For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu June 30th: జానకి రొమాన్స్, రామచంద్ర సిగ్గు.. తట్టుకోలేకపోయిన మల్లిక

  |

  జానకి కలగనలేదు మరో ఆసక్తికరమైన అంశంతో ముందుకు సాగుతోంది. ఈ సీరియల్ పై మొదట అంతగా పాజిటివ్ టాక్ ఏమి రాలేదు. కానీ అసలైన డ్రామా మొదలైన అనంతరం వీక్షకుల సంఖ్యను పెంచుకుంటోంది. అంతే కాకుండా ఇటీవల కాలంలో వచ్చిన టాప్ సీరియల్స్ తో పోటీ పడుతూ జానకి కలగనలేదు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతోంది. ఇక రామచంద్ర, కన్నబాబు నుంచి కూడా స్వీట్ షాప్ ను దక్కించుకుంటాడు. ఇక జానకి ప్రాణాలకు తెగించి జ్ఞానాంబ కుటుంబ సభ్యులను కాపాడుకుంటుంది. అలాగే ఆమె ఐపీఎస్ చదువును కొనసాగించాలని అనుకుంటుంది. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 6.70 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 334 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..

  బాధను తట్టుకోలేక మాట ఇవ్వమన్న జ్ఞానాంబ

  బాధను తట్టుకోలేక మాట ఇవ్వమన్న జ్ఞానాంబ

  జ్ఞానాంబ మనవడు మనవరాళ్లతో ఆడుకోవాలి అని అలాగే తన ఇంట్లో కూడా బారసాల వేడుకకు అందరిని పిలవాలని ఎంతో ఆశపడుతుంది. అయితే కోడళ్లు ఇద్దరు మాత్రం వారి వ్యక్తిగత విషయాలు కారణంగా అప్పుడే పిల్లలను కనకూకూడదు అని అనుకుంటారు. కానీ బయటకు ఎలాంటి వేడుకలకు వెళ్ళినా కూడా జ్ఞానాంబకు అదే ప్రశ్న ఎదురవుతుంది. మీ ఇంట్లో బారసాలకు మమ్మల్ని ఎప్పుడూ పిలుస్తావు అంటూ పదేపదే అడుగుతూ ఉంటారు. మరి కొందరు సూటిపోటి మాటలతో కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇక ఫైనల్ గా జ్ఞానాంబ తన ఇద్దరి కోడళ్లను ఒక మాట అడుగుతుంది. ఏడాది తిరిగే సరికల్లా ఇంట్లో బాబూ లేదా పాప ఉండాలి అని ఇంటికి వారసుడుని కూడా ఇవ్వాలి అని అడుగుతుంది.

  మాట ఇచ్చిన పెద్ద కోడలు

  మాట ఇచ్చిన పెద్ద కోడలు

  అయితే జ్ఞానాంబ మాటలకు చిన్న కోడలు మల్లిక కాస్త వెనుకడుగు వేసినప్పటికీ కూడా పెద్ద కోడలు జానకి మాత్రం మాట ఇవ్వడానికి ఏమాత్రం వెనకడుగు వేయదు. మీకు తప్పకుండా వారసుడిని ఇస్తాను అంటూ చేతిలో చేయి వేసి చెబుతుంది. అయితే జానకి ఆ మాట ఇవ్వగానే ఆమె భర్త రామచంద్ర ఒక్కసారిగా కంగారు పడతాడు. ఐపిఎస్ చదువుకోవాలని ఎన్నో కలలు కన్నా జానకి ఇప్పుడు మాట ఇవ్వడం ఏమిటి అని అతను ఆశ్చర్యపోతాడు. అదే విషయాన్ని తన గదిలోకి తీసుకువెళ్లి అడుగుతాడు. అయితే ముందుగా ఇంటి కోడలిగా నా బాధ్యతను పూర్తి చేయాల్సిన అవసరం ఉంది అని అలాగే ఐపీఎస్ చదువును కూడా కొనసాగిస్తాను అని చెబుతోంది.

