Janaki Kalaganaledu June 4th Episode: సునందదేవి కుట్ర గురించి తెలుసుకున్న జనకి.. మరో షాకింగ్ ట్విస్ట్!

జానకి కలగనలేదు డైలీ సీరియల్ రేటింగ్స్ విషయంలో రోజురోజుకు తన సంఖ్యను పెంచుకుంటోంది. అత్తా కోడళ్ల కాన్సెప్ట్ ను రొటీన్ గా కాకుండా కలర్ఫుల్ ఎమోషన్స్ తో ప్రేక్షకును బాగానే ఎట్రాక్ట్ చేస్తున్నారు. క్యూట్, రొమాంటిక్ సీన్స్ ను కూడా బాగానే హైలెట్ చేస్తున్నారు. అందమైన ప్రేమ మధ్యలో భార్య జానకి ఆశయం, భర్త రామచంద్ర అమాయకత్వ ప్రేమ, అత్త జ్ఞానాంబ కట్టుబాట్లు ఆప్యాయత.. ఈ సిరియల్ లో ప్రధాన అంశాలు. ఇక ఈ రోజు ప్రసారం కాబోయే 55వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

జానకిని అమ్మ కోపం నుంచి కాపాడాలని

జానకిని అమ్మ కోపం నుంచి కాపాడాలని

రామచంద్ర, జానకిని అమ్మ కోపం నుంచి కాపాడాలని టీ నేర్పిస్తాడు. అందరూ పడుకున్నాక అర్ధరాత్రి సమయంలో జానకిని లేపి కిచెన్ లోకి తీసుకువెళ్లి.. టీ ఎలా చేయాలో వివరంగా చెబుతుంటాడు. జానకి కూడా ఎంతో ఆసక్తిగా నేర్చుకుంటుంది. మధ్యలో జ్ఞానాంబ నిద్రలేచి వచ్చినప్పటికీ చాకచక్యంగా తప్పించుకుంటారు.

జానకితో తల్లి ప్రేమ గురించి మాట్లాడుతూ

జానకితో తల్లి ప్రేమ గురించి మాట్లాడుతూ

ఇక బెడ్ రూమ్ లో కలిసి టీ తాగిన జానకి, రామ్ అలానే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక భర్త అమాయకత్వ ప్రేమకు జానకి అలానే చూస్తుంటుంది. టీ ఎవరు నేర్పించారని అడిగితే మా అమ్మ నేర్పించిందే అంటూ రామ వినయంతో వివరిస్తాడు. మా అమ్మ ఎంతో కష్టపడి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకువచ్చిందని జానకితో తల్లి ప్రేమ గురించి చెబుతుంటాడు.

ఉదయాన్నే అందరికి టీ ఇచ్చిన జానకి

ఉదయాన్నే అందరికి టీ ఇచ్చిన జానకి

ఇక ఉదయాన్నే జానకి అందరికి టీ తెస్తుంది. ఒక్కొక్కరికి ఇస్తుండగా అందరూ ఇంతకు ముందు ఇచ్చిన టీ గురించి తలచుకుంటూ భయపడుతుంటారు. జ్ఞానాంబ భర్త అయితే నేను టీ తాగడం మానేసానని చెబుతాడు. ఇక ఎలాగైనా జ్ఞానాంబ ఆ టీ తాగి జానకిని ఇంటి నుంచి బయటకు నెట్టివేయాలని మల్లిక కోరుకుంటుంది.

అమృతంలా ఉందని..

అమృతంలా ఉందని..

ఇక ఆ టీని ఎవరు తాగకుండా అలానే చూస్తుండడంతో తాగండి అంటూ జ్ఞానాంబ ఆర్డర్ వేస్తుంది. అయినప్పటికీ అందరూ ఆలోచిస్తూ ఉంటారు. ఇక మొత్తానికి ఆ టీ తాగేసిన జ్ఞానాంబ నిజంగా నువ్వే చేశావా జానకి.. అంటూ అమృతంలా ఉందని పొగుడుతుంది. దీంతో అందరూ ఆశ్చర్యపోయి హ్యాపీగా టీ తాగుతూ ఉంటారు. ఇక రామ చేసినట్లుగానే ఉందని కూడా ప్రశంసలు కురిపిస్తారు.

 జానకిపై జ్ఞానాంబ ప్రేమ..

జానకిపై జ్ఞానాంబ ప్రేమ..

ఇక రామచంద్రను పిలిచి నువ్వు కూడా తాగని జ్ఞానాంబ చెప్పగానే తొందరపాటులో నేను రాత్రి తాగేశానమ్మా అని చెబుతాడు. ఇక వెంటనే జ్ఞానాంబకు అనుమానం రాకముందే రాత్రి జనాకికి తలనొప్పి అనిపించి టీ చేసుకుందని అప్పుడు నాకు కూడా పెట్టించిందని రామ కవర్ చేస్తాడు. తలనొప్పిగా ఉంటే నన్ను అడగచ్చు కధమ్మా అంటూ జ్ఞానాంబ జానకిపై ప్రేమను చూపిస్తుంది.

Recommended Video

Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
 అసలు నిజం తెలుసుకున్న జానకి

అసలు నిజం తెలుసుకున్న జానకి

ఆ తరువాత జానకి బెడ్ రూమ్ లోకి వెళ్లి వెంటనే తన ఫ్రెండ్ శ్రావణికి ఫోన్ చేసి మామిడితోట విషయంపై ఆరా తీస్తుంది. అసలు ఎందుకు రమ్మన్నావు ఏమైంది అని అడగ్గానే శ్రావణి సునంద దేవి రివెంజ్ గురించి చెబుతుంది. దీంతో తల్లి కొడుకులకు బుద్ధి చెబుతాను అంటూ జానకి కోపంతో బయలుదేరుతుంది. మరి జానకి వారికి ఎలాంటి వార్నింగ్ ఇస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X