Janaki Kalaganaledu June 30th Episode: మొత్తానికి కాలు జారిన జానకి.. కిస్ కోసం రామ టెంప్ట్!
జానకి కలగనలేదు సిరియల్ మరింత ఆసక్తికరంగా మారుతోంది. సీనియర్ నటి రాశి రీ ఎంట్రీ ఇమేజ్ ఈ సీరియల్ కు చాలా బాగా హెల్ప్ అయ్యింది. అత్తా కోడళ్ల మధ్య రొటీన్ కొట్లాటలు కాకుండా ఎన్నో విభిన్నమైన లవ్ సీన్స్ ను జత చేయడం అందరిని ఆకట్టుకుంటోంది. రామ, జానకి మధ్యలో సాగే క్యూట్ రొమాన్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
మరోవైపు మల్లిక కుట్రలు సరికొత్త విలనిజాన్ని చూపిస్తున్నాయి. జ్ఞానాంబ కోపానికి కూడా హద్దులు లేకుండా పోతున్నాయి. అందమైన ప్రేమ మధ్యలో భర్త అమాయకత్వ ప్రేమలో జానకి ఆశయం, అత్త జ్ఞానాంబ కట్టుబాట్లు.. ఈ సిరియల్ లో హైలెట్ పాయింట్స్. నేడు ప్రసారం కాబోయే 73వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

ఆప్యాయంగా హద్దుకున్న జ్ఞానాంబ
జానకి, రామచంద్ర లకు తొందరగా పిల్లలు కలగాలని సరికొత్త ఆలోచించిన జ్ఞానాంబ కుటుంబ సభ్యులతో కలిసి గుడికి వెళ్లాలని అనుకుంటుంది. గుడిలో పూజ చేయడమే కాకుండా జానకి, రామ ఇద్దరు ఇంట్లో సరదాగా గడపాలని అనుకుంటుంది. గుడికి వెళ్ళేముందు జ్ఞానాంబ జానకి, రామ ఇద్దరిని ఆప్యాయంగా హద్దుకుంటుంది.

బయటే స్నానం చేసిన రామ
ఇక ఎవరు ఇంట్లో లేకపోవడంతో రామ పెరట్లో స్నానం చేస్తుంటాడు. ఇక ఇంతలో అక్కడికి వచ్చిన జానకి బాత్రూమ్ లో స్నానం చేయకుండా ఇలా బయట చేస్తారేమిటి అంటూ సిగ్గుపడుతూ అడుగుతుంది. తనకు బయట చేయడం ఇష్టమని చెప్పిమ రామ అనుకోకుండా చేతుల్లో నుంచి సబ్బును జారవిడుస్తాడు.

మొత్తానికి కాలు జారిన జానకి
ఇక ఆ సబ్బు ఇవ్వాలని జానకిని అడిగి తీసుకునే ప్రయత్నం చేస్తాడు. దీంతో సబ్బు ఇవ్వాలని ఒక అడుగు ముందుకు వేసిన జానకి కింద ఉన్న సబ్బు నీళ్ళకి కాలు జారీ రామ మీద పడబోతుంది. ఇక రామ జాగ్రత్తగా పట్టుకున్నప్పటికి చేతికి ఉన్న సబ్బు నురగ వల్ల జానకి కూడా జారిపోతుంది. వెంటనే నీటిలో ఉన్న తొట్టిలో పడిపోతుంది.

కిస్ చేయాలనుకొని
ఇక చివరికి రామ, జానకిని పైకి లేపగా ఆమె సడన్ గా ఆమె గుండెలకు హద్దుకుంటుంది. తడిసిన బట్టలతో భార్యని అలా చూసిన రామ కిస్ చేయాలని అనుకుంటాడు. కానీ జానకి నెట్టేసి ముందుకి వెళుతుంది. కొంచెం దూరం వెళ్ళాక తిరిగి చూసి సిగ్గుపడుతూ స్మైల్ ఇస్తుంది. ఆ తరువాత కూడా జుట్టు అరబెట్టే సమయంలో కూడా రామ జానకికి సహాయం చేయలనుకొని రొమాంటిక్ టచ్ ఇస్తాడు.

జ్ఞానాంబ కఠోర మొక్కు
ఇక మరోవైపు జ్ఞానాంబ ఆలయం మెట్లకు బొట్టు పెట్టాలని అనుకుంటుంది. చాలా మెట్లు ఉండడంతో కూతురు వెన్నెల సహాయం చేయాలని అనుకుంటుంది. కానీ జ్ఞానాంబ మాత్రం అందుకు ఒప్పుకోదు. రామ, జానకి పిల్లలు కలగాలని తాను మాత్రమే మొక్కుకున్నాను అని జ్ఞానాంబ వివరణ ఇస్తుంది. మరోవైపు మల్లిక మాత్రం ఎప్పటిలానే కుళ్ళుతో మాట్లాడుకుంటూ ఉంటుంది.
Recommended Video

జానకి ఆశయాన్ని మర్చిపోతుందా?
ఇక రామ కొట్టుకి వెళ్లకుండా బార్యతోనే ఇంట్లో ఉంటాడు. తల్లి ఫొటోకు దుమ్ము పట్టడం చూసి వెంటనే శుభ్రం చేస్తుంటాడు. జానకి చూసి కాస్త ఆశ్చర్యపోగా నేను ఇంతే అంటూ మా అమ్మ కూచిని అని ఆన్సర్ ఇస్తాడు. అలాగే భార్యకు గోరు ముద్దలు తినిపించే ప్రయత్నం కూడా చేస్తాడు.
మరి జ్ఞానాంబ అనుకున్నట్లుగా జానకి తన ఐఎఎస్ చదవాలన్న ఆశయాన్ని పక్కనపెట్టి పిల్లల్ని కనడానికి ఒప్పుకుంటుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











