For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu June 23rd: మల్లికకు మరో కౌంటర్.. జ్ఞానాంబ కుటుంబాన్ని కాపాడిన జానకి!

  |

  జానకి కలగనలేదు సీరియల్ మరో ఆసక్తికరమైన అంశంతో ప్రేక్షకుల సంఖ్యను పెంచుకుంటోంది. ఇటీవల కాలంలో వచ్చిన టాప్ సీరియల్స్ తో పోటీ పడుతూ జానకి కలగనలేదు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతోంది. భార్య కోసం భర్త కష్టపడడం, భర్త గౌరవం కోసం భార్య తాపాత్రయపడే సన్నివేశాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇక రామచంద్ర చెఫ్ పోటీలో ప్రైజ్ మనీ గెలిచి తన అప్పుల నుంచి బయటపడతాడు. అతని శత్రువు కన్నబాబు నుంచి కూడా స్వీట్ షాప్ ను దక్కించుకుంటాడు. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 6.70 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 325వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..

   జానకిపై అసూయ చెందిన మల్లిక

  జానకిపై అసూయ చెందిన మల్లిక

  రామచంద్ర వంటల పోటీల్లో గెలవడంతో జ్ఞానాంబ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉంటారు ముఖ్యంగా తల్లి జ్ఞానాంబను అందరూ పొగుడుతూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది. అయితే జానకి తోడికోడలు మల్లిక మాత్రం ఆ విషయంలో ఏమాత్రం సంతృప్తి గా ఉండదు. అసలే జానకి పై చాలా కోపంగా ఉన్న మల్లికకు రామచంద్ర వంటల పోటీలలో గెలవడం ఇంకా కోపాన్ని తెప్పిస్తుంది. రామచంద్ర జానకి వల్లనే గెలిచాడు అని ఆ కారణంతో అత్తగారు ఆమెపై మరింత ప్రేమను చూపిస్తారు అని మల్లిక అసూయ చెందుతూ ఉంటుంది. దానికితోడు గ్రామస్తులు కూడా జానకి లాంటి కోడలు దొరకడం నీ అదృష్టం అని కూడా జ్ఞానాంబతో చెబుతూ ఉంటారు. దీంతో మల్లిక ఏ మాత్రం సంతృప్తి గా ఉండదు.

  మల్లిక మారదని..

  మల్లిక మారదని..

  ఇక జానకిపై ఏదో ఒక నింద మోపి జ్ఞానాంబ మనసులో అనుమానం కలిగేలా చేయాలి అని అనుకుంటుంది. అయితే ఈ క్రమంలో జ్ఞానాంబ మాత్రం నమ్మకుండా ఉంటుంది. మరొకసారి ఇలాంటి చాడీలు చెప్పకుండా ఉండాలి అని హెచ్చరికలు కూడా చేస్తుంది. దీంతో మల్లిక నోరు మూతపడుతుంది. అంతేకాకుండా ఆమె భర్త విష్ణు కూడా ఆమెపై అసంతృప్తిగానే ఉంటాడు. కానీ ఎన్నిసార్లు దెబ్బతగిలినా కూడా నేను వెనక్కి తగ్గను అని చెబుతోంది. తప్పకుండా జానకి పై పగ తీర్చుకుంటానని కూడా మల్లిక సవాల్ చేస్తుంది. ఇక ఎంత చెప్పినా కూడా మల్లిక మరదని భర్త విష్ణు తన మనసులో తనే అనుకుంటూ ఉంటాడు.

   జ్ఞానాంబ హ్యాపీ

  జ్ఞానాంబ హ్యాపీ


  ఇక అందరూ గుడికి వెళ్లిన తర్వాత అక్కడ అర్చన చేయించేందుకు సిద్ధమవుతారు. ఈ క్రమంలో రామచంద్ర అర్చన చేయించేందుకు డబ్బులు ఇస్తూ ఉండగా పూజారి వచ్చి మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు అని చెబుతాడు. ఎందుకని అడగడం తో జానకి ప్రత్యేకంగా గుడికి కొంత డబ్బును విరాళంగా ఇచ్చారు. అందువలన మీరు జీవితకాలం పాటు ఇక్కడ ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు అని మీకు ఉచితంగానే స్వామి వారి దగ్గర ప్రత్యేకంగా పూజ జరిపిస్తామని చెబుతారు. అంతేకాకుండా మీకు ఇలాంటి కోడలు దొరకడం అదృష్టం అని పూజారి చెప్పడంతో జ్ఞానాంబ సంతోషిస్తుంది.

