తీవ్రస్థాయిలో వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

   రామచంద్ర కృతజ్ఞత

  రామచంద్ర కృతజ్ఞత

  అంతేకాకుండా మీ అమ్మ రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తానని కూడా కన్నబాబుకి హెచ్చరిక చేస్తుంది. ఇక ఆ మాటలకు కన్నబాబు అతని తల్లి కూడా ఏమీ అనలేని పరిస్థితుల్లో ఉంటారు. ఆ తర్వాత జానకి తన భర్త చేయి పట్టుకొని తీసుకువెళుతుంది. ఈ క్రమంలో రామచంద్ర జానకి పై ప్రేమను పెంచుకుంటాడు. మీరు లేకపోయి ఉంటే నేను గెలిచే వాడిని కాదు అని మీ కారణంగానే ఈ పోటీల్లో గెలిచిన కాబట్టి మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదు అని అంటాడు. అయితే జానకి మాత్రం కేవలం మీ ప్రతిభ కారణంగానే ఈ పోటీల్లో గెలిచారని నేను చేసింది ఏమీ లేదు అని అంటుంది. అయినప్పటికీ రామచంద్ర నేను మధ్యలో వెళ్ళిపోదాం అన్నప్పుడు మీరే దగ్గరుండి నన్ను ఉత్తేజపరచకపోయి ఉంటే ఈరోజు గెలిచే వాన్ని కాదు అని చెపుతాడు.

  రామచంద్రకు జానకి కిస్

  రామచంద్రకు జానకి కిస్

  అయితే జానకి కూడా మీరు నా కోసం చాలా చేశారు. నేను ఎన్నో ఆశలు పెట్టుకున్న ఐపిఎస్ చదువును నన్ను స్వేచ్ఛగా చదువుకునేలా చేస్తున్నారు. అంతేకాకుండా ఆ చదువు గురించి ఇంట్లో నిజం తెలిస్తే ఏం జరుగుతుందో మీ పై ఎలాంటి ప్రభావం చూపుతుందో నీకు తెలుసు. అయినా కూడా నా చదువు కోసం ఎంతగానో సహాయం చేశారు అందుకు నేను ఎన్ని సార్లు కృతజ్ఞతలు చెప్పినా సరిపోదు అని జానకి చెబుతుంది. అనంతరం రామ నుదిటిపై జానకి ముద్దు పెట్టగా.. రామచంద్ర కూడా అంతే ప్రేమగా జానకికి ముద్దు పెడతాడు.

   ఇంటర్వ్యూ వలన జ్ఞానాంబ టెన్షన్

  ఇంటర్వ్యూ వలన జ్ఞానాంబ టెన్షన్

  ఇక రామచంద్ర వంటల పోటీల్లో గెలిచిన కారణంగా అతన్ని ఇంటర్వ్యూ చేసేందుకు ఒక న్యూస్ ఛానల్ వారు ఆత్రేయపురానికి వస్తుంది. ఇక దారి మధ్యలో రామచంద్ర ఇల్లు ఎక్కడ అని అడుగగా అటువైపుగా వెళ్తున్న లీలావతి వాళ్ళ ఇంటికి తీసుకు వెళుతుంది. ఇక న్యూస్ ఛానల్ ఇంటికి వచ్చినప్పుడు ఇంటర్వ్యూ వద్దని జ్ఞానాంబ అంటుంది. ఎందుకంటే రామచంద్ర ఇంటర్వ్యూలో ఎప్పుడు మాట్లాడింది లేదని ఏదైనా తప్పుగా మాట్లాడితే అందరు నవ్వుకుంటారని ఉంటుంది. కానీ మళ్ళీ జానకి అలా ఏమీ జరగదు అని అత్తను ఒప్పిస్తుంది. అలాగే జ్ఞానాంబ కూడా న్యూస్ ఛానల్ ముందు మాట్లాడేందుకు కాస్త భయపడుతూ ఉండటంతో ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు జానకి ధైర్యం చెబుతుంది. మరి ఈ క్రమంలో రామచంద్ర ఏవిధంగా మాట్లాడతాడో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Serial June 21st Episode
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X