Janaki Kalaganaledu June 25th Episode: మనవడి కోసం జ్ఞానాంబ ఆరాటం.. భార్య ముందు రామ కన్నీళ్లు

స్టార్ మా డైలీ సిరియాల్ జానకి మొత్తానికి 70 ఎపిసోడ్స్ ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. నిత్యం అత్తా కోడళ్ల మధ్య కొట్లాటలు కాకుండా రొటీన్ ను బ్రేక్ చేసి రొమాంటిక్ లవ్ సీన్స్ ను జత చేయడం అందరిని ఆకట్టుకుంటోంది. మల్లిక కుట్రలు సరికొత్త విలనిజాన్ని చూపిస్తున్నాయి. జ్ఞానాంబ కోపానికి కూడా హద్దులు లేకుండా పోతున్నాయి. జానకి - రామచంద్ర క్యూట్ లవ్ స్టొరీ సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అందమైన ప్రేమ మధ్యలో భర్త అమాయకత్వ ప్రేమలో జానకి ఆశయం, అత్త జ్ఞానాంబ కట్టుబాట్లు.. ఈ సిరియల్ లో హైలెట్ పాయింట్స్. నేడు ప్రసారం కాబోయే 70వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

అమ్మలాంటి అమ్మాయి కావాలని

అమ్మలాంటి అమ్మాయి కావాలని

జానకి, రామచంద్ర లకు తొందరగా పిల్లలు కలగాలనే ఆలోచనతో బెడ్ రూమ్ లో చిన్నారి పాపాల ఫొటోలను అతికించాలని కూతురికి, పనిమనిషి జ్ఞానాంబకు ఆదేశాలు జారీ చేస్తుంది. ఇక బెట్ రూమ్ లో ఆ ఫొటోలను అంటిస్తూ ఉండగా రామ, జానకి అది చూసి సిగ్గు పడుతూ ఉంటారు. బాబు కావాలా, పాప కావాలా? అని అడిగిన చెల్లెలి ప్రశ్నకు రామ అమ్మలాంటి అమ్మాయి కావాలని సమాధానం చెబుతారు.

తల్లికి మాట ఇచ్చిన రామచంద్ర

తల్లికి మాట ఇచ్చిన రామచంద్ర

రామ ఆ మాట అనగానే జ్ఞానాంబ రూమ్ లోకి వస్తుంది. మనవడు మనవరాలు ఇంట్లో ఆడుకుంటూ తనని నానమ్మ అంటుంటే వినాలని ఉందని జ్ఞానాంబ వారి ముందు ఎమోషనల్ అవుతుంది. ఇక రామ తల్లికి మాట ఇస్తూ కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేసాడు. ఇక జానకి అందులో న్యాయం ఉందని అనుకుంటుంది. ఇక మరోవైపు ఐఏఎస్ కావాలన్న తన కల నెరవరకుంటే జీవితాంతం బాధపడుతూ ఉండాలని అనుకుంటుంది.

మల్లిక నోటికి ప్లాస్టర్

మల్లిక నోటికి ప్లాస్టర్

రాత్రికి జానకి, రామ తప్పితే ఇంట్లో అందరూ గుడికి వెళ్లి అక్కడే పడుకొని రావాలని ప్లాన్ వేసిన జ్ఞానాంబ ఆ విషయాన్ని అందరికి చెప్పాలని పనిమనిషి చికిత్తకు వివరణ ఇస్తుంది. ఇక ఈ రోజు వద్దని రేపు వెళ్లమని రామ ఎందుకో ఆపేస్తాడు. ఇక మరోవైపు ఆ విషయం తెలుసుకున్న మల్లిక షాక్ అవుతుంది. ఎదో ఒకటి చేయాలని గుడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలని అనుకుంటూ ఉండగా ఆమె భర్త విష్ణు నోటికి ప్లాస్టర్ వేస్తాడు. అయినప్పటికీ మల్లిక ఏదో కుట్ర చేయాలని ఆలోచిస్తుంది.

జానకి, రామ్ రొమాన్స్

జానకి, రామ్ రొమాన్స్

ఇక రాత్రి సమయంలో ఎవరికి తెలియకుండా స్వీట్స్ తినేందుకు జ్ఞానాంబ భర్త ముసుగుతో కిచెన్ లో దుప్పటి కప్పుకొని దూరుతాడు. ఇక అదే సమయంలో ఇల్లుని పూలతో అలంకరించాడనికి రామ, జానకి ప్లాన్ వేస్తారు. అలాగే ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ చోటు చేసుకుంటాయి.

జానకి ముందు కంటతడి పెట్టిన రామ

జానకి ముందు కంటతడి పెట్టిన రామ

జానకి పూలు కడుతూ కింద పడిపోతుంటే రామ పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తాడు. అప్పుడు జానకి కూడా రామకు ఎట్రాక్ట్ అవుతుంది. ఇద్దరు సిగ్గుపడుతూ ఉంటారు. ఇక ఇద్దరు ఏకాంతంగా పడుకున్నాక రామ ఎందుకో కంటతడి పెడుతుంటే జానకి కన్నీళ్లు తుడుస్తుంది. మరి ఆ ఎమోషనల్ సీన్ వెనుక అసలు కారణం ఏమిటో తెలియాలి అంటే మరుసటి ఎపిసోడ్ లో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X