Janaki Kalaganaledu June 3rd Episode: అర్ధరాత్రి కిచెన్‌లో జానకి అందానికి టెంప్ట్ అయిన రామ.. జ్ఞానాంబ చూడడంతో.

స్టార్ మా డైలీ సీరియల్స్ లలో జానకి కలగనలేదు రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. అత్తా కోడళ్ల కాన్సెప్ట్ అయినప్పటికీ రొటీన్ గా గొడవలు, గోలలు ఉండకుండా మేకర్స్ కలర్ఫుల్ ఎమోషన్స్ తో ప్రేక్షకుల మనసును దోచేసుకుంటున్నారు. యంగ్ అడియెన్స్ కు నచ్చే విధంగా క్యూట్ రొమాంటిక్ సీన్స్ ను కూడా బాగానే హైలెట్ చేస్తున్నారు. అందమైన ప్రేమ మధ్యలో భార్య జానకి ఆశయం, భర్త రామచంద్ర అమాయకత్వ ప్రేమ, అత్త జ్ఞానాంబ కట్టుబాట్లు ఆప్యాయత.. ఈ సిరియల్ లో ప్రధాన అంశాలు. ఇక ఈ రోజు ప్రసారం కాబోయే 54వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

ఐదు వేల ఓట్లు నీకే అంటూ..

ఐదు వేల ఓట్లు నీకే అంటూ..

జానకిపై పగ తీర్చుకోవాలని అనుకున్న వైజయంతికి అనుకోకుండా వచ్చిన జ్ఞానాంబ ఫోన్ కాల్ తో ఆలోచన మొత్తం మారిపోతుంది. వైజయంతిని కలిసేందుకు జ్ఞానాంబ, సునందదేవి ఆమె ఇంటికి వస్తారు. ఇంటికి రాగానే ఇద్దరు రావడానికి గల కారణంపై సునంద ఆరా తీస్తుంది. మరోసారి తన వెనకున్న ఐదు వేల ఓట్లు నీకే అంటూ సునందదేవికి మాట ఇచ్చిన జ్ఞానాంబ ఒక కండిషన్ కూడా పెడుతుంది. ఈసారి ఊర్లో జరిగే జాతరలో నా కోడలు జానకి, కొడుకు రామచంద్రల చేత మొదటి పూజా చేయించాలని చెబుతుంది.

మాట ఇచ్చిన సునందదేవి

మాట ఇచ్చిన సునందదేవి

అందుకు సునందదేవి కొడుకు కన్నబాబు ఒప్పుకోడు. ఎన్నో ఏళ్లుగా మొదటి పూజ చేయించడం మా ఆచారం అంటూ కౌంటర్ ఇస్తాడు. పరువు మరియాద పోతుందని కూడా చెప్పడంతో జ్ఞానాంబ తన వెనకున్న ఓట్ల విషయాన్ని గుర్తు చేస్తుంది. మా ఓట్లు పడకపోతే మీరు గెలవరని అప్పుడు ఉన్న మరియాద కూడా పోతుందని చెప్పడంతో సునంద ఒప్పుకోక తప్పదు. కన్నబాబు మాటలు పట్టించుకోవద్దని మీరు చెప్పినట్లుగానే పూజ చేయిస్తామని సునందదేవి మాట ఇచ్చేస్తుంది. కానీ గెలిచిన తరువాత జ్ఞానాంబను ఎక్కడో తొక్కలో అక్కడ తొక్కడం కాయమని చాలెంజ్ చేస్తుంది.

మరో తప్పు తప్పకుండా చేస్తాను

మరో తప్పు తప్పకుండా చేస్తాను

ఇక మరోవైపు చిన్నకొడలు మల్లికను తప్పు చేయవద్దని తల్లి ఫోన్ లో ఎన్ని బుద్దులు చెప్పినా కూడా పట్టించుకోదు. పనిమనిషి వచ్చి అది సాధ్యమయ్యే పనేనా అంటూ సెటైర్ వేస్తుంది. అయినా కూడా మల్లిక ఏ మాత్రం తగ్గకుండా మరో తప్పు తప్పకుండా చేస్తాను అంటూ అప్పుడు జ్ఞానాంబ పెద్ద కోడలిని బయటకు నెట్టివేస్తుందో లేదో చూస్తానని శపథం చేస్తుంది.

అర్ధరాత్రి కిచెన్ లో జానకి - రామ

అర్ధరాత్రి కిచెన్ లో జానకి - రామ

ఇక రామచంద్ర భార్య జానకికి టీ నేర్పించాలని అనుకుంటాడు. అందరూ పడుకున్నాక అర్ధరాత్రి సమయంలో జానకిని లేపి కిచెన్ లోకి తీసుకు వెళతాడు. టీ ఎలా చేయాలో వివరంగా చెబుతుంటాడు. జానకి కూడా ఎంతో ఆసక్తిగా నేర్చుకుంటుంది. అయితే అదే సమయంలో జ్ఞానాంబ నీళ్ల కోసం నిద్ర లేస్తుంది.

టెంప్ట్ అయిన రామ

టెంప్ట్ అయిన రామ

టీ వాసన వస్తోంది ఏమిటని కిచెన్ లోకి నడుచుకుంటూ వస్తున్న జ్ఞానాంబను కొడుకు రామచంద్ర గమనిస్తాడు. వెంటనే జానకితో పాటు టీ ఫ్యాన్ ను కూడా చేతిలో పట్టుకొని ఒక మూల సందులో దాక్కుంటాడు. ఎవరు లేరని జ్ఞానాంబ నీళ్లు తాగేసి మళ్ళీ వెళ్లిపోతుంది. అనంతరం పైకి లేచి క్రమంలో జానకి అందానికి రామ కాస్త టెంప్ట్ అయిన రామ కౌగిలించుకుందామని అనుకుంటాడు.

Recommended Video

Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
జ్ఞానాంబ చూడడంతో

జ్ఞానాంబ చూడడంతో

జానకి కూడా రామ ప్రేమకు దగ్గరవుతున్నట్లు అనిపిస్తుంది. కానీ వెంటనే చేతులను నెట్టివేసి ముందుకు జారుకుంటుంది. ఇక కంగారుపడిన రామచంద్ర ఏమి తెలియనట్టుగా నటిస్తాడు. ఇక ఇద్దరు కలిసి టీ తాగి చాలా బావుందని అనుకుంటారు. ఉదయం అందరికి టీ చేసి పెడతానని అంటుంది. ఇక ఉదయం రామచంద్ర భార్యతో సమయాన్ని గడపడానికి చేతిలో ఎదో పట్టుకొని వస్తాడు. అది గమనించిన జ్ఞానాంబ ఈ టైమ్ లో కొట్టుకు వెళ్లకుండా ఏం చేస్తున్నాడు అని ఆరా తీయడానికి వెళుతుంది.. మరి రామ తల్లికి ఏం సమాధానం చెబుతాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X