Janaki Kalaganaledu June 2nd Episode: బెడిసికొట్టిన సునందదేవి ప్లాన్.. జ్ఞానాంబ పెట్టిన కండిషన్‌కు షాక్!
జానకి కలగనలేదు సీరియల్ మేకర్స్ కలర్ఫుల్ ఎమోషన్స్ తో ప్రేక్షకుల సంఖ్యను మరింత పెంచుకుంటున్నారు. సీరియల్ అసలు కథ కూడా జనాలకు తొందరగానే ఎక్కేసింది. రోజురోజుకు అంచనాల డోస్ ను పెంచేస్తోంది. ఇక బుధవారం జానకికి సంబంధించిన సీన్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. గత వారం కంటే ఈ వారం మరింత ఆసక్తికరంగా చేంజ్ అవుతోంది.
శివగామి రేంజ్ లో రాశి పాత్ర హైలెట్ అవుతోంది. అందమైన ప్రేమ మధ్యలో భార్య జానకి ఆశయం, భర్త రామచంద్ర అమాయకత్వ ప్రేమ, అత్త జ్ఞానాంబ కట్టుబాట్లు ఆప్యాయత.. ఈ సిరియల్ లో ప్రధాన అంశాలు. ఇక ఈ రోజు ప్రసారం కాబోయే 53వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

రామచంద్ర ప్లాన్
అందరికి టీ తేవాలని మామగారు చెప్పడంతో.. ఎలా తయారు చేయాలో తెలియని జానకి ఒకేసారి టీ పొడి పోసేస్తుంది. అనంతరం ఆ టీ తాగిన అందరూ షాక్ అవుతారు. మోహల్లో హావభావాలు చూసిన జానకి కంగారుపడుతుంది. టీ చాలా దారుణంగా ఉన్నట్లు రామచంద్రకు అర్థమయ్యి జ్ఞానాంబ తాగకూడదని ప్లాన్ వేస్తాడు.

జానకి ముందు నిజం ఒప్పుకున్న రామచంద్ర
జ్ఞానాంబ తాగే సమయంలో సడన్ గా రామచంద్ర కడుపు నొప్పి అని చెబుతాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. అయితే కాంగరు పడాల్సిన అవసరం లేదని చెప్పిన రామచంద్ర జానకిని కాపాడేందుకు జ్ఞానాంబకు ముఖ్యమైన పని గురించి గుర్తు చేసి అక్కడి నుంచి వెళ్లిపోయేలా చేస్తాడు. అనంతరం జానకితో ఒంటరిగా మాట్లాడిన రామచంద్ర ఆమె ముందు నిజంగానే కాఫీ బాగాలేదని ఒప్పుకుంటాడు.

శ్రావణి నుంచి ఫోన్ కాల్
రామచంద్ర, జానకి ఒంటరిగా మాట్లాడుకుంటున్న తరుణంలో స్నేహితురాలు శ్రావణి నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఆపదలో ఉన్నాను అంటూ తొందరగా మీ ఊర్లో ఉన్న మామిడి తోటకు రావాలని చెనుతుంది. కౌన్సిలర్ సునందదేవి ఆ స్కెచ్ వేసినట్లు తెలియని జానకి భర్తతో కలిసి మామిడి తోటకు పయణమవుతుంది.

సునందదేవి ప్లాన్ క్యాన్సిల్
ఇక మామిడితోటలో ఉన్న సునందదేవి, కొడుకుతో కలిసి ఎలాగైనా జానకిపై పగ తీర్చుకోవాలని అనుకుంటుంది. కానీ అప్పుడే జ్ఞానాంబ తన ఇంటికి వచ్చినట్లు తెలుసుకున్న సునంద ఎందుకు వచ్చిందో అని కంగారుపడుతుంది. ఇప్పుడు జానకిని కలవడం అంత మంచిది కాదని వెంటనే తోట నుంచి కొడుకుని తీసుకొని వెళ్లిపోతుంది. ఇక శ్రావణి అక్కడ లేదని జానకి కూడా వెళ్లిపోతుంది.

జ్ఞానాంబ కండిషన్
అప్పటికే జ్ఞానాంబతో పాటు వైజయంతి కూడా సునందదేవి ఇంట్లో ఉంటుంది. సునంద ఇంటికి రాగానే ఇద్దరు రావడానికి గల కారణంపై ఆరా తీస్తుంది. మరోసారి తన వెనకున్న ఐదు వేల ఓట్లు నీకే అంటూ సునందదేవికి మాట ఇచ్చిన జ్ఞానాంబ ఒక కండిషన్ కూడా పెడుతుంది. ఈసారి ఊర్లో జరిగే జాతరలో నా కోడలు జానకి, కొడుకు రామచంద్రల చేత మొదటి పూజా చేయించాలని చెబుతుంది.
Recommended Video

ఓట్లు పడకపోతే మీరు గెలవరు..
అందుకు సునందదేవి కొడుకు కన్నబాబు ఒప్పుకోడు. ఎన్నో ఏళ్లుగా మొదటి పూజ చేయించడం మా ఆచారం అంటూ కౌంటర్ ఇస్తాడు. పరువు మరియద పోతుందని కూడా చెప్పడంతో జ్ఞానాంబ తన వెనకున్న ఓట్ల విషయాన్ని గుర్తు చేస్తుంది. మా ఓట్లు పడకపోతే మీరు గెలవరని అప్పుడు ఉన్న మరియాద కూడా పోతుందని అంటుంది.
దీంతో సునంద ఆలోచనలో పడుతుంది. మరి వాళ్ళు జ్ఞానాంబ డిమాండ్ కు ఒప్పుకుంటారో లేదో తెలియాలి అంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











