Janaki Kalaganaledu June 8th: వంటల పోటీలలో రామచంద్రకు మరో షాక్.. జానకి తెలివికి ఫిదా!
జానకి కలగనలేదు మరింత ఆసక్తికరమైన అంశంతో ముందుకు సాగుతోంది. ఇక జానకి చదువు కోసమే కన్నబాబు దగ్గర రామచంద్ర లక్ష రూపాయలు అప్పు చేస్తాడు. ఆ అప్పును తీర్చేందుకు ఇంటర్నేషనల్ చెఫ్ పోటీలో ప్రైజ్ మనీ గెలవాలని కూడా అనుకుంటాడు. మరోవైపు కన్నబాబు తన తెలివితో రామచంద్ర స్వీట్ షాప్ ను దక్కించుకునే విధంగా ప్రయత్నం చేసాడు.
ఇక జానకి తన భర్తను వంటల పోటీల్లో గెలిపించేందుకు ప్రయత్నం చేస్తోంది. కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 6.70 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 318వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..

రామచంద్ర ఓడిపోతే..
రామచంద్రకు చదువు రాదు అని అతను అమాయకుడు అని కూడా చాలామంది హేళన చేస్తూ ఉంటారు. ఇక జానకి తన భర్తను ఎవరు కూడా మరొకసారి అలా అనకూడదు అనే అతన్ని ఎలాగైనా వంటల పోటీలలో గెలిచేలా చేయాలని నిర్ణయం తీసుకుంటుంది. ఇంటర్నేషనల్ కాంపిటీషన్ కు ఎంతో కష్టపడి సిద్ధం చేసిన జానకి మధ్యలో సమస్య ఎదురైనా కూడా అందరికీ నచ్చజెప్పి ఒప్పిస్తుంది.
అయితే రామచంద్ర తల్లి జ్ఞానాంబ మాత్రం తన కొడుకు అమాయకుడని అతనికి ఏమీ తెలియదు అని ఎంతో మంది చదువుకున్న వాళ్ళ మధ్యలో అతను గెలవాలేడు అని బాధపడుతూ ఉంటుంది. ఒకవేళ రామచంద్ర ఓడిపోతే తీవ్ర మనోవేదనకు గురి అవుతాడు అని.. కాంపిటీషన్ కు వెళ్లకపోవడమే మంచిది అని జానకికి సలహా ఇస్తుంది.
Recommended Video


తల్లి కోసం రామ సహాయం
మొత్తానికి జ్ఞానాంబకు నచ్చజెప్పి ఒప్పించిన జానకి రామచంద్రను హైదరాబాద్ తీసుకెళుతుంది. అయితే అక్కడ మొదటి రౌండ్ లోనే రామచంద్ర ఊహించని ఒక అనుభవాన్ని ఎదుర్కొంటాడు. మొదటి రౌండ్లో అందరికీ 1000 రూపాయలు ఇచ్చిన నిర్వాహకులు అందులోనే మీకు తగిన వంట సామానును సూపర్ మార్కెట్లో తెచ్చుకోవాలి అని చెబుతారు. ఇక రామచంద్ర షాపింగ్ కి వెళ్లే సమయంలో ఒక వ్యక్తి వచ్చి తన తల్లికి ఆరోగ్యం బాగోలేదని చెప్పడంతో 500 రూపాయలు ఇచ్చేస్తాడు. ఇక మిగిలిన ఐదు వందల రూపాయలు అని తనకు కావాల్సిన వంటసామాన్లు తెచ్చుకుంటాడు.

