Janaki Kalaganaledu June 7th: ఆటలో కొత్త ట్విస్ట్.. రామచంద్ర చెంప పగలగొట్టిన జానకి

జానకి కలగనలేదు మరింత ఆసక్తికరమైన అంశంతో ముందుకు సాగుతోంది. ఇక జానకి చదువు కోసమే భర్త రామ కన్నబాబు దగ్గర లక్ష రూపాయలు అప్పు చేస్తాడు. ఇక అతను తన తెలివితో స్వీట్ షాప్ ను దక్కించుకునే విధంగా రామచంద్ర దగ్గర సంతకాలు కూడా పెట్టించుకుంటాడు. ఇక జానకి తన భర్తను వంటల పోటీల్లో గెలిపించేందుకు ప్రయత్నం చేస్తోంది. కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 6.70 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 317వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..

వంటల పోటీలకు రామచంద్ర

వంటల పోటీలకు రామచంద్ర

తన భర్త రామచంద్ర ను అందరూ గౌరవించాలి అని జానకి ఎన్నో అవరోధాలను దాటుకుని వంటల పోటీ లకు సిద్ధం చేస్తుంది. అంతకుముందు అత్తగారు వద్దని ఎంత వాదించినా కూడా తన భర్త గెలుస్తాడు అని పూర్తి బాధ్యత తనదే అనే ఒక చాలెంజ్ కూడా విసురుతుంది. రామచంద్ర ఈ పోటీలో ఓడిపోతే మరోసారి నా మొహం నీకు చూపించను అని కూడా జానకి అత్తగారికి చెబుతుంది. దీంతో రామచంద్ర కూడా తప్పకుండా ఈ పోటీలో గెలుస్తాను అని ధీమాతో ఉంటాడు. అందరూ అలా చెబుతూ ఉండడంతో జ్ఞానాంబ ఏమీ అనలేకుండా కొడుకును హైదరాబాద్ వంటలు పోటీలకు పంపిస్తుంది.

 రామచంద్ర సహాయం..

రామచంద్ర సహాయం..

అయితే మొదటి రౌండ్లోనే రామచంద్ర ఊహించని అనుభవాలను ఎదుర్కొంటాడు. పోటీల్లో భాగంగా అందరికీ రూ.1000 ఇస్తారు. అయితే ఆ వెయ్యి రూపాయలలోనే మీకు కావలసిన సరుకులు తెచ్చుకోవాలి అని చెబుతారు. అందరూ ఒక సూపర్ మార్కెట్ కు వెళ్లి వారికి కావలసిన సరుకులు తెచ్చుకుంటారు. ఈ క్రమంలో అదే సూపర్ మార్కెట్ ముందు ఒక వ్యక్తి తన తల్లికి ఆరోగ్యం బాగోలేదు అని హాస్పిటల్ కు తీసుకువెళ్లాలి అని ఎవరైనా సహాయం చేయాలని బ్రతిమాలుతూ ఉంటాడు. ఇక వంటల పోటీల్లో పాల్గొనే కొంత మంది అతన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ రామచంద్ర మాత్రం అతని పరిస్థితి చూసి తల్లి ఆరోగ్యం కోసం అడుగుతున్నాడు కాబట్టి తన దగ్గర ఉన్న వెయ్యి రూపాయల లో ఐదు వందలు అతనికి ఇచ్చేస్తాడు.

 ఆలస్యంగా రామచంద్ర

ఆలస్యంగా రామచంద్ర


ఇక రామచంద్ర వంటల పోటీలకు కేవలం 500 రూపాయలతో సరుకులను తీసుకొస్తాడు. అయితే అందరూ వచ్చినప్పటికీ కూడా రామచంద్ర మాత్రం పోటీలోకి ఇంకా రాకపోవడంతో జానకి కంగారు పడుతూ ఉంటుంది. మొదటి రౌండ్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్న సమయంలో జానకి అడ్డుపడి మా ఆయన రామచంద్ర ఇంకా రాలేదు అని ఒక్క ఐదు నిమిషాలు ఆగండి అని నిర్వాహకులను ప్రాధేయపడుతోంది. అయితే ఇక్కడ ఒక్కరి కోసం ఇంత మందిని వెయిట్ చేయించడం ఏ మాత్రం కరెక్ట్ కాదు అని కూడా వారు అందరూ అంటారు. ఇక వారు మరో ఐదు నిమిషాల సమయం ఇవ్వడంతో అప్పుడే రామచంద్ర అక్కడికి వస్తాడు.

