For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu June 22nd: వెన్నల్లో రామ, జానకి రొమాంటిక్ లవ్.. మరింత పగతో మల్లిక!

  |

  జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. రీసెంట్ గా వచ్చిన టాప్ సీరియల్స్ తో పోటీ పడుతూ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతోంది. భార్య కోసం భర్త కష్టపడడం, భర్త గౌరవం కోసం భార్య తాపాత్రయపడే సన్నివేశాలు హైలెట్ గా ఉన్నాయి. రామచంద్ర చెఫ్ పోటీలో ప్రైజ్ మనీ గెలిచి తన అప్పుల నుంచి బయటాడదడమే కాకుండా.. అతని శత్రువు కన్నబాబు నుంచి స్వీట్ షాప్ ను దక్కించుకుంటాడు.. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 6.70 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 325వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..

  అత్తకు ధైర్యం చెప్పిన జానకి

  అత్తకు ధైర్యం చెప్పిన జానకి

  రామచంద్ర వంటల పోటీల్లో గెలవడంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంతగానో సంతోషిస్తారు. అయితే రామచంద్ర గెలిచిన కారణంగా అతన్ని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఒక న్యూస్ ఛానల్ స్వగ్రామానికి వస్తుంది. ప్రత్యేకంగా వారిని లీలావతి, జ్ఞానాంబ ఇంటికి తీసుకు వస్తుంది ఈ తరుణంలో మల్లిక కాస్త ఆగ్రహానికి గురయినప్పటికీ కూడా ఆ తర్వాత తాను కూడా టీవీలో కనిపిస్తాను అనే సంతోషంతో అందంగా ముస్తాబై ఉంటుంది. ఇంతకుముందు ముందు ఎప్పుడూ మైక్ ల ముందు మాట్లాడలేదు. కాస్త కంగారుగా ఉంది అని జ్ఞానాంబ అంటుంది. అయితే ఈ క్రమంలో జానకి తన మాటలతో ఉత్తేజపరుస్తుంది. మీరు ఏ మాత్రం భయపడకుండా ఎప్పటిలానే హుందాగా ఉండాలి అని మిమ్మల్ని చూసి వారు ప్రశ్నలు అడిగేందుకు భయపడతారు అని కూడా జానకి చెప్పడంతో జ్ఞానాంబ కాస్త ధైర్యంగా ఉంటుంది.

  మల్లిక హడావిడి

  మల్లిక హడావిడి

  ఇక తరువాత మల్లిక కూడా తాను టీవీలో కనిపిస్తాను అనే ఆనందంలో అందంగా ముస్తాబై ఉంటుంది. ఈ క్రమంలో ఆమె భర్త విష్ణు ఆశ్చర్యపోతాడు. ఇంకా పిచ్చి ముదిరిపోతుంది అంటూ సెటైరికల్ గా జోకులు వేస్తూ ఉంటాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మల్లికా అతన్ని గట్టిగా తొక్కుతుంది. సింహం మీద జోకులు వేయకూడదు అంటూ సరదాగా కౌంటర్ కూడా ఇస్తుంది. ఆమె మాటలను ఏ మాత్రం సీరియస్ గా తీసుకోని భర్త విష్ణు అలా వదిలేస్తూ ఉంటాడు.

   గొప్పలు చెప్పుకుంటూ

  గొప్పలు చెప్పుకుంటూ

  ఇక ఆ తర్వాత జానకి కుటుంబ సభ్యులు అందరూ కూడా కెమెరా ముందు ఇంటర్వ్యూ చేయడానికి సిద్ధమవుతారు. ఇక స్టార్ట్ చేద్దామా అంటూ యాంకర్ చెప్పగా ఒక్క నిమిషం అంటూ అప్పుడే మల్లిక ఎంట్రీ ఇస్తుంది. ఒక విధంగా మా బావగారు వంటల పోటీల్లో గెలవడానికి కారణం నేనే అంటూ నేను చెప్పిన సలహాలు కారణంగానే ఆయన పోటీలో గెలిచారు అని మల్లికా గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది. దీంతో జ్ఞానాంబ సైలెంట్ గా ఉండాలి అని చెబుతుంది.