దొంగ పొలీస్ కు జానకి ఝలక్
ఇక ఆ తర్వాత రామచంద్ర ఆట నియమాలను ఫాలో కావడం లేదని మొదట రౌండ్ లోనే ఎలిమినేట్ చేయాలని అనుకుంటారు. కానీ ఆ తర్వాత రామచంద్ర చేసిన సహాయం కూడా ఆటలో ఒక భాగమే అంటూ మానవత్వాన్ని చాటుకుని గొప్పగా ప్రవర్తించాడని అందుకే అతన్ని తదుపరి రౌండ్లోకి సెలెక్ట్ చేస్తున్నట్లుగా రిజల్ట్ ను అందిస్తారు.
ఇక రామచంద్ర జానకి ఆ సంతోషంలో హైదరాబాద్ మొత్తం తిరుగుతూ ఉంటారు. అయితే ఒక రోడ్డు దగ్గర జానకి రామచంద్ర కలిసి ఫోటో తీసుకుంటుండగా ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చి ఇక్కడ ఫోటోలు దిగకూడదు అని ఐదు వేల రూపాయలు అడుగుతాడు. అయితే అతను దొంగ పోలీస్ అని గుర్తించిన జానకి వెంటనే ఐడి కార్డ్ చూపించాలి అని అంటుంది. లేదంటే పోలీస్ స్టేషన్ కి వెళ్దామని చెప్పడంతో అతను అక్కడినుంచి పారిపోతాడు.

రామ చెంప పగలగొట్టిన జానకి
ఇక జానకి తెలివికి ఫిదా అయిన రామచంద్ర మీరు తప్పకుండా ఐపీఎస్ అవుతారు అని చెబుతాడు. ఆ తర్వాత చార్మినార్ దగ్గర రామచంద్ర జానకిని ఒంటరిగా వదిలేసి గాజులు కొనడానికి వెళ్తాడు. ఆ సమయంలో జానకి తన భర్త ఎక్కడికి వెళ్లాడో అని చాలా ఆందోళన పడుతుంది. ఇక వెంటనే రామచంద్ర కనిపించేసరికి అతని చెంప పగల గొడుతుంది. హైదరాబాద్ అసలే మీకు కొత్త ఎంత కంగారుపడ్డానో తెలుసా అని అంటుంది. ఇక రామచంద్ర నీకు ఈ గాజులు కొనడానికి వెళ్లాము అని చెప్పడంతో జానకి ఎమోషనల్ అవుతుంది.

మల్లిక తప్పుడు మాటలు
ఇక తర్వాత తదుపరి రౌండ్ కు సిద్ధమైన రామచంద్ర ఎలాగైనా గెలవాలని అనుకుంటాడు. అప్పుడే అతనికి ధీమాగా ఉండాలని జానకి భరోసా ఇస్తుంది. ఇక మరోవైపు రామచంద్ర తదుపరి రౌండ్లో గెలవడు అని చిన్న కోడలు మల్లిక అత్త గారికి చెబుతోంది. ఊర్లో వాళ్ళందరూ కూడా రామచంద్ర గురించి ఎన్నోరకాలుగా అనుకుంటున్నారు అని చెప్పడంతో గోవిందరాజులు ఆమెపై అసహనం వ్యక్తం చేస్తాడు. అలా ఏమీ జరగదు అనే ఊళ్ళో వాళ్ళు చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు అని గోవిందరాజులు తన భార్యకు అర్థమయ్యేలా చెబుతాడు.

రెండో రౌండ్ లో షాక్
ఇక మరోవైపు సెకండ్ రౌండ్ కోసం న్యాయనిర్ణేతలుగా ప్రముఖ హీరోయిన్ ప్రభా రమేష్, చెఫ్ మాస్టర్ తుమ్మ సంజయ్ అలాగే బిగ్ బస్ కంటెస్టెంట్ ప్రియాంక సింగ్ కూడా ప్రత్యేక అతిధులుగా వస్తారు. అయితే రెండవ రౌండ్ లో వెస్టర్న్ ఫుడ్ ప్రిపేర్ చేయాలి అని చెప్పడంతో రామచంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు. అలాంటి వాటిని అతను ఎప్పుడూ చేసింది లేదు. అంతే కాకుండా ఆ వంట చేసిన తర్వాత ప్రభా రమేష్ రుచి చూసి ఇంకా ఈ వంట పూర్తి కాలేదు అని చెప్పడంతో రామచంద్ర జానకి ఒక్కసారిగా షాక్ అవుతారు. మరి ఈ రౌండ్లో రామచంద్ర గెలుస్తాడో లేదో తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.


Click it and Unblock the Notifications











