Janaki Kalaganaledu june 29th Episode: రామతో ఒట్టేసుకొన్న జ్ఞానాంబ.. కోడలు మల్లిక డ్రామాలకు చెక్
జానకి కలగనలేదు తాజా ఎపిసోడ్‌లో బర్త్ డే కోసం ఏర్పాట్లు చేసిన జానకి, రామకు జ్ఞానాంబ షాకిచ్చింది. ఎంతో ప్రేమగా, సంతోషంగా రామ, జానకి చేసిన పనికి నొచ్చుకొని ఆమె సీరియస్ అయింది. దాంతో జానకి, రామ ఇద్దరు కాస్త కంగారు పడ్డారు. తాను ఎందుకు ఇలాంటి ప్లాన్ చేయలేదా అంటూ మదనపడి పోయిన మల్లికకు జ్ఞానాంబ కోపానికి దిమ్మతిరిగినంత పనైంది. ఈ క్రమంలో జ్ఞానాంబ, రామ మధ్య ఎపిసోడ్ 72లో చోటుచేసుకొన్న విషయాలు ఏమిటంటే..

తల్లి జ్ఞానాంబ బాధపడటంతో
తల్లి జ్ఞానాంబ తనపై కోపగించుకోవడంపై పెద్దగా బాధపడని రామ.. తన గురించి ఆలోచిస్తూ.. కంటతడి పెట్టుకోవడం ఆవేదనకు గురిచేసింది. తన తల్లిని బాధపెట్టినందుకు తనలో తాను మదనపడిపోయాడు. అదే విషయాన్ని జానకితో పంచుకొన్నాడు. తన తల్లి వద్దకు వెళ్లి క్షమాపణ కోరి.. ఇక ఎన్నడూ ఏడవద్దని కోరేందుకు హాల్‌లోకి రామ వచ్చాడు. ఆ సమయంలో బర్త్ డే కేక్‌కు దగ్గర్లో జ్ఞానాంబ ఏడుస్తూ కూర్చోవడం చూసి మరింత బాధకు గురయ్యాడు.

జ్ఞానాంబ ఒడిలో తలపెట్టుకొని రామ..
తల్లి జ్ఞానాంబ వద్దకు రామ వెళ్లి బాధపెట్టినందుకు క్షమించమని అడిగాడు. నీవు కోపగించుకొన్నా నాకు కష్టం కాదు అమ్మ.. కానీ నీవు కంటతడి పెడితే తట్టుకోలేను అంటూ తల్లి ఒడిలో తల పెట్టుకొని బాధపడ్డాడు. నీవు కంటతడి పెడితే చూడలేను. చనిపోయేటప్పుడు బాధ ఎలా ఉంటుందో తెలియదు. కానీ దాని కంటే ఎక్కువ బాధగా ఉంది అంటూ రామ ఆవేదన చెందాడు. దాంతో జ్ఞానాంబ కళ్లతడిని తుడుచుకొని రామపై ప్రేమను కురిపించింది.

ఒట్టేపించుకొన్న జ్ఞానాంబ
ఇక నుంచి జానకికి ఇబ్బంది పెట్టే పని చేయకుండా నన్ను సంతోష పెట్టాలి అంటూ రామకు జ్ఞానాంబ సూచించింది. జానకిని కష్టపెట్టనని.. తన సంతోషంగా ఉంచాలని తన చేతిలో ఒట్టేసి చెప్పాలని రామను అడిగింది. దాంతో రామ తన తల్లి చేతిలో చేతి వేసి సరేనని రామ ఒట్టేసాడు. అనంతరం నీకు హ్యాపీగా ఉండే పని చేస్తాను పద అంటూ రామను కేక్ వద్దకు తీసుకెళ్లింది. నీవు సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి అని జ్ఞానాంబ అడిగితే.. కేక్ కట్ చేయమని చెప్పి.. క్యాండిల్ వెలిగించి తల్లి చేత్తో కేక్ కట్ చేయించాడు.

మల్లిక డ్రామాలకు జ్ఞానాంబ..
ఇక జానకి, రామను ఇద్దరిని ఒంటరిగా ఇంట్లో ఉంచి పక్క గ్రామానికి వెళ్లి ఆలయంలో నిద్ర చేయడానికి జ్ఞానాంబ తన కుటుంబ సభ్యులతో బయలుదేరడానికి సిద్ధమైంది. అయితే జానకికి ప్రైవసీ ఇవ్వడానికి తమను పక్కగ్రామానికి తీసుకెళ్లడం ఇష్టం లేని మల్లిక డ్రామా ఆడింది.
తలనొప్పిగా ఉందంటూ నేను రాలేను అంటూ నాటకాలు ఆడటం పసిగట్టిన జ్ఞానాంబ టాబ్లెట్లు తీసుకురమ్మని చెప్పింది. అయితే టాబ్లెట్లు అవసరం లేదు.. విశ్రాంతి తీసుకొంటే సరిపోతుందని చెబితే.. సరే మీ ఇంట్లో వదిలేస్తాను.. అక్కడ విశ్రాంతి తీసుకో అంటూ జ్ఞానాంబ అనగానే.. పర్వాలేదు.. మీతోనే నేను వస్తాను.. అక్కడే విశ్రాంతి తీసుకొంటాను అని మల్లిక కారు ఎక్కడానికి సిద్దమైంది.

జానకి తలపై ముద్దుపెట్టి
జ్ఞానాంబ, తన కుటుంబ సభ్యులకు వీడ్కోలు చెప్పడానికి జానకి, రామ ఇద్దరు కారు వద్దకు వచ్చారు. దాంతో రామ నీవు ఈ రోజు ఇంట్లోనే ఉండు.. ఎక్కడికి వెళ్లకు అని చెబితే.. ఇంట్లో ఉంటే ఎలా.. అలా అంటూ అని ఏదో చెప్పేలోగా ఆ మాటలకు జ్ఞానాంబ అడ్డుపడింది. వారిద్దరిని కౌగిలించుకొని తలపై ముద్దుపెట్టి ప్రేమను కురిపించింది.
Photo courtesy: Star Maa and Disney+Hotstar


Click it and Unblock the Notifications











