India
  For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu June 24th: జానకి కాళ్ళు పట్టుకున్న రామ.. కోడలికి జ్ఞానాంబ క్షమాపణ!

  |

  జానకి కలగనలేదు మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సీరియల్ గా ప్రేక్షకుల సంఖ్యను పెంచుకుంటోంది. రీసెంట్ గా వచ్చిన టాప్ సీరియల్స్ తో పోటీ పడుతూ జానకి కలగనలేదు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతోంది. రామచంద్ర చెఫ్ పోటీలో ప్రైజ్ మనీ గెలిచి తన అప్పుల నుంచి బయటపడతాడు. అతని శత్రువు కన్నబాబు నుంచి కూడా స్వీట్ షాప్ ను దక్కించుకుంటాడు. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 6.70 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 330వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..

  సంతోషంలో జ్ఞానాంబ

  సంతోషంలో జ్ఞానాంబ

  రామచంద్ర వంటల పోటీల్లో గెలిచిన కారణంగా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా తల్లి జ్ఞానాంబ కొడుకు గెలిచిన కారణంగా అతన్ని చూసి ఎంతగానో ఉప్పొంగిపోతుంది. అయితే ఊర్లో వాళ్ళందరూ కూడా రామచంద్ర గెలవడం మీకు ఎంతో గర్వకారణమని అంతేకాకుండా అలాంటి కొడుకు కోడలు ఉన్నందుకు కూడా మీరు చాలా అదృష్టవంతురాలు అని కూడా జ్ఞానాంబకు చెబుతారు. దీంతో ఆమె మరింత ఉప్పొంగిపోతోంది.

  జానకి గొప్పపని

  జానకి గొప్పపని

  అలాగే జానకి తన అత్తగారి పేరు మీద దేవాలయానికి ప్రత్యేకంగా విరాళం అందించడంతో అక్కడ పూజా కార్యక్రమాలు అలాగే అర్చనలు కూడా వారి కుటుంబానికి ప్రత్యేకంగా ఉచితంగా అందజేయడానికి అక్కడ నిర్వాహకులు ఒప్పుకుంటారు. ఆ విషయం తెలుసుకున్న జ్ఞానం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంతేకాకుండా మరొకవైపు రామచంద్ర భక్తులందరికీ గుడిలో ప్రత్యేకంగా అన్నదానం చేయించేందుకు సిద్ధమవుతాడు. అది కూడా జ్ఞానాంబ చేతుల మీదుగా కొనసాగాలని నిర్ణయం తీసుకోవడంతో ఆమె మరింత సంతోషిస్తుంది. అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటారు.

  కుటుంబాన్ని కాపాడిన జానకి

  కుటుంబాన్ని కాపాడిన జానకి

  ఇక జానకి జ్ఞానాంబ దృష్టిలో మరింత ఉన్నత స్థాయిలో వెలిగిపోతోందని మల్లిక ఎంతగానో కలవరపడుతూ ఉంటుంది. అసూయ చెందుతూ ఉంటుంది. అంతే కాకుండా తన పై రివెంజ్ కూడా తీర్చుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. కానీ ఆమె భర్త విష్ణు మాత్రం అలా జరగకుండా మల్లికను ఎప్పటికప్పుడు అడ్డుతగులుతూ ఉంటాడు. ఇక అంతా హ్యాపీగా కొనసాగుతున్న సమయంలో జ్ఞానాంబ కుటుంబాన్ని జానకి ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడుతుంది. గుడి నుంచి బయటకు వస్తున్న క్రమంలో ఒక కరెంటు తీగ వారి ముందు పడుతుంది. అంతే కాకుండా అక్కడ కొన్ని నీళ్ళు కూడా ఉండటంతో ఆ కరెంట్ ఆ ప్రాంతమంతా వ్యాపిస్తుంది.
  ఇక జానకి అది గమనించి తన ప్రాణాలకు తెగించి వారిని కాపాడుతుంది.