  రామచంద్ర అన్నదానం

  రామచంద్ర అన్నదానం

  ఇక పూజా కార్యక్రమాలు జరుగుతున్న క్రమంలో జ్ఞానాంబ తన మనసులో ప్రత్యేకంగా ఒకటి కోరుకుంటుంది. తన కుటుంబం మొత్తం సంతోషానికి కారణం నా పెద్ద కొడుకు అని అతని జీవితానికి ఎలాంటి అపాయం లేకుండా చూడాలి అని ఆ దేవున్ని కోరుకుంటుంది. ఇక మరోవైపు మల్లిక జానకి పై పగ తీర్చుకోవాలని ఆలోచిస్తుంది. ఈ క్రమంలోనే కొడుకు రామచంద్ర తల్లికి సర్ ప్రైజ్ ఇవ్వడానికి ఒక చోటికి తీసుకు వెళతాడు. వంటల పోటీల్లో గెలిచిన సందర్భంగా జానకి సలహామేరకు గుడిలో భక్తులందరికీ కూడా అన్నదానం చేయాలని నిర్ణయించుకున్నట్లు చెబుతాడు. నీ చేతులమీదుగా భక్తులందరికీ అన్నదానం చేయాలి అనే కొడుకు కోరడంతో అందుకు తల్లి ఎంతగానో సంతోషిస్తుంది. ఇక అక్కడ ఉన్న భక్తులందరూ కూడా నీకు ఇలాంటివి కోడలు దొరకడం కూడా చాలా అదృష్టం అని చెప్పడంతో అత్తగారు మరొకసారి ఆనందంతో ఉప్పొంగి పోతారు.

  మల్లికకు విష్ణు కౌంటర్

  మల్లికకు విష్ణు కౌంటర్


  దీంతో మరింత ఆగ్రహానికి లోనైన మల్లికా అప్సెట్ అవుతూ ఉంటుంది. ఇక భర్త విష్ణు ఆమెకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని ఒక ప్రణాళిక రాచిస్తాడు. ఇప్పుడు నిన్ను కూడా మా అమ్మ ఎంతగానో పొగిడే విధంగా చేస్తాను అని వాళ్ళ దగ్గరికి తీసుకు వెళతాడు. అందుకు మల్లిక కూడా చాలా సంతోషిస్తుంది. అన్నయ్య వంటల పోటీల్లో గెలవాలి అని మల్లిక ఒక మొక్కు మొక్కుకుంది ఉంది అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతారు. ఏమిటి అని అడగడంతో కోనేటి నుంచి 108 బిందెల నీళ్లతో శివుడికి అభిషేకం చేస్తాను అని మల్లికా మొక్కుకుంది అని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. ఇక మల్లిక కూడా ఊహించని విధంగా ఆశ్చర్యపోతుంది. తన భర్త గురించి తెలిసి కూడా అతని మాటలు నమ్మి ఇక్కడి వరకు వచ్చాను అని తీవ్రంగా బాధ పడుతుంది ఇక వెంటనే భర్త చెప్పినట్లుగానే 108 నీళ్లతో స్వామివారికి అభిషేకం కూడా చేస్తుంది.

  Venkaiah Naidu...నో మోర్ పాలిటిక్స్ అమ్మా *Politics | Telugu OneIndia
  కుటుంబాన్ని కాపాడిన మల్లిక

  కుటుంబాన్ని కాపాడిన మల్లిక


  కుటుంబ సభ్యులు అందరూ మల్లిక భక్తి శ్రద్ధలను చూసి ఆశ్చర్యపోతారు. కానీ మల్లిక మాత్రం కష్టపడుతూనే ఆ పనిని పూర్తి చేస్తుంది. ఇక ఆ తరువాత తనకు తీవ్రంగా నడుము నొప్పి ఉంది అంటూ బాధ పడుతూ ఉంటుంది. ఇక అందరూ గుడి దగ్గర నుంచి బయటకు వెళుతున్న క్రమంలో ఒక కరెంటు తీగ తెగి పడుతుంది. జ్ఞానాంబ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దాన్ని చూసుకోకుండా ముందుకు నడుచుకుంటూ వస్తూనే ఉంటారు. కానీ ఆ విషయాన్ని పసిగట్టిన జానకి పక్కనే ఉన్న ఒక కర్రతో ఆ వైర్ ని పక్కన పడేస్తుంది. కానీ ఆ క్రమంలో ఆమె పక్కనే ఉన్న మెట్లపై పడడంతో తీవ్రంగా గాయపడుతుంది. స్పృహ కోల్పోవడంతో అందరు కూడా కంగారు పడతారు. మరి జానకి విషయంలో జ్ఞానాంబ మనసులో ఉన్న అపోహలు పూర్తిగా తొలగిపోతాయో లేదో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Serial June 23rd Episode
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X