Janaki Kalaganaledu June 2nd: జ్ఞానాంబను ఒప్పించిన భర్త.. జానకి ముందు మరో ఛాలెంజ్!

జానకి కలగనలేదు సీరియల్ మరో ఆసక్తికరమైన అంశంతో ప్రేక్షకుల్లో మంచి ఆదరణను పెంచుకుంటోంది. సీనియర్ నటి రాశి అత్త పాత్రలో జ్ఞానాంబగా చాలా మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక ఈ సీరియల్ లో అత్తకు ఇష్టం లేకపోయినా కోడలు ఐపీఎస్ చదువును కొనసాగించాలని అనుకుంటుంది. ఆ కథాంశంతో కొనసాగుతున్న ఈ సీరియల్ లో జానకి రామచంద్ర మధ్య అందమైన ప్రేమ కథ కూడా ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక జానకి ఎలాగైనా రామచంద్రను చెఫ్ కాంపిటీషన్ లో గెలిపించేలా చేయాలని అందరూ తన భర్తను గౌరవించే స్థాయికి తీసుకు రావాలని అనుకుంటుంది. మరోవైపు రామచంద్ర కూడా జానకి ఐపీఎస్ చదువును పూర్తి చేసేందుకు సహకారం అందిస్తాడు. అయితే జానకి చదువు కోసమే రామచంద్ర కన్నబాబు దగ్గర లక్ష రూపాయలు అప్పు చేస్తాడు. ఇక అతను తన తెలివితో స్వీట్ షాప్ ను దక్కించుకునే విధంగా రామచంద్ర దగ్గర సంతకాలు కూడా పెట్టించుకుంటాడు. మరోవైపు చిన్న కోడలు మల్లిక కారణంగా కూడా జానకికి సమస్యలు ఎదురవుతాయి. ఇలా ఎన్నో ఆసక్తికరమైన అంశాలతో ఈ సీరియల్ ప్రేక్షకులలో ఆదరణను పెంచుకుంటోంది. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 6.70 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 314వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..

తండ్రి సలహాతో..

తండ్రి సలహాతో..


రామచంద్ర ను అందరూ అవమానిస్తూ ఉండటంతో అతన్ని ఎలాగైనా వంటల పోటీలలో పాల్గొనేలా చేసే గెలిపించాలని జానకి ఆలోచిస్తూ ఉంటుంది. అందుకోసం హైదరాబాద్ వెళ్లడానికి అన్ని ఏర్పాట్లను కూడా చేసుకుంటుంది. అయితే రామచంద్ర మాత్రం హైదరాబాద్ వెళ్లడానికి అతని తల్లి ఏమాత్రం ఒప్పుకోదు. ముందుగానే ఆ విషయంలో జానకిని హెచ్చరిస్తుంది తన కొడుకు అక్కడ ఓడిపోయాడు అంటే ఎంతగానో బాధ పడతాడని అతనికి లోకజ్ఞానం తెలియదు అని ఆలోచిస్తుంది.

జానకి ఎంత చెప్పినా..

జానకి ఎంత చెప్పినా..

కానీ అలా ఏమీ జరగదు అని జానకి చాలాసార్లు చెప్పడానికి ప్రయత్నిస్తోంది. ఇక లాభం లేకపోవడంతో రామచంద్ర తండ్రి గోవిందరాజులు కలగజేసుకుని మీ అమ్మకు తెలియకుండానే హైదరాబాద్ వెళ్లిపోండి అని అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తాడు. హైదరాబాద్ వెళుతున్నాను అని చెప్పకుండా కేవలం పెళ్లి కోసం వైజాగ్ వెళ్తున్నాము అని చెప్పాలి అనే గోవిందరాజులు వారికి సలహా ఇస్తాడు.

మల్లిక ప్లాన్ ఫ్లాప్

మల్లిక ప్లాన్ ఫ్లాప్


అన్ని అనుకున్నట్లుగానే జరుగుతూ ఉండడంతో చిన్న కోడలు మల్లిక మాత్రం వారిని అడ్డుకోవాలనే అనుకుంటుంది. జానకి రామచంద్రలను వెళ్లకుండా చేసి నేను నా భర్త వైజాగ్లో ఎంజాయ్ చేయాలి అని ఆలోచిస్తుంది. అందుకోసం వారు వంటల పోటీ లకు వెళుతున్నారని మధ్యలో జ్ఞానాంబ ముందు బుక్ చెప్పినప్పటికీ కూడా ఆ ప్లాన్ వర్కవుట్ కాదు. గోవిందరాజులు ముందుగానే వైజాగ్ కు సంబంధించిన బస్ టికెట్స్ కూడా తీయడంతో మల్లిక మాటలు జ్ఞానాంబ ఏ మాత్రం నమోదు.