  బాధలో రామ

  బాధలో రామ

  పక్కన ఉన్న ఒక కర్రతో ఆ కరెంట్ తీగ ను తీసి పక్కన పడేసే క్రమంలో ఆమె మరో వైపున ఉన్న మెట్లపై పడటంతో తలకు తీవ్రంగా దెబ్బ తగులుతుంది. దీంతో స్పృహ కోల్పోతుంది. వెంటనే ఆమెకు చికిత్స అందించడం తో మెల్లగా కోలుకుంటుంది. ఈ క్రమంలో జానకి పరిస్థితి చూసిన రామచంద్ర మీరు లేకపోతే నేను లేను అంటే నీకు ఏమీ కాదు అని ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంతే కాకుండా మరొక వైపు బాధపడుతూ ఉంటాడు. అయితే మల్లిక మాత్రం ఎప్పటిలానే తన గొప్పలు చెప్పుకోవడానికి నేను శివుడికి నీళ్లతో 108 బిందెలతో అభిషేకం చేశాను కాబట్టే జానకి బ్రతికింది అని చెబుతుంది.

  జానకి కాళ్ళు పట్టుకున్న రామ

  జానకి కాళ్ళు పట్టుకున్న రామ

  కానీ జ్ఞానాంబ మాత్రం ఆ సమయంలో మల్లికపై కాస్త కోపంతో అందరూ బయటికి వెళ్ళండి అంటూ జానకి కాస్త విశ్రాంతి తీసుకోవాలి అంటుంది. ఇక అనుకున్నట్లే అందరూ కూడా బయటకు వెళ్ళి పోతారు. ఇక తర్వాత రామచంద్ర జానకిని చూసి మరింత బాధ పడుతూ ఉంటాడు. మీకు ఏదైనా జరిగి ఉంటే నేను ఏ మాత్రం తట్టుకోలేను అంటూ బాధ పడుతూ ఉండగా జానకి మాత్రం అలా మాట్లాడకండి అంటూ తన ప్రేమను చూపిస్తుంది. అంతేకాకుండా నిద్రపోతుంటే కాళ్లు పట్టుకునేందుకు కూడా సిద్ధమవుతాడు. వద్దని చెప్పినా కూడా భార్యకు ఇలాంటి సమయంలో తోడుగా ఉండడం కంటే గొప్ప అదృష్టం లేదు అని తన ప్రేమను కూడా చూపిస్తాడు.

  జ్ఞానాంబ క్షమాపణలు

  జ్ఞానాంబ క్షమాపణలు


  ఆ తర్వాత జానకి ఎన్నో విషయాల గురించి ఆలోచిస్తూ అన్నం తినకుండా టేబుల్ దగ్గర కూర్చుని ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన జ్ఞానాంబ జానకినీ క్షమాపణలు అడిగే ప్రయత్నం చేస్తుంది. అలా మాట్లాడకండి అత్తగారు అన్నప్పటికీ కూడా.. లేదమ్మా నేను నీ గురించి నేను చాలా తప్పుగా ఆలోచించాను ఎన్నో విషయాల్లో నువ్వు నాకు మంచి గౌరవం ఇచ్చావు. మన కుటుంబం మంచి గురించి కూడా ఆలోచించావు కానీ నేను మాత్రం నిన్ను కొన్ని అనుమానాలతో ఎంతగానో బాధపెట్టాను అని అందుకు నన్ను క్షమించాలి అని అడుగుతుంది.

   జానకిపై మరింత నమ్మకం

  జానకిపై మరింత నమ్మకం


  దీంతో జానకి మీరు ఏం చేసినా కూడా ప్రేమ ఉంటుంది అని మీరు ఎప్పుడూ కూడా పొరపాటు చేయరు అని తన వైపు నుంచి కూడా మంచి సమాధానమిస్తుంది. అయితే జానకి పై జ్ఞానాంబ మరొక నమ్మకాన్ని కూడా పెట్టుకుంటుంది. నువ్వు ఎప్పుడూ కూడా అబద్ధం చెప్పవు అని నాకు తెలుసు అని చెబుతుంది. అయితే జానకి మనసులో మాత్రం తన ఐపీఎస్ చదువు గురించి ఆలోచిస్తుంది. ఈ క్రమంలో రామచంద్ర అన్నం తినిపించడానికి పళ్ళెం తీసుకుని రాగా అప్పుడు జ్ఞానాంబ ప్రేమగా కోడలికి తినిపించే ప్రయత్నం చేస్తుంది. మరి ఈ ప్రేమానురాగాల ఎంతవరకు కొనసాగుతాయో తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Serial June 24th Episode 330
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X