  జానకి, రామ రొమాన్స్

  జానకి, రామ రొమాన్స్


  దీంతో రామచంద్ర రెండు పనులు ఒకేసారి చేయడం అంతా సాధారణం కాదు అని ఈ విషయంలో తొందర పడ్డారు అని అన్నప్పటికీ కూడా జానకి అతన్ని ఒప్పిస్తుంది. అంతేకాకుండా వారసుడిని ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది అంటూ రామచంద్ర తో రొమాంటిక్ గా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఇక రామచంద్ర ఆమెను దగ్గరికి తీసుకునెందుకు ప్రయత్నించి మళ్లీ ఒక్కసారిగా సిగ్గుపడుతూ బయటకు వెళ్ళిపోతాడు.

  మల్లిక పొరపాటు

  మల్లిక పొరపాటు

  అయితే మల్లిక చేసిన పొరపాటు కారణంగా ఇంట్లో అందరికీ పెద్ద పని చేయాల్సి వస్తుంది. జ్ఞానాంబ రామచంద్ర అందరు కూడా హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి లడ్డూలు కావాలని ఆర్డర్ ఇచ్చి వెళ్తాడు. ఇక ఆ విషయాన్ని మర్చిపోయిన మల్లిక ఎవరికి చెప్పదు. దీంతో ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి మరుసటి రోజే లడ్డులు కావాలి అని అనడంతో అందరూ ఒక్కసారి ఆశ్చర్యపోతారు. ఇక జానకి తప్పకుండా అందరం కలిసి పనిచేస్తే ఉదయం కల్లా లడ్డూలు ఆర్డర్ ఇవ్వవచ్చు అని చెబుతుంది. ఇక అందుకు తగ్గట్లుగానే రామచంద్ర ప్లాన్ చేస్తాడు.

   వేగంగా లడ్డులు సిద్ధం చేసిన జానకి

  వేగంగా లడ్డులు సిద్ధం చేసిన జానకి


  అయితే మరోవైపు జానకి కూడా తన ఐపీఎస్ చదువుకు సంబంధించిన ఒక అసైన్మెంట్ పూర్తి చేయాల్సి ఉంటుంది. దీంతో రామచంద్ర మీరు లడ్డూలు చేయకండి అంటూ నేను చేస్తాను అని అంటాడు. కానీ జానకి మీరు ఒక్కరే చేస్తే ఆలస్యం అవుతుంది కాబట్టి నేను కూడా సహాయం చేస్తానని చాలా తొందరగా పూర్తి చేస్తారు. అయితే మల్లిక మాత్రం మొదట కాస్త నెమ్మదిగా పని చేసినప్పటికీ జానకి అలాగే గోవిందరాజులు కూడా ఆమెను రెచ్చగొట్టడంతో త్వరత్వరగా పూర్తి చేస్తుంది. అయితే మల్లికా ఎంత కష్టపడినప్పటికీ కూడా జానకి ఫాస్ట్ గా లడ్డూలను రెడీ చేస్తుంది.

  Recommended Video

  YS Jagan పదవుల పంపకం... బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి కీలక పదవి *Politics | Telugu Oneindia
  తట్టుకోలేకపోయిన మల్లిక

  తట్టుకోలేకపోయిన మల్లిక


  ఇక ఆ విషయంలో జ్ఞానాంబ మరోసారి జానకిని ఎంతగానో మెచ్చుకుంటుంది. ఆమెను చూసి పని నేర్చుకోవాలి అని మల్లికకు మరొకసారి బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇక జానకిని పొగుడుతూ తనను తిట్టడం మల్లికకు ఏమాత్రం నచ్చదు. ఎలాగైనా మరోసారి జానకిని జ్ఞానాంబతో తిట్టించాలి అని గొడవలు కూడా పెట్టాలి అని మల్లికా ఆలోచిస్తుంది. మరి ఈ ప్రయత్నంలో మల్లిక ఎలాంటి ఇబ్బందులు క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇక మరోవైపు జానకి తన చదువును ఎలా పూర్తి చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. చదువుకున్న కోడలు అంటేనే ఇష్టపడని జ్ఞానాంబ, జానకి ఐపీఎస్ చదువు గురించి తెలిసిన తరువాత ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Serial June 30th Episode 334
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X