Janaki Kalaganaledu June 23rd Episode:మనవడు కావలనుకుంటున్న జ్ఞానాంబకు షాకింగ్ ట్విస్ట్,మల్లిక ప్లాన్ డిజాస్టర్
Photos Courtesy: Star మా and Disney+Hotstar
జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. రామ - జానకిల మధ్య బంధం ఫ్యామిలీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక మల్లిక కుట్రలు సరికొత్త విలనిజాన్ని చూపిస్తున్నాయి. జ్ఞానాంబ కోపానికి కూడా హద్దులు లేకుండా పోతున్నాయి. జానకి - రామచంద్ర క్యూట్ లవ్ స్టొరీ సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అందమైన ప్రేమ మధ్యలో రామచంద్ర అమాయకత్వ ప్రేమ, జానకి ఆశయం, అత్త జ్ఞానాంబ కట్టుబాట్లు.. ఈ సిరియల్ లో ప్రధాన అంశాలు. ఇక ఈ రోజు ప్రసారం కాబోయే 68వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

పక్కా ప్లానింగ్ తో
ఇక జానకి వంట రాదని బాధపడుతున్న క్రమంలో వంట నేర్పించాలని రామ డిసైడ్ అవుతాడు. ఇక పక్కా ప్లానింగ్ తో ఇద్దరు పెరట్లో వంట చేసుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఆకలి వల్ల బెడ్ రూమ్ నుంచి బయటకు వచ్చిన మల్లిక.. జానకి, రామ బెడ్ రూమ్ లో ఉండకపోవడంతో ఎదో జరుగుతుందని అనుమానం వ్యక్తం చేస్తుంది.

జ్ఞానాంబ నిద్ర లేవాలని
బయటకు వెళ్లి చూసిన మల్లిక.. రామ, జానకి వంట చేసుకుంటున్న విధానం ఎలాగైనా అత్త జ్ఞానాంబ కంట పడేలా చేయాలని ఆలోచిస్తుంది. సడన్ గా నిద్ర లేపితే తిట్టడం కాయమని అనుకున్న మల్లిక వెంటనే కిటికీ దగ్గరకు వెళ్లి జ్ఞానాంబ నిద్ర లేవాలని నెత్తిపై ఉన్న మల్లెపూలను విసురుతుంది.

రాయితో కొట్టిన మల్లిక
దాంతో మొదట భర్తపై అనుమానం వ్యక్తం చేసిన జ్ఞానాంబ పెద్దగా ఆ విషయాన్ని పట్టించుకోకుండా నిద్రలోకి జారుకుంటుంది. ఇక ఆ తరువాత మల్లిక రాయి తీసుకొని జ్ఞానాంబ భర్తను కొడుతుంది. దీంతో నిద్ర లేచిన జ్ఞానాంబ ఎవరో దొంగలు పడ్డారమో అని బయటకు వస్తారు.

మల్లిక సంబరం
మరోవైపు జానకి రామ వంట చేయడంలో బిజీగా ఉంటారు. జ్ఞానాంబకు , జానకి రామలకు మధ్యన దుప్పట్లు ఆరేసి ఉండడంతో కనిపించారు. ఇక కింద కాళ్ళు కనిపించడంతో పసిగట్టిన రామ జానకి ఒక మూలన దాక్కుంటారు. ఇక అటువైపు జ్ఞానాంబ వస్తుండగా నిజం బయటపడినట్లే అని మల్లిక సంతోషిస్తుంది.
Recommended Video

జ్ఞానాంబ కంట పడిన మరో సీన్
ఇక చివరి నిమిషంలో భర్త ఎవరు లేనట్లు ఉన్నారని లోపలికి వెళ్లిపోదామని చెప్పడంతో జ్ఞానాంబ వెనుకడుగు వేస్తుంది. ఇక ఇంతలో రామ జానకి ఆ సామాన్లు తీసుకెళ్లి ఇంట్లోకి జారుకుంటాడు. ఎప్పటిలానే జానకి బెడ్ పైన, రామ నేలపై పడుకుంటాడు. డోర్స్ తెరచి ఉండడంతో ఆ సీన్ జ్ఞానాంబ కంట పడుతుంది. మరి మనవడు కావాలని అనుకుంటున్నా జ్ఞానాంబ జానకిపై ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