  జానకి సలహాలు

  జానకి సలహాలు


  రామచంద్ర తన తల్లి కారణంగానే వంటల పోటీల్లో గెలిచినాని చెబుతూ ఉంటాడు. అయితే రామ కాస్త కంగారు పడుతున్న సమయంలో జానకి ధైర్యం చెబుతుంది. అలాగే అత్తతో మాట్లాడుతూ.. మీరు కంగారుపడకండి మీరు ధైర్యంగా ఉంటే మీ అబ్బాయి కూడా ధైర్యంగా మాట్లాడతారు అంటూ సలహా ఇవ్వడంతో జ్ఞానాంబ సరే అంటుంది. అయితే మరొకవైపు మల్లిక మాత్రం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటుంది.

  రామచంద్ర అదృష్టం

  రామచంద్ర అదృష్టం


  ఇక ఇంటర్వ్యూ ముగిసిన తర్వాత వారిని ఇంటర్వ్యూ చేసిన యాంకర్ రామచంద్రకు ఒక మాట చెబుతుంది. నిజంగా మీ వంటల పోటీల విజయానికి మీ అమ్మగారు ప్రధాన కారణం అయి ఉండవచ్చు. అయితే మీకు జానకి లాంటి భార్య దొరకడం కూడా చాలా అదృష్టం అని ఆమె మీ వెంట ఉంటే భవిష్యత్తులో ఇంకా ఎన్నో విజయాలు అందుకుంటారు అని కూడా ఆమె చెబుతుంది. దీంతో రామచంద్ర చాలా సంతోషిస్తాడు.

  వెన్నల్లో రామ, జానకి రొమాంటిక్ లవ్

  వెన్నల్లో రామ, జానకి రొమాంటిక్ లవ్

  ఇక ఆ తర్వాత రామచంద్ర జానకి ఇద్దరు కూడా రాత్రి వెన్నెల్లొ కూర్చుని సరదాగా ఉంటారు. అయితే వంటల పోటీలు కారణంగా మీరు ఇన్ని రోజులు చదువుకోలేదు అని అందుకే ఈ రోజు నుంచి మళ్ళీ ఐపీఎస్ చదువును కొనసాగించాలని అంటాడు. అందుకు జానకి రేపు గుడికి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ గా మొదలు పెడతాను అని చెబుతూ.. అప్పటివరకు ఈ వెన్నెల చందమామను చూస్తూ సరదాగా ఉందామని చెబుతుంది. ఇక భార్యను తన ఒళ్ళో పెట్టుకొని రామచంద్ర ఆప్యాయంగా చూసుకుంటూ ఉంటాడు.

   జానకి విరాళం

  జానకి విరాళం

  ఇక మరుసటి రోజు గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రజలు అందరు కూడా జ్ఞానాంబ ఫ్యామిలీ గురించి గొప్పగా మాట్లాడుకుంటు ఉంటారు. అంతే కాకుండా మీకు ఇలాంటి కోడలు దొరకడం కూడా అదృష్టం అని చెబుతూ ఉంటారు. ఆ మాటలకు అసూయతో మల్లిక మరోసారి జానకి జ్ఞానాంబ మధ్యలో గొడవలు సృష్టించాలని అనుకుంటుంది. కానీ జ్ఞానాంబ ఆమె చెప్పే చాడీలను ఏమాత్రం నమ్మదు. ఇక అలాగే జ్ఞానాంబ పేరుమీద జానకి ప్రత్యేకంగా గుడిలో విరాళం ఇవ్వడంతో ఆమె స్థానం మరింత పెరుగుతుంది. మరి ఈ పరిణామాల అనంతరం గొడవలు సృష్టించేందుకు మల్లిక ఎలాంటి ఆలోచనలతో ముందుకు వెళ్తుందో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Serial June 22nd Episode
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X