రామచంద్రపై హేళన

రామచంద్రపై హేళన

ఇక రామచంద్రను చూసి అందరూ కూడా హేళన చేస్తూ నవ్వుతూ ఉంటారు. కేవలం కొన్ని సరుకులు మాత్రమే తెచ్చుకొని మరికొన్ని కూరగాయలను కూడా తెచ్చుకుంటాడు. దీంతో అక్కడున్న జడ్జిలు మీకు ఇచ్చిన వెయ్యి రూపాయలకు సరిపడా సరుకులు ఎందుకు తెచ్చుకోలేదు అని ప్రశ్నిస్తారు. ఇక వెంటనే రామచంద్ర జరిగిన విషయం గురించి చెబుతూ ఉంటాడు. ఒక కొడుకు తన తల్లి కోసం డబ్బులు కావాలి అని అడగడంతో ఇచ్చాను అని చెప్పగా పక్కన ఉన్న పోటిదారులు ఆ విషయాన్ని పెద్దగా సమ్మరు. ఇది ఒక పెద్ద కథ అని హేళన చేస్తూ ఉంటారు. ఇక జానకి రామ గురించి తెలియకుండా మాట్లాడకండి అని ప్రశ్నిస్తుంది.

జ్ఞానాంబ ఆవేదన

జ్ఞానాంబ ఆవేదన

మరొకవైపు టీవీలో ప్రోగ్రాం ని చూస్తున్న తల్లి జ్ఞానాంబ కూడా మనోవేదనకు గురి అవుతుంది. నేను ముందే చెప్పాను ఈ పోటీలకు వెళ్ళకూడదు అని అక్కడ చదువుకున్న వాళ్ళ అందరి ముందు నా కొడుకు అవమానపడుతున్నాడు అని జ్ఞానాంబ అంటుంది. ఇక జడ్జీలు కూడా నువ్వు రూల్స్ ను సరిగా పాటించలేదు కాబట్టి ఈ పోటీ నుంచి మొదటి రౌండ్లోనే ఎలిమినేట్ చేస్తున్నాము అని చెబుతారు. దీంతో రామచంద్ర జానకి అక్కడి నుంచి వెళ్లిపోవాలని అనుకుంటారు.

ట్విస్ట్ ఇచ్చిన చెఫ్ మాస్టర్

ట్విస్ట్ ఇచ్చిన చెఫ్ మాస్టర్

ఇక అప్పుడే వీడియో కాల్ చేసిన ప్రముఖ చెఫ్ మాస్టర్ సంజయ్, రామచంద్రను ఆగమని చెబుతాడు. ఎందుకు అలా చేసావు అని అనడంతో.. తల్లి కంటే ఈ ప్రపంచంలో మరొక గొప్ప ప్రేమ ఏమీ ఉండదు అని ఇప్పుడు నేను ఆట కోసం చూసుకుంటే అక్కడ 500 రూపాయలకు ఒక ప్రాణం నిలువదు అని.. అందుకే అతనికి సహాయం చేశానని అంటాడు. అలాగే అంతకంటే గొప్ప గెలుపు మరొకటి ఉండదు అని కూడా రామచంద్ర చెబుతాడు. ఇక చివరికి సంజయ్ అసలు విషయం చెబుతారు. నిన్ను డబ్బులు అడిగింది మరెవరో కాదు అని.. అతను మా వాలేంటర్ అంటూ ఈ ఆటలో భాగంగా అది కూడా ఒక టాస్క్ అని అంటారు. ఎవరైతే అతనికి సహాయం చేస్తారో తదుపరి రౌండ్లోకి వెళతాను అని రామ గారు సహాయం చేయడం వలన ఆయన నెక్స్ట్ రౌండ్ లోకి వెళతారు అని అంటారు.

Recommended Video

కరోనా భారిన సోనియా - Get Well Soon
చెంప పగలగొట్టిన జానకి

చెంప పగలగొట్టిన జానకి


దీంతో రామచంద్ర జానకి ఒక్కసారిగా సంతోషిస్తారు. ఆ తర్వాత రామచంద్ర సంతోషంతో తల్లికి కూడా ఫోన్ చేస్తాడు. రేపు మరో నాలుగు రౌండ్స్ ఉన్నాయి అని అవి చాలా ముఖ్యం అని చెబుతారు. ఇక ఆ సంతోషంలో రామచంద్ర తన భార్యని తీసుకొని చార్మినార్ కూడా వెళతాడు. అక్కడ అనుకోకుండా జానకి తప్పి పోయే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో ఆమె కొంతసేపు టెన్షన్ పడుతుంది. ఇక హటాత్తుగా రామచంద్ర కనిపించడంతో అతని చెంప పగలగొడుతుంది. మరి జానకి కోపానికి రామచంద్ర ఎలా రియాక్ట్ అవుతాడో రేపటి ఎపిసోడ్ లో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X