Janaki Kalaganaledu June 28th: తట్టుకోలేక మాట ఇవ్వమన్న జ్ఞానాంబ.. మరో షాక్ లో జానకి
జానకి కలగనలేదు మరో ఆసక్తికరమైన కథాంశంతో ఎంతగానో ఆకట్టుకుంటోంది. మంచి కంటెంట్ ఉన్న సీరియల్ గా వీక్షకుల సంఖ్యను పెంచుకుంటోంది. రీసెంట్ గా వచ్చిన టాప్ సీరియల్స్ తో పోటీ పడుతూ జానకి కలగనలేదు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతోంది. రామచంద్ర చెఫ్ పోటీలో ప్రైజ్ మనీ గెలిచి తన అప్పుల నుంచి బయటపడతాడు. అతని శత్రువు కన్నబాబు నుంచి కూడా స్వీట్ షాప్ ను దక్కించుకుంటాడు. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 6.70 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 332వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..

మల్లిక అవతారం చూసి..
జ్ఞానాంబ తన ఇద్దరు కొడళ్లతో కలిసిఒక బారసాల వేడుకకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంటుంది. అందుకోసం పద్ధతిగా రెడీ అవ్వాలి అని కూడా చెబుతోంది. అయితే జానకి మాత్రం నేచురల్ గా సింపుల్ గా చీర కట్టుకొని ముందుకు రాగా.. మరో కోడలు మల్లిక మాత్రం స్టైల్ గా రెడీ అయి వస్తుంది. ఆమె అవతారం చూసి అత్తగారు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఈ అవతారం ఏమిటి అని ఆమె ప్రశ్నిస్తుంది. అంతేకాకుండా మామ గోవిందరాజులు కూడా నువ్వు ఇలా వెళ్తే మన వీధిలో కుక్కలు కూడా వెంట పడతాయి జాగ్రత్త అని అంటాడు. అలా సెటైర్లు వేయడంతో మల్లిక వాదించే ప్రయత్నం చేస్తుంది.

తట్టుకోలేకపోయిన కామాక్షి
ఇక మాటలు ఆపి పద్ధతి గా రెడీ అయ్యి రావాలి అని అత్తగారు ఆర్డర్ వేస్తారు. దీంతో మల్లిక ఏమీ మాట్లాడకుండా భయంతో తన గదిలోకి వెళ్లే మరొక చీర కట్టుకొని వస్తుంది. ఇక తన ఇద్దరు కొడళ్లతో కలిసి జ్ఞానాంబ తనకు స్నేహితురాలు అయిన ఒక మహిళ మనవరాలు బారసాలకు వెళుతుంది. ఇక అక్కడ జ్ఞానాంబ కోసమే వేడుకను ఆలస్యం చేస్తున్నారు అని కొందరు అసహనం తో ఉంటారు. అంతే కాకుండా కామాక్షి అనే మహిళ మరింత అసూయ చెందుతుంది. ఆ వేడుకలో అందరూ జ్ఞానాంబను ప్రత్యేకంగా గౌరవిస్తూ ఉండటంతో ఆమె తట్టుకోలేక పోతుంది. తన మనసులో తనే ఆమెపై చెడుగా ఆలోచిస్తుంది.

ఆ సంగతి ఏమైంది?
అంతేకాకుండా కామాక్షి గత విషయాలను కూడా బయటకు తీస్తూ అందరిముందు అడగడంతో జ్ఞానాంబ కొద్దిసేపటి వరకు ఏమీ మాట్లాడ లేని పరిస్థితుల్లో ఉంటుంది. ముందుగా మీ ఇద్దరు కూడళ్ళకి ఎవరికైనా విశేషం ఉందా లేదా అని అడుగుతుంది. ప్రత్యేకంగా జానకిని అడగడం తో ఆమె ఏమీ మాట్లాడదు. దీంతో జ్ఞానాంబ కలగజేసుకుని ఇప్పుడే అలాంటివి ఏమీ లేవు అని చెప్పడంతో గతంలో జ్ఞానాంబ చేసిన ఒక చాలెంజ్ గురించి గుర్తు చేస్తుంది. అప్పుడు నువ్వే చెప్పావు కదా జ్ఞానాంబ.. ఏడాది తిరిగేలోపు మా ఇంట్లో కూడా బారసాల వేడుకలు జరుగుతాయి తప్పకుండా మీ అందరిని పిలుస్తారు అని అన్నావు. మరి ఏమైంది.. అని కామాక్షి అడిగే ప్రయత్నం చేస్తుంది.

ఆ యోగం ఉందా లేదా?
దీంతో జ్ఞానాంబ మౌనంగానే ఉండిపోతుంది అంతేకాకుండా. అలాగే ఏదైనా లోపం ఉందా అని కూడా అడుగుతుంది. హాస్పిటల్ కి తీసుకు వెళ్ళ లేక పోయావా లేకపోతే ఆ పనులు కూడా అయిపోయాయి అంటూ.. అసలు మీకు వారసుడు యోగం ఉందా లేదా అని వివిధ రకాల ప్రశ్నలు అడగడం తో జ్ఞానాంబ సమాధానం చెబుతుంది. నువ్వు కావాలని అడుగుతున్నావు అని అంటూ తప్పకుండా నెల రోజుల తర్వాత ముందు నీకే శుభవార్త చెబుతాను అని ఛాలెంజ్ చేస్తుంది.

మరో ఛాలెంజ్
అయితే గతంలో కూడా ఇదే తరహాలో చెప్పావని ఇప్పుడు ఆలోచించి మాట్లాడు అని కూడా కామాక్షి అనడంతో అలాంటి డౌట్ లేదు అని కూడా జ్ఞానాంబ చెబుతుంది. ఇక ఆ తర్వాత ఇంటికి వచ్చిన అనంతరం జ్ఞానాంబ ఆలోచనలో పడుతుంది. వారికి చెప్పినట్లుగా ఎలాగైనా తొందరలోనే బారసాల వేడుక చేసే విధంగా కొడళ్ళని ప్రిపేర్ చేయాలని ఆలోచిస్తుంది. ఇక మరోవైపు మల్లిక మాత్రం అత్తగారికి తగిన శాస్తి జరిగింది అని అందరూ ఆమెను అలా అడుగుతుంటే ఆనందం కలిగింది అంటూ ఆమె ఎంతగానో సంతోషిస్తుంది.

మాట ఇవ్వమని కోరిన జ్ఞానాంబ
ఇక వెంటనే జ్ఞానాంబ తన ఇద్దరు కొడళ్ళని కూడా రమ్మని చెబుతుంది. వారితో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. ఇన్ని రోజులు మీరు ఎలాంటి నిర్ణయం తో పిల్లలు వద్దు అనుకున్నారో నాకు తెలియదు. ఒక విధంగా మీరు తొందరగా పిల్లల్ని కనండి అని అనే హక్కు కూడా నాకు లేదు. కానీ అందరి మాటలు నేను భరించలేక పోతున్నాను. కాబట్టి మొదటి సారి మిమ్మల్ని అడుగుతున్నాను ఏడాది తిరిగేలోపు బాబునో లేదా పాపనో ఇవ్వాలి అని అంటుంది. అని అందుకోసం మాట కూడా ఇవ్వాలి అని జ్ఞానాంబ చెబుతుంది. ఇక వెంటనే జానకి ఆలోచనలో పడుతుంది. మరి ఈ విషయంలో జ్ఞానాంబకు జానకి మాట ఇస్తుందో లేదో తెలియాలంటే తదుపరి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











