Janaki Kalaganaledu June 27th: జానకి విషయంలో జ్ఞానాంబ మరింత హ్యాపీ.. ఇంతలోనే మరో షాక్!

జానకి కలగనలేదు రోజురోజుకు మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. మంచి కంటెంట్ ఉన్న సీరియల్ గా వీక్షకుల సంఖ్యను పెంచుకుంటోంది. రీసెంట్ గా వచ్చిన టాప్ సీరియల్స్ తో పోటీ పడుతూ జానకి కలగనలేదు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతోంది. రామచంద్ర చెఫ్ పోటీలో ప్రైజ్ మనీ గెలిచి తన అప్పుల నుంచి బయటపడతాడు. అతని శత్రువు కన్నబాబు నుంచి కూడా స్వీట్ షాప్ ను దక్కించుకుంటాడు. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 6.70 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 331వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..

 ప్రాణాలకు తెగించి..

ప్రాణాలకు తెగించి..

జ్ఞానాంబ కుటుంబాన్ని జానకి ప్రాణాలకు తెగించి కాపాడడం ఆమె మనసులో జానకి స్థానం మరింత పెరుగుతుంది. గుడి దగ్గర జ్ఞానాంబ కుటుంబ సభ్యులు అందరూ కూడా నడుచుకుంటూ వస్తున్న సమయంలో అక్కడ కరెంటు వైర్ వారికి తగలకుండా జానకి ఎంతో ధైర్యం చేసి వాళ్ళను కాపాడుతుంది. ఆ క్రమంలో ఆమె కొంత గాయానికి కూడా గురి అవుతుంది. జానకి తన ప్రాణాలకు తెగించి కుటుంబ సభ్యులను కాపాడడం తో ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంతగానో ఎమోషనల్ అవుతారు. జానకి ఆ పని చేయకపోతే చాలా ఘోరం జరిగిపోయి ఉండేది అని అందరూ అనుకుంటారు.

జానకిపై ఎమోషనల్

జానకిపై ఎమోషనల్


అయితే అదేసమయంలో రామచంద్ర కూడా ఎంతగానో మనోవేదనకు గురి అవుతాడు. మీకు ఏమైనా జరిగి ఉంటే నేను తట్టుకుని ఉండేవాడిని కాదు అంటూ మీరు లేకపోతే నేను లేను అని చాలా ఎమోషనల్ గా ఫీల్ అయిపోతాడు. రామచంద్ర ప్రేమను చూసి జానకి కూడా భావోద్వేగానికి గురి అవుతుంది. అలాగే జ్ఞానాంబ కూడా జానకి మంచితనం మరోసారి అర్థం చేసుకుంటుంది. ఇన్నాళ్ళు నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను అని ఇప్పుడు నీ మంచితనం చూసిన తర్వాత నువ్వు ఏంటో పూర్తిగా అర్థం అయింది అని కూడా జ్ఞానాంబ వివరణ ఇస్తుంది.

అత్త కోసం ప్రత్యేకంగా

అత్త కోసం ప్రత్యేకంగా

ఇక మంచి కోడలుగా ఉండాలని జానకి మరింత ప్రేమగా మేసులుకోవాలని ప్రయత్నం చేస్తుంది. అత్తయ్య గారికి ఫిల్టర్ కాఫీ అంటే ఎంతో ఇష్టమని దాన్ని చాలా బాగా తయారు చేయాలి అని అనుకుంటుంది. అయితే వంటగదిలోకి రామచంద్ర కూడా వస్తాడు. ఆ సమయంలో జానకి ఫిల్టర్ కాఫీ పెట్టడం రాదు అని రామచంద్ర చేయాలనుకుంటాడు. ఇక ఆ తర్వాత రామచంద్ర చెప్పినట్లు గానే జానకి చాలా జాగ్రత్తగా అత్తగారి కోసం ఫిల్టర్ కాఫీ రెడీ చేస్తుంది. ఇక అదే సమయంలో గోవింద రాజులు కూడా తన భార్యను ఫిల్టర్ కాఫీ పెట్టాలి అని అడుగుతాడు. ఇక అలా అడిగే సమయంలోనే జానకి ప్రత్యేక అత్తగారికి మామగారికి ఇద్దరికి కూడా ఫిల్టర్ కాఫీ తీసుకు వస్తుంది.

