Janaki Kalaganaledu June 6th: పోటీలో ధైర్యంగా అడుగుపెట్టిన రామ.. మరో టెన్షన్ లో జ్ఞానాంబ!
జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకుల్లో మంచి ఆదరణను పెంచుకుంటోంది. సీనియర్ నటి రాశి జ్ఞానాంబ పాత్రలో చాలా మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక ఆమె కోడలు ఐపీఎస్ చదువును కొనసాగించాలని అనుకుంటుంది. జ్ఞానాంబకు చదువుకున్న కోడలు అంటేనే ఇష్టం ఉండదు. విభిన్నమైన కథాంశంతో కొనసాగుతున్న ఈ సీరియల్ లో జానకి రామచంద్ర మధ్య అందమైన ప్రేమ కథ కూడా ఎంతగానో ఆకట్టుకుంటోంది. జానకి చదువు కోసమే రామచంద్ర కన్నబాబు దగ్గర లక్ష రూపాయలు అప్పు చేస్తాడు. ఇక అతను తన తెలివితో స్వీట్ షాప్ ను దక్కించుకునే విధంగా రామచంద్ర దగ్గర సంతకాలు కూడా పెట్టించుకుంటాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 6.70 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 316వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..

తల్లి ఆందోళన
జరగబోయే ఇంటర్నేషనల్ చెఫ్ కాంపిటీషన్లో ఎలాగైనా రామచంద్రని పాల్గొనేలా చేయాలని జానకి ఎంతగానో ప్రయత్నాలు చేస్తూ ఉండగా అందుకు రామచంద్ర తల్లి జ్ఞానాంబ ఏ మాత్రం ఒప్పుకోదు. అక్కడ చదువుకున్న వాళ్ళు ఎంతోమంది వస్తుంటారు. వాళ్ళందరిలో లో కూడా నా కొడుకు అవమాన పడడం నేను చూడలేను. ఒకవేళ కాంపిటీషన్ లో నా కొడుకు ఓడిపోతే తీవ్ర మనోవేదనకు చెందుతాడు.. అని గతంలో జరిగిన కొన్ని పరిణామాలతో ఆందోళనకు గురి అవుతుంది.

కంగారులో రామచంద్ర
అయితే అలా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదని మీ కొడుకు గెలుస్తాడు అని జానకి కూడా అంటుంది. గోవిందరాజులు కూడా నచ్చజెప్పడంతో తల్లి రామచంద్రను హైదరాబాద్ కాంపిటీషన్ కు పంపేందుకు నిర్ణయం తీసుకుంటుంది. ఇక మొదటి రోజు కాంపిటీషన్ లో అందరూ ఎవరిని వారిని పరిచయం చేసుకుంటున్న సమయంలో రామ కాస్త కంగారు పడతాడు. అందరూ ఇంగ్లీషులో వారి గురించి చెప్పుకుంటూ ఉండగా రామచంద్ర మాత్రం తెలుగులో మాట్లాడుతూ ఉంటాడు.

రామచంద్ర పట్టుదల
మీరు ఎంతవరకు చదువుకున్నారు అని అడగడంతో కేవలం ఆరో తరగతి మాత్రమే చదువుకున్నాను అని సమాధానం ఇస్తాడు అయితే ఈ పోటీలో హోటల్ మేనేజ్మెంట్ లో డిగ్రీ చేసిన వారు పాల్గొన్నారు అని అనడంతో నా గురువు మా అమ్మ అంటూ ఆమె శిక్షణలో నేను ఎంతో నేర్చుకున్నానని రామచంద్ర చాలా తెలివిగా సమాధానమిస్తాడు. ఇక రామచంద్ర పట్టుదలను చూసి అక్కడ ఉన్న వారందరూ కూడా చప్పట్లు కొడతారు.

