Janaki Kalaganaledu June 24th Episode: జానకి, రామ రొమాన్స్ మళ్ళీ మొదలైంది.. అలా సెట్ చేసిన జ్ఞానాంబ
స్టార్ మా డైలీ సిరియాల్ జానకి కలగనలేదు మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఓ వైపు ఇక మల్లిక కుట్రలు సరికొత్త విలనిజాన్ని చూపిస్తున్నాయి. జ్ఞానాంబ కోపానికి కూడా హద్దులు లేకుండా పోతున్నాయి. జానకి - రామచంద్ర క్యూట్ లవ్ స్టొరీ సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అందమైన ప్రేమ మధ్యలో భర్త అమాయకత్వ ప్రేమలో జానకి ఆశయం, అత్త జ్ఞానాంబ కట్టుబాట్లు.. ఈ సిరియల్ లో హైలెట్ పాయింట్స్. నేడు ప్రసారం కాబోయే 68వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

కన్ఫ్యూజన్ లో జ్ఞానాంబ
ఎప్పటిలానే జానకి బెడ్ పైన, రామ నేలపై పడుకుంటాడు. డోర్స్ తెరచి ఉండడంతో ఆ సీన్ జ్ఞానాంబ కంట పడుతుంది. మనవడు కావాలని అనుకుంటున్నా జ్ఞానాంబ ఒక్కసారిగా కన్ఫ్యూజన్ లో పడుతుంది. మనవడు మనవరాళ్ల కోసం ఎన్నో కలలు కంటుంటే ఇలా జరగడం ఏమిటని ఆలోచిస్తూ ఉంటుంది.

ఆరా తీసిన జ్ఞానాంబ
ఇక ఇంతలో జానకి అత్తగారికి టీ ఇచ్చేసి లోపలికి వెలుతుంటుంది. జానకిని పిలిచిన జ్ఞానాంబ.. రామ నచ్చలేదా? విడివిడిగా ఎందుకు పడుకుంటున్నారని ఆరా తీస్తుంది. అబద్ధం చెబితే నాకు నచ్చదు నిజం చెప్పమని అడిగిన జ్ఞానాంబకు మళ్ళీ జానకి అబద్ధమే చెబుతుంది. ఇద్దరం అన్నొన్యంగానే ఉన్నట్లు చెప్పిన జానకి ఆయనకు కింద పడుకోవడం ఆలవాటు అంటకదా అని చెబుతుంది.

కంటతడి పెట్టిన జానకి
ఇక జానకి మాటలు నమ్మిన జ్ఞానాంబ మనవడు మనవరాలు కావాలని ఎంత ఆశపడుతున్నానో నీకు కూడా తెలుసు ఏడాది తిరిగే లోపు పిల్లలు కావాలని మరోసారి సున్నితంగా వివరణ ఇస్తుంది. దీంతో ఒక్కసారిగా కూలబడిన జానకి ఐఎస్ కావాలన్న తన కల కోసమే పిల్లలను వద్దనుకున్న నిజాన్ని దాచడం ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో అని కంటతడి పెడుతుంది.

మరోసారి రెచ్చగొట్టిన మల్లిక
ఇక జానకి, రామచంద్ర లకు తొందరగా పిల్లలు కలగాలని బెడ్ రూమ్ లో చిన్నారి పాపాల ఫొటోలను అంటించాలని కూతురికి, పనిమనిషికి జ్ఞానాంబ ఆదేశాలు జారీ చేస్తుంది. ఇక ఇంతలో అది చూసిన మల్లిక ఫొటోలు తగిలిస్తే పిల్లలు కలుగుతారా? మనసులు కలవాలి గాని.. అంటూ కామెంట్స్ చేస్తుంది. అంతే కాకుండా ఇద్దరికి ప్రశాంతంగా గడిపడానికి ఇక్కడ చోటే లేదు. ఇంటినిండా మనుషులే ఉన్నారని అంటుంది.

మొదలైన రొమాన్స్..
ఇక మల్లిక మాటలను గోడచాటు నుంచి విన్న జ్ఞానాంబ సందిగ్ధంలో పడుతుంది. మల్లిక మాటలు పట్టించుకోవద్దని భర్త చెప్పినప్పటికీ తను అన్నది నిజమే అని గ్రహిస్తుంది. అందుకే రాత్రికి జానకి, రామ తప్పితే ఇంట్లో అందరూ గుడికి వెళ్లి అక్కడే పడుకొని రావాలని ప్లాన్ వేస్తారు. దీంతో అర్ధరాత్రి రామ, జానకి రొమాన్స్ మొదలవుతుంది. మరి జ్ఞానాంబ వేసిన ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
photo courtesy: star maa, disney+ hotstar


Click it and Unblock the Notifications











