India
  For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu June 29th: అత్త జ్ఞానాంబకి మాట ఇచ్చిన జానకి.. ఆందోళనలో రామచంద్ర!

  |

  జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఈ సీరియల్ వీక్షకుల సంఖ్యను పెంచుకుంటోంది. అంతే కాకుండా ఇటీవల కాలంలో వచ్చిన టాప్ సీరియల్స్ తో పోటీ పడుతూ జానకి కలగనలేదు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతోంది. రామ కన్నబాబు నుంచి కూడా స్వీట్ షాప్ ను దక్కించుకుంటాడు. ఇక జానకి ప్రాణాలకు తెగించి జ్ఞానాంబ కుటుంబ సభ్యులను కాపాడుకుంటుంది.

  జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 6.70 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 333వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..

  జ్ఞానాంబపై ప్రశ్నలు

  జ్ఞానాంబపై ప్రశ్నలు

  తన ఇద్దరు కొడళ్లతో కలిసి జ్ఞానాంబ ఒక బారసాల వెనుకకు వెళ్ళుతుంది అయితే అక్కడ కామాక్షి అనే మహిళ జ్ఞానాంబను సూటిపోటి మాటలతో ప్రశ్నిస్తూనే ఉంటుంది. అందరి బారసాల వేడుకకు నువ్వు వెళ్తున్నావు కానీ మీ ఇంట్లో ఎప్పుడు బారసాల కు ఎప్పుడు పిలుస్తారు అని అడుగుతుంది. గతంలో నువ్వు ఒక బారసాల వేడుకలో మాట కూడా ఇచ్చావు గుర్తుందా? ఏడాది తిరిగే సరికి మా ఇంట్లో వారసుడు ఉంటాడు అని కూడా చెప్పావు.. అని కామాక్షి అనడంతో జ్ఞానాంబ మొదట ఏమీ మాట్లాడలేని పరిస్థితుల్లో ఉంటుంది.

  మాట ఇవ్వమన్న జ్ఞానాంబ

  మాట ఇవ్వమన్న జ్ఞానాంబ

  తప్పకుండా నెల తిరిగేసరికి మంచి శుభవార్త మీకు చెబుతాను అని మరోసారి ఛాలెంజ్ చేస్తుంది. ఇక ఆ తర్వాత జ్ఞానాంబ ఇంటికి రాగానే తన ఇద్దరు కొడళ్లతో ప్రత్యేకంగా మాట్లాడుతుంది. అంతేకాకుండా వారి నుంచి ఒక మాట కూడా తీసుకోవాలని అనుకుంటుంది. ఇన్నిరోజులు మీరు ఎందుకు పిల్లల్ని కనకూడదని అనుకున్నారో నాకు తెలియదు.

  కానీ ఇప్పుడు ప్రత్యేకంగా అడుగుతున్నాను నాకు కూడా మనవడు మనవరాళ్లతో ఆడుకోవాలని ఉంటుంది. ఇన్ని రోజులు నేను ఈ విషయంలో మిమ్మల్ని పెద్దగా ఏమీ అడగలేదు కానీ ఇప్పుడు అందరూ అడుగుతూ ఉంటే బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. అందుకే ప్రత్యేకంగా అడుగుతున్నాను మీ ఇంట్లోకి బాబునో పాపనో ఇస్తాను అని మాట ఇవ్వాలి అని జ్ఞానాంబ బాగా ప్రత్యేకంగా అడగడంతో ఇద్దరు కోడళ్లు కూడా షాక్ అవుతారు.

  మాట ఇచ్చిన జానకి

  మాట ఇచ్చిన జానకి

  అయితే జ్ఞానాంబ మాత్రం ఎక్కువగా జానకిపైన నమ్మకం పెట్టుకొని ఉంటుంది. కనీసం నువ్వు అయినా మాట ఇవ్వు జానకి అని అడుగుతుంది. అయితే జానకి మాత్రం మొదట కొంత ఆలోచిస్తుంది కానీ ఆ తర్వాత అత్తగారి బాధను అర్థం చేసుకునే మాట ఇస్తుంది. తప్పకుండా మీకు వారసుడిని ఇస్తాను అని చెప్పడంతో జ్ఞానాంబ ఎంతగానో సంతోషపడుతుంది. కానీ రామచంద్ర మాత్రం జానకి చదువు గురించి ఆలోచించి ఒక్కసారిగా షాక్ అవుతాడు.