 అనారోగ్యంతో జ్ఞానాంబ

అనారోగ్యంతో జ్ఞానాంబ


ఇక రామచంద్ర జానకిలను అడ్డుకోవడానికి ఒకే ఒక్క దారి అనే జ్ఞానాంబను మంచానపడేలా చేయాలి అని మల్లిక మరో ప్లాన్ వేస్తుంది. అందుకోసం ఆమె బలం టాబ్లెట్లను మార్చేసి అక్కడ బిపి టాబ్లెట్స్ పెట్టడంతో తెలియకుండానే జ్ఞానాంబ ఆ టాబ్లెట్స్ వేసుకుంటుంది. ఇక ఆ టాబ్లెట్స్ కారణంగా స్పృహ కొల్పయిన తల్లిని మన చూసి కొడుకు రామ ఎంతగానో బాధ పడతాడు. ఇక ఈ సమయంలో తల్లిని వదిలేసి వెళ్ళడం కరెక్ట్ కాదని కూడా అనుకుంటారు. అయితే డాక్టర్ మాత్రం ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉన్నారు అని ఎలాంటి ప్రమాదం లేదు అని భరోసా ఇస్తారు.

అర్థమయ్యేలా చెప్పిన గోవిందరాజులు

అర్థమయ్యేలా చెప్పిన గోవిందరాజులు

దీంతో గోవిందరాజులు హైదరాబాద్ వెళ్ళేడానికి ఒకసారి మీ అమ్మని అడిగి చూద్దాం అర్థం చేసుకుంటుంది అని అంటాడు. ఇక గోవిందరాజులు తన భార్య జ్ఞానాంబకు అసలు విషయం చెప్పే ప్రయత్నం చేస్తాడు. అసలు జానకి రామచంద్ర నీ అనుమతి లేకుండా హైదరాబాద్ వెళ్ళకూడదు అని అనుకున్నారు. కానీ నేనే నా మీద ఒట్టు పెట్టుకుని వెళ్లమని చెప్పాను. ఎందుకంటే నా కారణంగా చిన్నప్పుడు రామచంద్ర తన చదువును వదిలేశాడు నా ఆరోగ్యం కోసం ఇంటి బాధ్యతలు తీసుకున్నాడు. కాబట్టి అతన్ని అందరూ కూడా చదువు లేని వాడు అని నిందిస్తూ ఉంటే తట్టుకోలేక పోయాను. అందుకే ఇప్పుడు రామచంద్ర ఈ వంటల పోటీలలో గెలిస్తే తప్పకుండా అతన్ని అవమానపరిచిన వారిరు కూడా కలిసి ఫోటోలు దిగుతారు. దేశవ్యాప్తంగా గుర్తింపు వస్తుందని గోవిందరాజులు తన భార్యకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు.

భయం అవసరం లేదు..

భయం అవసరం లేదు..

అయితే తన కొడుకు అక్కడ ఓడిపోతే బాధపడతాడు అని భయంతోనే వద్దని అంటున్నాను అని జ్ఞానాంబ చెబుతోంది. కానీ ఎలాంటి భయం అవసరం లేదు అని ఒకవేళ నా భర్త ఓడిపోతే నా మొహం కూడా మీకు చూపించను అని జానకి ధైర్యంగా చెబుతుంది. ఇక ఇద్దరూ కలిసి తల్లి ఆశీర్వాదంతో హైదరాబాద్ వెళ్లడానికి సిద్ధమవుతారు. మరోవైపు మల్లిక మాత్రం తన ప్లాన్ మొత్తం వృధా అయ్యిందని షాక్ అవుతుంది. మరి రామచంద్ర అనుకున్నట్లుగానే హైదరాబాద్ వెళ్లి వంటల పోటీల్లో గెలుస్తాడో లేదో తదుపరి ఎపిసోడ్స్ లో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X