Janaki Kalaganaledu June 22 Episode: జానకితో అర్ధరాత్రి రామ సీక్రెట్ ప్లాన్.. మల్లెపూలు విసిరిన మల్లిక!

జానకి కలగనలేదు సిరియాల్ సరికొత్త మలుపులతో ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. రామ - జానకిల మధ్య బంధం ఫ్యామిలీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. మరోవైపు మల్లిక కుట్రలు పెరుగుతుంటే జ్ఞానాంబ కోపానికి కూడా హద్దులు లేకుండా పోతున్నాయి. జానకి - రామచంద్ర క్యూట్ లవ్ స్టొరీ సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అందమైన ప్రేమ మధ్యలో రామచంద్ర అమాయకత్వ ప్రేమ, జానకి ఆశయం, అత్త జ్ఞానాంబ కట్టుబాట్లు.. ఈ సిరియల్ లో ప్రధాన అంశాలు. ఇక ఈ రోజు ప్రసారం కాబోయే 67వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

జ్ఞానాంబ అనుమానం

జ్ఞానాంబ అనుమానం

చిన్న తమ్ముడు అబద్ధం చెప్పి రామచంద్ర దగ్గర నాలుగు వేల రూపాయలు తీసుకోవడంపై జ్ఞానాంబ అనుమానం వ్యక్తం చేస్తుంది. నీ పేరు మీద చిన్నపిల్లలకు పుస్తకాలు కొనిస్తాడాని అన్నందుకు ఇచ్చానని రామ చెప్పినప్పటికీ జ్ఞానాంబ నమ్మదు. నిజానిజాలు తెలుసుకోకుండా అలా చేయకూడదని వివరణ ఇస్తుంది.

 జానకిని అలా చూసిన రామ

జానకిని అలా చూసిన రామ

ఇక బెడ్ రూమ్ లోకి వెళ్లిన రామచంద్ర.. భార్య జానకి ముద్దు ముద్దుగా షర్ట్ కు బటన్స్ కుడుతుండడం ఎంతగానో నచ్చుతుంది. మీరెందుకు ఇలాంటి పనులు చేస్తున్నారని అన్నప్పటి నా భర్త పనులు చేయడం నా బాధ్యత అంటూ జానకి ప్రేమగా మాట్లాడుతోంది. అంతే కాకుండా రామ అర్థం చేసుకునే విధానంపై జానకి ఎమోషనల్ అవుతుంది.

డబుల్ మీనింగ్ ఆలోచనలు

డబుల్ మీనింగ్ ఆలోచనలు

ఇక జానకికి వంట నేర్పించాలని రామ డిసైడ్ అవుతాడు. అసలు విషయం చెప్పకుండా సిద్దంకమ్మని జానకికి చెబుతాడు. అందుకు జానకి ఆశ్చర్యపోయి ఎందుకు అంటూ కాస్త డబుల్ మీనింగ్ తో ఆలోచిస్తుంది. చివరికి వంట విషయం చెప్పడంతో ముసిముసిగా సిగ్గుపడుతుంది.

 పసిగట్టిన మల్లిక

పసిగట్టిన మల్లిక

ఇక ఇద్దరు పెరట్లో వంట చేసుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇంతలో ఆకలి వల్ల రూమ్ నుంచి బయటకు వచ్చిన మల్లిక.. జానకి, రామ బెడ్ రూమ్ లో ఉండకపోవడంతో అనుమానం వ్యక్తం చేస్తుంది. ఏదో జరుగుతోందని బయటకు వెళ్లి చూస్తుంది. అసలు విషయం అప్పుడు అర్ధమవుతుంది. ఎలాగైనా ఆ విషయాన్ని అత్త జ్ఞానాంబ కంట పడేలా చేయాలని ఆలోచిస్తుంది.

Recommended Video

Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
జ్ఞానాంబపై మల్లెపూలు

జ్ఞానాంబపై మల్లెపూలు

సడన్ గా నిద్ర లేపితే తిట్టడం కాయమని అనుకున్న మల్లిక వెంటనే కిటికీ దగ్గరకు వెళ్లి జ్ఞానాంబ నిద్ర లేవాలని నెత్తిపై ఉన్న మల్లెపూలను విసురుతుంది. దాంతో నిద్ర లేచిన జ్ఞానాంబ బయట ఎవరో ఉన్నారని బయటకు వస్తుంది. మరోవైపు జానకి రామ వంట చేయడంలో బిజీగా ఉంటారు. ఇక జ్ఞానాంబ వాళ్ళను పసిగట్టిందో లేదో తెలియాలి అంటే రేపటి ఎపిసోడ్ లో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X