Janaki Kalaganaledu June 8th Episode: పూజలో చికెన్ పిజ్జా.. జానకిని రిస్క్‌లో పడేసిన మల్లిక

జానకి కలగనలేదు సీరియల్ ఆఫ్ సెంచరీ ఎపిసోడ్స్ తోనే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. అత్త కోడళ్ల మధ్య కెమిస్ట్రీని విబిన్నంగా ప్రజెంట్ చేస్తూ ప్రతిరోజు మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు. జానకి - రామచంద్ర క్యూట్, రొమాంటిక్ సీన్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. అందమైన ప్రేమ మధ్యలో భార్య జానకి ఆశయం, అలాగే భర్త రామచంద్ర అమాయకత్వ ప్రేమ, అత్త జ్ఞానాంబ కట్టుబాట్లు ఆప్యాయత.. ఈ సిరియల్ లో ప్రధాన అంశాలు. ఇక ఈ రోజు ప్రసారం కాబోయే 57వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

 సంతాన లక్ష్మీ పూజ కోసం..

సంతాన లక్ష్మీ పూజ కోసం..

జ్ఞానాంబ సంతానలక్ష్మి పూజ చేయడం కోసం ఏర్పాట్లు సిద్ధం చేస్తుంది. భార్య భర్తకు తలంటీ నలుగు పెట్టడం సాంప్రదాయమని మల్లికకు, జనాకికి వివరిస్తుంది. ఒకవైపు మల్లికకు కసురుకుంటు చెప్పిన జ్ఞానాంబ మరోవైపు జానకికి తెలియని సాంప్రదాయమని తనలాగే చేయమని సున్నితంగా వివరణ ఇస్తుంది. దీంతో మల్లిక కోపం కట్టలు తెచ్చుకుంటుంది.

జానకి పొరపాటు చేయడంతో

జానకి పొరపాటు చేయడంతో

ఇక నలుగు పెట్టె సమయంలో జానకి భర్త నోటికి తగిలుస్తుంది. జ్ఞానాంబ ఆరా తీయడంతో తప్పు తనదే అన్నట్లు రామచంద్ర కవర్ చేస్తాడు. ఇక మరోవైపు మల్లిక మీ అన్నయ్యను చూసి నేర్చుకోండి భార్యతో ఎలా ఉండాలో అంటూ తన భర్త పై నవ్వుతూనే కసురుకుంటుంది.

పూజ కోసం ఉపవాసం ఉండాలని

పూజ కోసం ఉపవాసం ఉండాలని

ఇక పూజ పూర్తయ్యే వరకు అందరూ ఉపవాసం ఉండాలని జ్ఞానాంబ ఆదేశాలు జారీ చేస్తుంది. దాంతో మల్లిక షాక్ అవుతుంది. ఇంత సడన్ గా చెబితే ఎలా అంటూ మనసులో కంగారు పడుతుంది. అయినప్పటికీ మల్లిక అత్త మాటను పట్టించుకోకుండా ఆన్లైన్ లో ఏదైనా బుక్ చేసుకోవాలని అనుకుంటుంది.

వారసుడిని ఇవ్వాలని..

వారసుడిని ఇవ్వాలని..

ఇక పూజారి రావడంతో అందరూ పూజకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తుండగా జానకి అక్కడ లేదనే విషయాన్ని మల్లిక జ్ఞానాంబకు గుర్తు చేస్తుంది. ఇక ఇంతలో అక్కడికి వచ్చిన జానకితో జ్ఞానాంబ ఆరా తీస్తుంది. వచ్చినప్పటి నుంచి నువ్వు అదోలా ఉంటున్నావు. ఇంటికి పెద్ద కొడలివి ఈ ఇల్లు నిధి అందరితో కలిసి పోయి ఉండాలని అంటుంది. అదే విధంగా ఏడాది తిరిగేసరికి ఈ ఇంటికి వారసుడిని ఇవ్వాలని అందుకే ఈ పూజ చేయిస్తున్నట్లు జ్ఞానాంబ మాట్లాడుతుంది.

పూజ సమయంలో చికెన్ పిజ్జా

పూజ సమయంలో చికెన్ పిజ్జా

ఇక పూజకు సిద్దామవుతుండగా మల్లిక ఆన్ లైన్ లో చికెన్ పిజ్జాను ఆర్డర్ చేస్తుంది. డెలివరీ అబ్బాయ్ ను ఇంటికి రావద్దని సందు చివర వేయిట్ చేయమని మల్లిక ముందే హెచ్చరిస్తుంది. కానీ అతను ఇంటి వరకు రావడంతో జ్ఞానాంబకు విషయం తెలుస్తుంది. దీంతో మళ్ళీ బయటకు పంపించాలి అనే చర్చ మొదలవుతుంది. ఈసారి బయటకు వెళ్లాల్సింది మల్లిక కాదు జానకి అంటూ జ్ఞానాంబ చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. మరి నిజంగా జానకిని బయటకు పంపిస్తారో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X