 జానకిపై గోవిందరాజులు ప్రశంసలు

జానకిపై గోవిందరాజులు ప్రశంసలు

దీంతో ఆ విషయంలో కోడలిపై గోవిందరాజులు మరోసారి ప్రశంసల వర్షం కురిపిస్తాడు. కాఫీ చాలా అద్భుతంగా ఉంది అంటూ కోడలు అంటే నీలా ఉండాలి అని పొగడ్తలతో ముంచెత్తుతాడు. ఇక పక్కనే మల్లిక ఆ మాటలను తట్టుకోలేక పోతుంది. తాను కూడా ఫిల్టర్ కాఫీ చాలా బాగా పెడతాను అంటూ మామ గారికి చెబుతూ ఉంటుంది. అవును నువ్వు పుల్లలు పెట్టడంలో చాలా తెలివిగా ఆలోచిస్తావు అని ఆమె పై సెటైర్లు కూడా వేస్తాడు. దీంతో అందరూ పగలబడి నవ్వుతారు. ఆ మాటలను మల్లిక ఏ మాత్రం తట్టుకోలేక పోతుంది. అంతేకాకుండా అత్తగారు జానకి ని చూసి అసూయ చెందకుండా ఒక అక్కల భావిస్తే ఇద్దరూ బాగుంటారు అని అంటుంది.

జ్ఞానాంబ కౌంటర్

జ్ఞానాంబ కౌంటర్

కానీ ఆ మాటలను మల్లికా పైకి వింటూనే లోపల మాత్రం మరింత అసూయ చెందుతుంది. తర్వాత అందరూ కూడా ఒక బారసాల వేడుకకు వెళ్లాలని అనుకుంటారు ఇక రామచంద్ర మాత్రం స్వీట్ షాప్ కు వెళ్ళడానికి సిద్ధం అవుతాడు. అయితే జానకి ఏ చీర కట్టుకోవాలో తెలియక కన్ఫ్యూజన్లో ఉంటుంది. ఆ తరుణంలో రామచంద్ర జానకి ఒక మంచి చీర కట్టుకోమని ఇస్తాడు. అది జానకి కూడా నచ్చడంతో ఎంతగానో సంతోషిస్తుంది. ఇక ఆ తర్వాత మల్లిక మాత్రం కాస్త స్టైలిస్ట్ గా తయారయ్యే ప్రయత్నం చేస్తుంది. అలాంటి చీర కడితే అమ్మ తిడుతుంది అని విష్ణు చెప్పినప్పటికీ అత్తగారు అంటే తనకు ఏ మాత్రం భయం లేదు అని చెబుతుంది.

 ఆ మాటతో షాక్

ఆ మాటతో షాక్

కానీ ఆ తర్వాత జ్ఞానాంబ పద్ధతి గా రెడీ అవ్వాలి అని ఆర్డర్ వేయడంతో మల్లిక వెంటనే మళ్ళి నార్మల్ గా రెడీ అయి వస్తుంది. ఇక అందరూ కలిసి జ్ఞానాంబ స్నేహితురాలు మనవడి బారసాల కి వెళ్తారు. ఇక అక్కడ అందరికి కూడా జ్ఞానాంబ కోసం ఇంత సేపు వెయిట్ చేయించడం ఏ మాత్రం నచ్చదు. జ్ఞానాంబ రాగానే వేడుకలు మొదలుపెడతారు. ఈ క్రమంలో మరొక మహిళ మీ పెద్ద కోడలు ఇంకా వరాసుడిని ఇవ్వలేదా అని ప్రశ్నిస్తుంది. దీంతో జ్ఞానాంబ జానకి అందరూ షాక్ అవుతారు. మరి ఈ మాటలతో జ్ఞానాంబ ఏ విదంగా స్పందిస్తుందో చూడాలి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X