  అబద్ధపు మాట

  అబద్ధపు మాట

  అయితే మరోవైపు మల్లిక మాత్రం అత్తముందు అబద్ధపు మాటలతో తన వ్యాల్యూ ని పెంచుకోవాలని అనుకుంటుంది. పెద్దకోడలి స్థాయి పెరిగిపోతోంది అని అందుకే ఈ సమయంలో ఏదో ఒక మాట ఇచ్చేద్దాం అని.. అయినా ఇచ్చిన మాట ప్రకారం మనం నిలబడతామా ఏంటి అంటూ తన మనసులోనే అనుకుంటూ అత్తగారికి మాట ఇస్తుంది. తప్పకుండా నేను కూడా జానకి కంటే ముందే పిల్లనో పిల్లాడినో మీ చేతుల్లో పెడతాను అని చెబుతుంది. అంతేకాకుండా జ్ఞానాంబ మరొక ముఖ్యమైన విషయం చెబుతుంది. ముందుగా ఎవరైతే ఈ ఇంటికి మనవడినో మనవరాలీనో అందిస్తాతో వారికి ప్రత్యేకంగా రామాలయం గుడి దగ్గర ఉన్న ల్యాండ్ కూడా రాసి ఇస్తాను అని వాగ్దానం చేస్తుంది. దీంతో మల్లిక ఒకసారి గా హ్యాపీగా ఫీల్ అవుతుంది.

  మల్లిక మనసులో మాట

  మల్లిక మనసులో మాట

  మనమే ఈ ఇంట్లోకి ముందుగా వారసుడిని అందిస్తే ఆ ల్యాండ్ కొట్టేయవచ్చు అని కనీసం అది 20 లక్షలు ఉంటుంది అని ఆశపడుతుంది. ఆ ఆలోచనను ముందే పసిగట్టిన రామచంద్ర తండ్రి గోవిందరాజులు అవునవును 20 లక్షల ఉంటుంది అని సెటైర్ వేస్తాడు. దీంతో మనసులో అనుకున్న మాటలను అలా చెప్పడంతో మల్లికా ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక తర్వాత రామచంద్ర జానకిని ప్రత్యేకంగా తన గదిలోకి తీసుకువెళ్లి మాట్లాడే ప్రయత్నం చేస్తాడు మీరు ఐపీఎస్ అవ్వాలనుకుంటున్న కల గురించి అసలు మీకు గుర్తు ఉందా ఎందుకు మాటిచ్చారు అని ప్రశ్నిస్తాడు. కానీ జానకి మాత్రం ఆ విషయం గుర్తుంది అని చెబుతుంది. కోడలిగా నా బాధ్యతను పూర్తి చేస్తాను అలాగే చదువును కూడా పూర్తి చేస్తానని అంటుంది.

  YS Jagan పదవుల పంపకం... బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి కీలక పదవి *Politics | Telugu Oneindia
  జానకి మాటలకి సిగ్గు పడిన రామ

  జానకి మాటలకి సిగ్గు పడిన రామ

  ఇక అదే సమయంలో ఒక వ్యక్తి వచ్చి మొన్న లడ్డులు ఆర్డర్ ఇచ్చాను అని మల్లికతో చెప్పినట్లుగా చెబుతాడు. అయితే మల్లిక ఇంట్లో ఎవరికీ చెప్పకపోవడంతో ఎవరు కూడా లడ్డూలను ప్రిపేర్ చేసి ఉంచరు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జ్ఞానాంబ ఇప్పుడు ఏమని సమాధానం చెప్పాలని అంటుంది. ఇక వెంటనే జానకి రంగంలోకి దిగి ఆ లడ్డులను రేపు ఉదయం కల్లా పంపిస్తామని చెబుతుంది. అయితే జానకికి మరోవైపు చదువుకు సంబంధించిన అసైన్మెంట్ కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే వారసుడిని ఇవ్వాల్సిన బాధ్యతను కూడా భర్తతో సిగ్గు పడుతూ గుర్తు చేస్తుంది. మరి ఈ తరుణంలో జానకి ఆ బాధ్యతలను ఎలా పూర్తి చేస్తుంది. అత్తగారి మనసును ఎలా గెలుస్తుందో తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 333
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X