For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu June 28th Episode: కొడుకు ఇచ్చిన సర్‌ప్రైజ్‌కు షాక్ ఇచ్చిన జ్ఞానాంబ.. రామ కంటతడి!

  |

  స్టార్ మా డైలీ సిరియాల్ జానకి కలగనలేదు రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఒక్కసారి ఎట్రాక్ట్ అయిన జనాలు మళ్ళీ బ్రేక్ ఇవ్వడం లేదు. మొత్తానికి రాశి ఇమేజ్ ఈ సీరియల్ కు చాలా బాగా హెల్ప్ అయ్యింది. అత్తా కోడళ్ల మధ్య కొట్లాటలు కాకుండా రొటీన్ ను బ్రేక్ చేసి రొమాంటిక్ లవ్ సీన్స్ ను జత చేయడం అందరిని ఆకట్టుకుంటోంది. మల్లిక కుట్రలు సరికొత్త విలనిజాన్ని చూపిస్తున్నాయి. జ్ఞానాంబ కోపానికి కూడా హద్దులు లేకుండా పోతున్నాయి. జానకి - రామచంద్ర క్యూట్ లవ్ స్టొరీ సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అందమైన ప్రేమ మధ్యలో భర్త అమాయకత్వ ప్రేమలో జానకి ఆశయం, అత్త జ్ఞానాంబ కట్టుబాట్లు.. ఈ సిరియల్ లో హైలెట్ పాయింట్స్. నేడు ప్రసారం కాబోయే 71వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

  అమ్మను ఆపేసిన రామ

  అమ్మను ఆపేసిన రామ

  జానకి, రామచంద్ర లకు తొందరగా పిల్లలు కలగాలనే ఆలోచనతో జ్ఞానాంబ సరికొత్తగా ఆలోచిస్తుంది. కూతురి చేత బెడ్ రూమ్ లో చిన్నారి పాపాల ఫొటోలను అతికించాలని ఆదేశాలు జారీ చేస్తుంది. అనంతరం జానకి, రామ ఇద్దరు ఇంట్లో సరదాగా గడపాలని అందరిని గుడికి తీసుకువెళ్లాలని అనుకున్న జ్ఞానాంబను రామ అడ్డు పడతాడు. ఈ రోజు వద్దని రేపు వెళ్లమని రామ ఆపేస్తాడు.

  దొంగలా.. గోవింద రాజులు

  దొంగలా.. గోవింద రాజులు

  రామ ఆపడానికి కారణం లేకపోలేదు. అదే రోజు జ్ఞానాంబ పుట్టినరోజు ఉండడంతో సర్ ప్రైజ్ ఇవ్వాలని ఇంటిని మొత్తం భార్యతో కలిసి డెకరేట్ చేస్తాడు. ఇక మరోవైపు వంట గది నుంచి లడ్డులు తీసుకొని గోవింద రాజులు దొంగలా వెళుతుంటారు. వెంటనే రామ తండ్రిని ఆపేసి షుగర్ ఉన్నప్పుడు తినవద్దని క్లాస్ పికుతాడు. అప్పుడప్పుడు తింటే ఏమి కాదని గోవింద రాజు సర్ది చెబుతాడు.

  తలుపులు బాదుతూ..

  తలుపులు బాదుతూ..

  ఇక ఇంతకీ హడావుడి ఏమిటని అడిగిన తండ్రికి రామ చెవిలో అసలు విషయాన్ని చెబుతాడు. ఇక నేను కూడా సహాయం చేస్తానని గోవింద రాజు ఒక బెలూన్ ఊది పేల్చేస్తాడు. ఇక నిద్ర లేచిన జ్ఞానాంబ ఎదో పడేసి ఉంటారని మళ్ళీ పడుకుంటుంది. ఇక కొద్దిసేపటి అనంతరం ఏర్పాట్లన్ని పూర్తయిన అనంతరం జ్ఞానాంబ రూమ్ తలుపులు బాదుతూ నిద్ర లేపుతారు.

  భర్తపై కసురుకున్న మల్లిక

  భర్తపై కసురుకున్న మల్లిక

  ఇక జ్ఞానాంబ వచ్చిన వెంటనే లైట్స్ ఆన్ చేసి అందరూ సంతోషంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతుంటారు. ఇక మల్లిక తన భర్తను నిందిస్తూ ఇదేదో ముందే చెప్పి ఉంటే మనమే చేసి ఉండేవాళ్ళం కదా అని కసురుకుంటుంది. ఇక ఈ దెబ్బతో అత్తగారు జానకికి గుడి కట్టేస్తుందని మల్లిక అసూయ పడుతుంది.

  కొడుకుపై జ్ఞానాంబ ఆగ్రహం

  కొడుకుపై జ్ఞానాంబ ఆగ్రహం

  కానీ ఎవరు ఊహించని విధంగా జ్ఞానాంబ ఒక్కసారిగా ఆపండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. నేను ఈ వేడుక చెయ్యమని ఆడిగానా అంటూ కొడుకు రామచంద్రపై కసురుకుంటుంది. భార్యతో సరదాగా ఉండాల్సిన ఈ టైమ్ లో తల్లిపై అతి ప్రేమ చూపించడం కరెక్ట్ కాదని జ్ఞానాంబ ఏ మాత్రం గ్యాప్ లేకుండా మాటలతో రామ మనసును గాయపరిస్తుంది. నీ భార్యతో సరిగ్గా ఉండడం లేదని, అది నాకు ఏ మాత్రం నచ్చదని అంటుంది.

  జానకి ముందు కంటతడి పెట్టిన రామచంద్ర

  జానకి ముందు కంటతడి పెట్టిన రామచంద్ర

  అమ్మకంటే నాకు ఏది ఎక్కువ కాదని అన్నప్పుడు కొడుకుపై మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇక అందరూ లోపలికి వెళ్లిపోవాలని చెప్పిన జ్ఞానాంబ వాడి మంచి కోసమే అలా చేశాను అని బాధపడుతుంది. ఇక బెడ్ రూమ్ లోకి వెళ్లిన రామచంద్ర కారణం లేకుండా అమ్మ ఇలా అనదు అని భార్య ముందు ఏడుస్తాడు. మిమ్మల్ని సరిగ్గా చూసుకోవడం లేదని అనిపిస్తున్నట్లు చెప్పగానే జానకి అలాంటిదేమీ లేదని నచ్చజెప్పె ప్రయత్నం చేస్తుంది. ఇక ఫ్యామిలీ మొత్తం గుడికి వెళ్లిన అనంతరం రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 71:
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X