Janaki Kalaganaledu June 7th Episode: భర్తతో జానకి జిలేబి రొమాన్స్.. జ్ఞానాంబకు దొరికిపోయిన రామ!

జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. రొటీన్ గా అత్తా కోడళ్ల గొడవల కాన్సెప్ట్ అని కాకుండా కాస్త కలర్ఫుల్ ఎమోషన్స్ ను జోడించి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. జానకి - రామచంద్ర క్యూట్, రొమాంటిక్ సీన్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. అందమైన ప్రేమ మధ్యలో భార్య జానకి ఆశయం, భర్త రామచంద్ర అమాయకత్వ ప్రేమ, అత్త జ్ఞానాంబ కట్టుబాట్లు ఆప్యాయత.. ఈ సిరియల్ లో ప్రధాన అంశాలు. ఇక ఈ రోజు ప్రసారం కాబోయే 56వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

జానకి కోపంతో..

జానకి కోపంతో..

మామిడితోట రమ్మన్న విషయంపై స్నేహితురాలైన శ్రావణిని అరా తీసిన జానకి అసలు విషయం తెలుసుకుంటుంది. ఎందుకు రమ్మన్నావు ఏమైంది అని అడగ్గానే శ్రావణి సునంద దేవి రివెంజ్ గురించి చెబుతుంది. దీంతో తల్లి కొడుకులకు బుద్ధి చెబుతాను అంటూ జానకి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

శ్రావణి మాటలకు జానకి వెనుకడుగు

శ్రావణి మాటలకు జానకి వెనుకడుగు

అయితే శ్రావణి, జానకిని అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు అడగడం అంతమంచిది కాదని జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెనుతుంది. కేవలం నీ కోపం వలన నీ అత్తగారి ఇంటి పరువు మరియాధలకు భంగం కలుగుతుందని అందువలన ఈ గోడవను ప్రస్తుతానికి పక్కన పెట్టాలని ఏమైనా జరిగితే తరువాత ఆలోచిద్దాం అని వివరణ ఇస్తుంది. దీంతో జానకి కూడా వెనుకడుగు వేస్తుంది.

తల్లికి దొరికిపోయిన రామచంద్ర

తల్లికి దొరికిపోయిన రామచంద్ర

ఇక మరోవైపు రామచంద్ర అప్పుడే వేసిన వేడి వేడి జిలేబిలను తన భార్య కోసం తీసుకువెళ్లాలని అనుకుంటుంటాడు. పనిమనిషి చికిత్త కూడా మాటలతో బూస్ట్ ఇవ్వడంతో పనులన్నీ పక్కన పెట్టేసి భార్య కోసం స్వీట్ తీసుకువెళుతూ ఉంటాడు. ఇక ఇంతలో ఇంట్లోకి రాగానే జ్ఞానాంబ చూసి ఈ టైమ్ లో ఎందుకు వచ్చావు అని రామచంద్రను అడుగుతుంది.

జిలేబి రొమాన్స్

జిలేబి రొమాన్స్

జిలేబి వాసన కూడా వస్తోంది, నీ భార్య కోసం ఏమైనా తెచ్చావా అని జ్ఞానాంబ ఆరా తీస్తుంది. కానీ రామచంద్ర అదేమీ లేదని అంటూ తల్లికి అబద్ధం చెబుతాడు. అది చూసిన జానకి రామ బెడ్ రూమ్ లోకి రాగానే అడుగుతుంది. అబద్ధం ఎందుకు చెప్పారని. దాంతో సడన్ గా పని వదిలేసి వస్తే బావుండదు కదా అందుకే అలా చెప్పాను అని రామ వివరణ ఇస్తాడు. అనంతరం ఇద్దరు ఒకరికొకరు జిలేబి తినిపించుకుంటూ రొమాంటిక్ చూసుకుంటూ ఉంటారు.

సంతానలక్ష్మి పూజ

సంతానలక్ష్మి పూజ

ఇక మరోవైపు జ్ఞానాంబ సంతానలక్ష్మి పూజ చేయడానికి సిద్ధమవుతుంది. అందుకోసం భార్య భర్తకు తలంటీ నలుగు పెట్టడం సాంప్రదాయమని మల్లికకు, జనాకికి వివరిస్తుంది. ఒకవైపు మల్లికకు కసురుకుంటు చెప్పిన జ్ఞానాంబ మరోవైపు జానకికి తెలియని సాంప్రదాయమని తనలాగే చేయమని సున్నితంగా వివరణ ఇస్తుంది. దీంతో మల్లికకు చాలా కోపం వస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో పూజ అనంతరం ఏం జరుగుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X