ముందే చెప్పాను అంటూ..
అయితే ముందుగా రామచంద్ర తడబడుతున్న విధానాన్ని టీవీలో చూసిన జ్ఞానాంబ అక్కడి నుంచి వెంటనే లేచి పోతుంది. కానీ ఆ తర్వాత రామచంద్ర ఏం మాట్లాడాడు అనేది ఆమె చూడదు. దీంతో ముందుగానే నా కొడుకు బాధ పడతాడు అని చెప్పాను కదా అనవసరంగా అక్కడికి వెళ్లాల్సి వచ్చింది అని జ్ఞానాంబ మనోవేదన చెందుతూ ఉంటుంది. మరొకవైపు మల్లిక కూడా మరింత బాధకు గురి చేసేలా మాట్లాడుతుంది. ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా వెంటనే వాళ్ళని తిరిగి ఇంటికి రమ్మని చెప్పాలి అని ఉంటుంది. కానీ మల్లిక నోరు మూసేందుకు విష్ణు ఆమెను లోపలికి తీసుకు వెళ్తాడు.

బాధలో జ్ఞానాంబ
ఇక అంతా సవ్యంగా సాగుతుంది అని మరొకవైపు గోవింద రాజులు కూడా జ్ఞానాంబకు భరోసా ఇస్తాడు. కానీ జ్ఞానాంబ మాత్రం కొడుకు గురించి ఆలోచిస్తూ బాధతో ఉంటుంది. రామచంద్ర ఫోన్ చేస్తున్నప్పటికీ కూడా మళ్ళీ ఎక్కడ బాధల గురించి చెబుతాడో అని కాస్త భయం తో ఫోన్ ఎత్తకుండానే ఉంటుంది. ఇక వెంటనే గోవిందరాజులు వచ్చి ఆ ఫోన్ తీసుకుని మాట్లాడతాడు. ఒకసారి అమ్మ తో నేను మాట్లాడాలి అని చాలా సంతోషంగా ఉన్నాను అని తప్పకుండా గెలుస్తాను అని చెప్పాలని ఉన్నట్లుగా రామ తండ్రికి చెప్తాడు. అయితే గోవిందరాజులు ఇప్పుడు మీ అమ్మ నిద్ర పోతుంది అని లేవగానే నేను ఫోన్ చేయిస్తాను అని అంటాడు. ఇక రామచంద్ర మళ్ళీ పోటీలోకి దిగుతాడు.

పోటీ డబ్బులు దానం..
అందరూ పోటీకి సిద్దమైన సమయంలో ఈ పోటీల్లో భాగంగా అందరికీ సమానంగా 1000 రూపాయలు మాత్రమే డబ్బులు ఇస్తామని వాటితోనే మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఆ వంటకాన్ని కి సంబంధించిన సరుకులు తెచ్చుకోవాలని నిర్వాహకులు తెలియజేస్తారు. అయితే రామచంద్ర సరుకులు తెచ్చుకోవడానికి బయటికి వెళ్ళగా అక్కడ ఒక యువకుడు తన తల్లికి ఆరోగ్యం బాగోలేదు అని హాస్పిటల్ కు తీసుకు వెళ్లాలి అని అర్జెంటుగా డబ్బులు ఇవ్వాలి అని అంటాడు. రామచంద్ర అతని పరిస్థితిని చూసి ₹500 ఇచ్చేస్తాడు. ఇక ఆ తరువాత మిగిలిన డబ్బుతో రామచంద్ ఆటను ఎలా ముందుకు సాగిస్తాడో రేపటి ఎపిసోడ్ చూడాలి. ఇక ఈ పోటీలో మొత్తం 30 మంది పాల్గొంటారు అని ఆ తరువాత ఫైనల్స్ లోకి 10 మంది వస్తారని అంటారు. ఇక విజేతలను నిర్ణయించేందుకు ప్రముఖ చెఫ్ సంజయ్, అలాగే బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక సింగ్ ప్రత్యేక అతిధులుగా వస్తారు.


Click it and Unblock the Notifications











